News In Pics: చిత్రం చెప్పే సంగతులు 01 (21-09-2023)

Updated : 21 Sep 2023 03:39 IST
1/11
హైదరాబాద్‌: షాయినాయత్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా బలభద్ర, సుభద్ర, పూరీ జగన్నాథుడి ఆకృతిలో కొలువుదీరిన మూషికవాహనుడు .
హైదరాబాద్‌: షాయినాయత్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా బలభద్ర, సుభద్ర, పూరీ జగన్నాథుడి ఆకృతిలో కొలువుదీరిన మూషికవాహనుడు .
2/11
హైదరాబాద్‌: వనస్థలిపురం రెడ్‌ట్యాంక్‌ వద్ద అభిమన్యు యూత్‌ అసోసియేషన్‌ కొబ్బరి కుడకల ఏకదం హైదరాబాద్‌: వనస్థలిపురం రెడ్‌ట్యాంక్‌ వద్ద అభిమన్యు యూత్‌ అసోసియేషన్‌ కొబ్బరి కుడకల ఏకదం
3/11
హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ జనరల్‌ బజార్‌ శ్రీ గణేశ్‌ ఫ్రెండ్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముత్యాల గణపతి. హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ జనరల్‌ బజార్‌ శ్రీ గణేశ్‌ ఫ్రెండ్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముత్యాల గణపతి.
4/11
విశాఖ:  అనంతగిరి ఘాట్‌రోడ్డులో ఎక్కడ చూసినా మంచు అందాలు పర్యాటకులను అబ్బుర పరిచాయి. అయిదు నెంబర్‌ మలుపు నుంచి మిలియగుడ వరకు  ఘాట్‌ రోడ్డులో ఎక్కడ చూసినా కొండలను తాకుతూ మంచు అందాలు అందరినీ అకర్షిస్తున్నాయి. విశాఖ: అనంతగిరి ఘాట్‌రోడ్డులో ఎక్కడ చూసినా మంచు అందాలు పర్యాటకులను అబ్బుర పరిచాయి. అయిదు నెంబర్‌ మలుపు నుంచి మిలియగుడ వరకు ఘాట్‌ రోడ్డులో ఎక్కడ చూసినా కొండలను తాకుతూ మంచు అందాలు అందరినీ అకర్షిస్తున్నాయి.
5/11
మహబూబాబాద్‌: వానరాల బెడద దేవుడికీ తప్పడం లేదు. వినాయక మండపాల్లో ఉంచిన పండ్లు, ప్రసాదాలు, లడ్డూలను కోతులు ఎత్తుకెళ్తున్నాయి. వాటి నుంచి రక్షణకు మండపాల నిర్వాహకులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు మహబూబాబాద్‌: వానరాల బెడద దేవుడికీ తప్పడం లేదు. వినాయక మండపాల్లో ఉంచిన పండ్లు, ప్రసాదాలు, లడ్డూలను కోతులు ఎత్తుకెళ్తున్నాయి. వాటి నుంచి రక్షణకు మండపాల నిర్వాహకులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు
6/11
మహబూబ్‌నగర్‌: జాతీయ రహదారి - 44పై రాజాపూర్‌ మండల కేంద్రం వద్ద బుధవారం కనిపించిన దృశ్యమిది. సీతాఫలాల సీజన్‌ కావడంతో గ్రామీణ ప్రాంత మహిళలు జాతీయ రహదారి పక్కన కూర్చొని అమ్మకాలు సాగిస్తున్నారు. కొనుగోలుదారులు వాహనాలను పక్కన కాకుండా రహదారిపైనే నిలిపి వారితో బేరమాడుతున్నారు. మహబూబ్‌నగర్‌: జాతీయ రహదారి - 44పై రాజాపూర్‌ మండల కేంద్రం వద్ద బుధవారం కనిపించిన దృశ్యమిది. సీతాఫలాల సీజన్‌ కావడంతో గ్రామీణ ప్రాంత మహిళలు జాతీయ రహదారి పక్కన కూర్చొని అమ్మకాలు సాగిస్తున్నారు. కొనుగోలుదారులు వాహనాలను పక్కన కాకుండా రహదారిపైనే నిలిపి వారితో బేరమాడుతున్నారు.
7/11
హైదరాబాద్‌: రవీంద్రభారతిలో బుధవారం రాత్రి ‘శ్రీరామ నాటక నికేతన్‌’ భాషా సాంస్కృతిక శాఖ, శ్రీరామ నవమి కల్చరల్‌ ఫెస్టివల్‌ (సికింద్రాబాద్‌) ఆధ్వర్యంలో నాట్యగురువు వి.ఎస్‌.రామమూర్తికి నివాళిగా ‘గురు స్మరణే’ శీర్షికన ప్రత్యేక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్‌: రవీంద్రభారతిలో బుధవారం రాత్రి ‘శ్రీరామ నాటక నికేతన్‌’ భాషా సాంస్కృతిక శాఖ, శ్రీరామ నవమి కల్చరల్‌ ఫెస్టివల్‌ (సికింద్రాబాద్‌) ఆధ్వర్యంలో నాట్యగురువు వి.ఎస్‌.రామమూర్తికి నివాళిగా ‘గురు స్మరణే’ శీర్షికన ప్రత్యేక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
8/11
హైదరాబాద్‌: ఎన్నికల గణపతి.. ఫ్యూచర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు ఇలా..  ఇటు మోదీ.. అటు కేసీఆర్‌.. ఓటు వేస్తున్న మహిళ చిత్రం. హైదరాబాద్‌: ఎన్నికల గణపతి.. ఫ్యూచర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు ఇలా.. ఇటు మోదీ.. అటు కేసీఆర్‌.. ఓటు వేస్తున్న మహిళ చిత్రం.
9/11
హైదరాబాద్‌: గచ్చిబౌలి బయోడైవర్సిటీ  ప్రధాన రహదారిలో రోడ్డు పనులు అసంపూర్తిగా వదిలేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు వర్షాలతో బుధవారం ఓ కారు ఇలా  దిగబడిపోయింది. హైదరాబాద్‌: గచ్చిబౌలి బయోడైవర్సిటీ ప్రధాన రహదారిలో రోడ్డు పనులు అసంపూర్తిగా వదిలేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు వర్షాలతో బుధవారం ఓ కారు ఇలా దిగబడిపోయింది.
10/11
గణేష్‌ విగ్రహాన్ని నాలుగు చక్రాల బైక్‌ ముందు భాగంలో పెట్టుకుని సికింద్రాబాద్‌ కర్బలమైదానం వద్దకు వచ్చిన యువకుడు. గణేష్‌ విగ్రహాన్ని నాలుగు చక్రాల బైక్‌ ముందు భాగంలో పెట్టుకుని సికింద్రాబాద్‌ కర్బలమైదానం వద్దకు వచ్చిన యువకుడు.
11/11
హైదరాబాద్‌: అద్దాలతో ఆది దేవ.. వెస్ట్‌ మారేడ్‌పల్లి ఫ్రెండ్స్‌ యూత్‌ మండపంలో. హైదరాబాద్‌: అద్దాలతో ఆది దేవ.. వెస్ట్‌ మారేడ్‌పల్లి ఫ్రెండ్స్‌ యూత్‌ మండపంలో.

మరిన్ని