News In Pics: చిత్రం చెప్పే సంగతులు 01 (23-09-2023)

Updated : 23 Sep 2023 04:23 IST
1/11
ఖమ్మం: కల్లూరు కనకగిరి గుట్టలపై మేఘాలు కనువిందు చేశాయి. తల్లాడ మండలంలో శుక్రవారం తెల్లవారుజామున వర్షం కురిసింది. దీంతో గుట్టల్లోంచి వచ్చిన పొగలతో కలిసి మేఘాలు పయనించినట్లు కన్పించాయి. ఖమ్మం: కల్లూరు కనకగిరి గుట్టలపై మేఘాలు కనువిందు చేశాయి. తల్లాడ మండలంలో శుక్రవారం తెల్లవారుజామున వర్షం కురిసింది. దీంతో గుట్టల్లోంచి వచ్చిన పొగలతో కలిసి మేఘాలు పయనించినట్లు కన్పించాయి.
2/11
ఆదిలాబాద్‌: మందమర్రి ఒర్రెగడ్డకు చెందిన కోపెల రాము రావి ఆకులపై మూడు రకాలు తీర్చిదిద్దిన లంబోదరుని ఆకృతులు ఆకట్టుకుంటున్నాయి. రావి ఆకులపై చిత్రాలను తిలకించేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. ఆదిలాబాద్‌: మందమర్రి ఒర్రెగడ్డకు చెందిన కోపెల రాము రావి ఆకులపై మూడు రకాలు తీర్చిదిద్దిన లంబోదరుని ఆకృతులు ఆకట్టుకుంటున్నాయి. రావి ఆకులపై చిత్రాలను తిలకించేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.
3/11
ఆదిలాబాద్‌: తలమడుగు మండలం పల్సి(బి) గ్రామానికి వెళ్లే బీటీ రహదారి నిర్మాణ సమయంలో అధికారులు పర్యవేక్షణ చేయకపోవడంతో గుత్తేదారు ఇష్టారాజ్యంగా పనులు చేశారు. దీంతో అస్తవ్యస్తంగా ఉన్న రహదారి మధ్యలో గడ్డి మొలకెత్తి రాకపోకలకు ప్రమాదకరంగా మారింది. ఆదిలాబాద్‌: తలమడుగు మండలం పల్సి(బి) గ్రామానికి వెళ్లే బీటీ రహదారి నిర్మాణ సమయంలో అధికారులు పర్యవేక్షణ చేయకపోవడంతో గుత్తేదారు ఇష్టారాజ్యంగా పనులు చేశారు. దీంతో అస్తవ్యస్తంగా ఉన్న రహదారి మధ్యలో గడ్డి మొలకెత్తి రాకపోకలకు ప్రమాదకరంగా మారింది.
4/11
హైదరాబాద్‌:  కూకట్‌పల్లిలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి రంగధాముని   శుక్రవారం చెరువు నాలాలో   తీవ్ర స్థాయిలో రసాయన నురగలు వచ్చాయి. ఈ ప్రాంతంలో     వెళుతున్న వాహనదారులు ఘాటు వాసనలతో ఉక్కిరి బిక్కరయ్యారు. హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి రంగధాముని శుక్రవారం చెరువు నాలాలో తీవ్ర స్థాయిలో రసాయన నురగలు వచ్చాయి. ఈ ప్రాంతంలో వెళుతున్న వాహనదారులు ఘాటు వాసనలతో ఉక్కిరి బిక్కరయ్యారు.
5/11
హైదరాబాద్‌:  సాఫ్ట్‌వేర్, బయో ఇన్ఫర్మేటిక్, ఇంజినీరింగ్‌ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు నిలయమైన హైటెక్‌ సిటీ స్వరూపమిది. టీహబ్‌ వద్ద భారీ భవనాలు సింగపూర్‌ను తలపిస్తున్నాయి. హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్, బయో ఇన్ఫర్మేటిక్, ఇంజినీరింగ్‌ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు నిలయమైన హైటెక్‌ సిటీ స్వరూపమిది. టీహబ్‌ వద్ద భారీ భవనాలు సింగపూర్‌ను తలపిస్తున్నాయి.
6/11
హైదరాబాద్‌:  చారిత్రక చార్మినార్‌ వద్ద శుక్రవారం యువతులు సందడి చేశారు. గాజులు, సుగంధ ద్రవ్యాలు, దుస్తులు కొనుగోలు చేశారు. హైదరాబాద్‌: చారిత్రక చార్మినార్‌ వద్ద శుక్రవారం యువతులు సందడి చేశారు. గాజులు, సుగంధ ద్రవ్యాలు, దుస్తులు కొనుగోలు చేశారు.
7/11
కేదార్‌నాథ్‌ మార్గంలోని కొండపై గణేశుడు కూర్చున్నట్లుగా కనిపిస్తోందా ఈ దృశ్యం?.. నిజానికి ఇది మహారాష్ట్ర రాజధాని  ముంబయిలోని ఓ గణేశ్‌ మండపం. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రముఖ కళాకారుడు ఫ్రాంక్లిన్‌ పాల్‌ ఈ ప్రత్యేక వినాయక మండపానికి ప్రాణం పోశారు. కేదార్‌నాథ్‌ మార్గంలోని కొండపై గణేశుడు కూర్చున్నట్లుగా కనిపిస్తోందా ఈ దృశ్యం?.. నిజానికి ఇది మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ఓ గణేశ్‌ మండపం. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రముఖ కళాకారుడు ఫ్రాంక్లిన్‌ పాల్‌ ఈ ప్రత్యేక వినాయక మండపానికి ప్రాణం పోశారు.
8/11
గణేశ్‌ నవరాత్రుల సందర్భంగా కోల్‌కతాలో వినూత్నంగా ఏర్పాటుచేసిన పూజామండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.గణేశుని విగ్రహం భక్తులు పాదాలను తాకి నమస్కరించిన వెంటనే లేచి నిలబడి ఆశీర్వాదం అందిస్తోంది. గణేశ్‌ నవరాత్రుల సందర్భంగా కోల్‌కతాలో వినూత్నంగా ఏర్పాటుచేసిన పూజామండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.గణేశుని విగ్రహం భక్తులు పాదాలను తాకి నమస్కరించిన వెంటనే లేచి నిలబడి ఆశీర్వాదం అందిస్తోంది.
9/11
మహారాష్ట్రలోని నాసిక్‌లో లభిస్తున్న బంగారు కుడుములు (మోదక్‌లు) అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 24 క్యారెట్ల బంగారు పూతతో తయారుచేసిన ఈ కుడుములను కిలో రూ.16 వేలకు వర్తకులు అమ్ముతున్నారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో లభిస్తున్న బంగారు కుడుములు (మోదక్‌లు) అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 24 క్యారెట్ల బంగారు పూతతో తయారుచేసిన ఈ కుడుములను కిలో రూ.16 వేలకు వర్తకులు అమ్ముతున్నారు.
10/11
గుజరాత్‌లోని సూరత్‌లో వజ్రాల వ్యాపారి కనుభాయ్‌ అసోదరియా ఏటా వజ్ర గణపతికి పూజలు చేస్తారు. 182.3 క్యారెట్లతో 36.5 గ్రాముల బరువు ఉన్న ఈ వజ్ర గణపతిని ఏడాదికి ఒక్కరోజు మాత్రమే బయటకు తీస్తారు.ఆ రోజున ప్రత్యేక దర్శనానికి భక్తులను కూడా అనుమతిస్తారు. గుజరాత్‌లోని సూరత్‌లో వజ్రాల వ్యాపారి కనుభాయ్‌ అసోదరియా ఏటా వజ్ర గణపతికి పూజలు చేస్తారు. 182.3 క్యారెట్లతో 36.5 గ్రాముల బరువు ఉన్న ఈ వజ్ర గణపతిని ఏడాదికి ఒక్కరోజు మాత్రమే బయటకు తీస్తారు.ఆ రోజున ప్రత్యేక దర్శనానికి భక్తులను కూడా అనుమతిస్తారు.
11/11
ముంబయిలోని ఘట్‌కోపర్‌ ప్రాంతానికి చెందిన రాహుల్‌ వరియా (26) అనే యువకుడు తమ ఇంట ప్రతిష్ఠించిన వినాయకుడిని మెట్రో రైలు ఎక్కించాడు. నగర రవాణా వ్యవస్థకు కృతజ్ఞతగా రాహుల్‌ ఈ మెట్రో గణపతిని సృష్టించాడు. ముంబయిలోని ఘట్‌కోపర్‌ ప్రాంతానికి చెందిన రాహుల్‌ వరియా (26) అనే యువకుడు తమ ఇంట ప్రతిష్ఠించిన వినాయకుడిని మెట్రో రైలు ఎక్కించాడు. నగర రవాణా వ్యవస్థకు కృతజ్ఞతగా రాహుల్‌ ఈ మెట్రో గణపతిని సృష్టించాడు.

మరిన్ని