News in pics : చిత్రం చెప్పే సంగతులు (20-09-2023)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..  

Updated : 20 Sep 2023 05:51 IST
1/6
ఆంధ్ర-ఒడిశా సరిహద్దు గ్రామాలు అభివృద్ధికి దూరంగానే ఉండిపోతున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. గసభ పంచాయతీ సిమిలిగుడ గ్రామానికి చెందిన రమేష్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో కుటుంబీకులు ఆయనను డోలి మోతతో ఆసుపత్రికి తరలించారు.  గసభ పంచాయతీలోని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌, ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి, ఎమ్మెల్యే ఫాల్గుణకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోయిందని మాజీ సర్పంచి సురేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు గ్రామాలు అభివృద్ధికి దూరంగానే ఉండిపోతున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. గసభ పంచాయతీ సిమిలిగుడ గ్రామానికి చెందిన రమేష్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో కుటుంబీకులు ఆయనను డోలి మోతతో ఆసుపత్రికి తరలించారు. గసభ పంచాయతీలోని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌, ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి, ఎమ్మెల్యే ఫాల్గుణకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోయిందని మాజీ సర్పంచి సురేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు.
2/6
శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు, వాహనసేవలు సోమవారం తిరుమలలో వైభవంగా ప్రారంభమయ్యాయి. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు స్వామివారు తొలి వాహనమైన ఏడు పడగల ఆదిశేషునిపై ఉభయ దేవేరులతో వైకుంఠనాథుని అలంకారంలో తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు, వాహనసేవలు సోమవారం తిరుమలలో వైభవంగా ప్రారంభమయ్యాయి. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు స్వామివారు తొలి వాహనమైన ఏడు పడగల ఆదిశేషునిపై ఉభయ దేవేరులతో వైకుంఠనాథుని అలంకారంలో తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు
3/6
4/6
5/6
గద్వాల వేదనగర్‌ కాలనీ జిహ్వేశ్వర కల్యాణ మంటపంలో స్వకుళసాళి యువజన సంఘం ఆధ్వర్యంలో చంద్రయాన్‌ 3 నమూనాలో కొలువుదీరిన గణనాయకుడు. గద్వాల వేదనగర్‌ కాలనీ జిహ్వేశ్వర కల్యాణ మంటపంలో స్వకుళసాళి యువజన సంఘం ఆధ్వర్యంలో చంద్రయాన్‌ 3 నమూనాలో కొలువుదీరిన గణనాయకుడు.
6/6
 మోదీ సర్కార్‌ పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టడాన్ని హర్షిస్తూ మంగళవారం కరీంనగర్‌లో మహిళా మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో టపాసులు పేల్చి, మిఠాయిలు పంచి పెట్టారు. డోలు వాయిస్తూ సంబరాలు చేసుకున్నారు. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ, కార్పొరేటర్‌ బండ సుమ, తదితరులు పాల్గొన్నారు. మోదీ సర్కార్‌ పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టడాన్ని హర్షిస్తూ మంగళవారం కరీంనగర్‌లో మహిళా మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో టపాసులు పేల్చి, మిఠాయిలు పంచి పెట్టారు. డోలు వాయిస్తూ సంబరాలు చేసుకున్నారు. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ, కార్పొరేటర్‌ బండ సుమ, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని