News In Pics: చిత్రం చెప్పే సంగతులు 01 (22-09-2023)

Updated : 22 Sep 2023 05:23 IST
1/10
మహబూబ్‌నగర్‌: ఆకుపచ్చని చెట్టు కింద పరచిన ఎర్రటి తివాచి ఎంత బాగుందో.. అనుకుంటున్నారా.. అయితే మీరు పప్పులో కాలేసినట్లే. అది తివాచి కాదు.. ఆ చెట్టు నుంచి రాసిన పూలు. అడ్డాకుల మండలం కందూరులోని ప్రసిద్ధ శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద 27 కదంబ వృక్షాలు ఉన్నాయి. వాటిని 27 నక్షత్రాలకు ప్రతీకగా భక్తులు భావిస్తారు.

మహబూబ్‌నగర్‌: ఆకుపచ్చని చెట్టు కింద పరచిన ఎర్రటి తివాచి ఎంత బాగుందో.. అనుకుంటున్నారా.. అయితే మీరు పప్పులో కాలేసినట్లే. అది తివాచి కాదు.. ఆ చెట్టు నుంచి రాసిన పూలు. అడ్డాకుల మండలం కందూరులోని ప్రసిద్ధ శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద 27 కదంబ వృక్షాలు ఉన్నాయి. వాటిని 27 నక్షత్రాలకు ప్రతీకగా భక్తులు భావిస్తారు.
2/10
3/10
హైదరాబాద్‌: చారిత్రక చార్మినార్‌ వద్ద గురువారం ఉదయం ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ట్రోఫీని ప్రదర్శించారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసొసియేషన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి సునీల్‌ కాంటే ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రోఫీ ప్రదర్శనను క్రికెట్‌ క్రీడాభిమానులు ఆసక్తిగా వీక్షించారు. హైదరాబాద్‌: చారిత్రక చార్మినార్‌ వద్ద గురువారం ఉదయం ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ట్రోఫీని ప్రదర్శించారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసొసియేషన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి సునీల్‌ కాంటే ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రోఫీ ప్రదర్శనను క్రికెట్‌ క్రీడాభిమానులు ఆసక్తిగా వీక్షించారు.
4/10
హైదరాబాద్‌: గచ్చిబౌలి నుంచి ఖాజాగూడ లింకు రోడ్డు మార్గంలో కొండను తొలచిన రాళ్లను డివైడర్ల మధ్య ఏర్పాటు చేశారు. ఇటీ¨వల సుందరీకరణలో భాగంగా ఆ రాళ్లపై జంతువులు, పక్షుల చిత్రాలను వేసి కొత్తరూపమిచ్చారు. హైదరాబాద్‌: గచ్చిబౌలి నుంచి ఖాజాగూడ లింకు రోడ్డు మార్గంలో కొండను తొలచిన రాళ్లను డివైడర్ల మధ్య ఏర్పాటు చేశారు. ఇటీ¨వల సుందరీకరణలో భాగంగా ఆ రాళ్లపై జంతువులు, పక్షుల చిత్రాలను వేసి కొత్తరూపమిచ్చారు.
5/10
హైదరాబాద్‌: అబిడ్స్‌లోని ఓ దాబాలో కొలువుదీరిన గణనాథుడికి గురువారం 56 రకాల మిఠాయిలను నైవేద్యంగా పెట్టారు. ఏకదంతుడి వాహనమైన మూషికాలు స్వయంగా తయారు చేసినట్లుగా అలంకరించి.. ఆ వంటకాలను పార్వతీదేవి తన కుమారుడికి తినిపిస్తున్నట్లుగా తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటోంది. 
హైదరాబాద్‌: అబిడ్స్‌లోని ఓ దాబాలో కొలువుదీరిన గణనాథుడికి గురువారం 56 రకాల మిఠాయిలను నైవేద్యంగా పెట్టారు. ఏకదంతుడి వాహనమైన మూషికాలు స్వయంగా తయారు చేసినట్లుగా అలంకరించి.. ఆ వంటకాలను పార్వతీదేవి తన కుమారుడికి తినిపిస్తున్నట్లుగా తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటోంది.
6/10
హైదరాబాద్‌: చార్మినార్‌ వద్ద గురువారం జపాన్‌ సందర్శకులు సందడి చేశారు. ఉస్మానియా బిస్కట్లు తింటూ ఇరానీ చాయ్‌ తాగుతూ ఆస్వాదించారు. వివిధ వస్తువులు కొనుగోలు చేశారు. హైదరాబాద్‌: చార్మినార్‌ వద్ద గురువారం జపాన్‌ సందర్శకులు సందడి చేశారు. ఉస్మానియా బిస్కట్లు తింటూ ఇరానీ చాయ్‌ తాగుతూ ఆస్వాదించారు. వివిధ వస్తువులు కొనుగోలు చేశారు.
7/10
మహారాష్ట్రలోని బుల్‌ఢాణా జిల్లాలో వంద కిలోల వెండి గణేశుడి ప్రతిమను తయారు చేశారు. జాల్నా జిల్లాలోని అనోఖా గణేశ్‌ మండల్‌ నిర్వాహకులు ఇచ్చిన ప్రత్యేక ఆర్డర్‌ మేరకు ఖామ్‌గావ్‌కు చెందిన విశ్వకర్మ సిల్వర్‌ హౌస్‌ ఈ విగ్రహాన్ని రూపొందించింది. మహారాష్ట్రలోని బుల్‌ఢాణా జిల్లాలో వంద కిలోల వెండి గణేశుడి ప్రతిమను తయారు చేశారు. జాల్నా జిల్లాలోని అనోఖా గణేశ్‌ మండల్‌ నిర్వాహకులు ఇచ్చిన ప్రత్యేక ఆర్డర్‌ మేరకు ఖామ్‌గావ్‌కు చెందిన విశ్వకర్మ సిల్వర్‌ హౌస్‌ ఈ విగ్రహాన్ని రూపొందించింది.
8/10
జమ్మూ-కశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న అజోట్‌ యుద్ధ స్మారకం వద్ద ఏర్పాటుచేసిన 70 అడుగుల ఎత్తైన జాతీయ పతాకం. ఫ్లాగ్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా సమనయంతో దీనిని ఏర్పాటుచేసినట్లు రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. జమ్మూ-కశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న అజోట్‌ యుద్ధ స్మారకం వద్ద ఏర్పాటుచేసిన 70 అడుగుల ఎత్తైన జాతీయ పతాకం. ఫ్లాగ్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా సమనయంతో దీనిని ఏర్పాటుచేసినట్లు రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.
9/10
యెమెన్‌లోని సనాను స్వాధీనం చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వార్షికోత్సవ కవాతులో పాల్గొన్న హౌతీ దివ్యాంగ ఫైటర్లు. యెమెన్‌లోని సనాను స్వాధీనం చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వార్షికోత్సవ కవాతులో పాల్గొన్న హౌతీ దివ్యాంగ ఫైటర్లు.
10/10
బొలీవియాలోని లా పాజ్‌లో దివ్యాంగుల కోసం సిద్ధంచేసిన ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన హైపర్‌ రియలిస్టిక్‌ ప్రోస్థెటిక్‌ చేతులు. బొలీవియాలోని లా పాజ్‌లో దివ్యాంగుల కోసం సిద్ధంచేసిన ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన హైపర్‌ రియలిస్టిక్‌ ప్రోస్థెటిక్‌ చేతులు.

మరిన్ని