News In Pics: చిత్రం చెప్పే సంగతులు 01 (24-09-2023)

Updated : 24 Sep 2023 04:07 IST
1/10
అమరావతి: నిత్యం వందల మంది రోగులు రాకపోకలు, పదుల కొద్దీ అంబులెన్స్‌లు తిరిగే కొత్తప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో శనివారం సాయంత్రం అంధకారం అలముకుంది. ఈదురుగాలులకు సాయంత్రం 5  నుంచి 6.30 గంటల వరకు విద్యుత్తు దీపాలు వెలగక రోగులు, వారి సహాయకులు అవస్థలు పడ్డారు. వాహనాల కాంతుల వెలుగుల్లోనే గడిపారు. అమరావతి: నిత్యం వందల మంది రోగులు రాకపోకలు, పదుల కొద్దీ అంబులెన్స్‌లు తిరిగే కొత్తప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో శనివారం సాయంత్రం అంధకారం అలముకుంది. ఈదురుగాలులకు సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు విద్యుత్తు దీపాలు వెలగక రోగులు, వారి సహాయకులు అవస్థలు పడ్డారు. వాహనాల కాంతుల వెలుగుల్లోనే గడిపారు.
2/10
హైదరాబాద్: విద్యార్థినులు వేదికపై హొయలు పోయారు.. సాంస్కృతిక ప్రదర్శనలతో సందడి చేశారు. ఐఎస్‌ సదన్‌ డివిజన్‌ సాన్వి డిగ్రీ కళాశాల స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు అలరించాయి. హైదరాబాద్: విద్యార్థినులు వేదికపై హొయలు పోయారు.. సాంస్కృతిక ప్రదర్శనలతో సందడి చేశారు. ఐఎస్‌ సదన్‌ డివిజన్‌ సాన్వి డిగ్రీ కళాశాల స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు అలరించాయి.
3/10
4/10
మంచిర్యాలలోని విశ్వనాథ ఆలయ కాలక్షేప మండపంలో ఏర్పాటు చేసిన ఓ గణేశ్‌ విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. ప్రత్యేక సాంకేతికతతో రూపొందించిన గణపతి విగ్రహం కూర్చొని ఉంటోంది. భక్తులు దగ్గరికి రాగానే వారి తలపై చేతులతో దీవిస్తోంది. మంచిర్యాలలోని విశ్వనాథ ఆలయ కాలక్షేప మండపంలో ఏర్పాటు చేసిన ఓ గణేశ్‌ విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. ప్రత్యేక సాంకేతికతతో రూపొందించిన గణపతి విగ్రహం కూర్చొని ఉంటోంది. భక్తులు దగ్గరికి రాగానే వారి తలపై చేతులతో దీవిస్తోంది.
5/10
ఆదిలాబాద్‌ పట్టణంలోని డైట్‌ కళాశాల రహదారి బురదమయంగా మారింది. ఇదే మార్గం గుండా పలు కాలనీలకు విద్యార్థులతోపాటు కాలనీవాసులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఈ దారిలో బురద కారణంగా అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్‌ పట్టణంలోని డైట్‌ కళాశాల రహదారి బురదమయంగా మారింది. ఇదే మార్గం గుండా పలు కాలనీలకు విద్యార్థులతోపాటు కాలనీవాసులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఈ దారిలో బురద కారణంగా అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.
6/10
హైదరాబాద్: రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ 39వ ఆవిర్భావ దినోత్సవం మౌలాలి శిక్షణ కేంద్రంలో శనివారం జరిగింది. రైల్వే సహాయమంత్రి రావుసాహెబ్‌ పాటిల్‌ దన్వే ముఖ్యఅతిథిగా హాజరై..అత్యుత్తమ ప్రతిభ చాటిన 42 మందికి పతకాలు అందజేశారు. హైదరాబాద్: రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ 39వ ఆవిర్భావ దినోత్సవం మౌలాలి శిక్షణ కేంద్రంలో శనివారం జరిగింది. రైల్వే సహాయమంత్రి రావుసాహెబ్‌ పాటిల్‌ దన్వే ముఖ్యఅతిథిగా హాజరై..అత్యుత్తమ ప్రతిభ చాటిన 42 మందికి పతకాలు అందజేశారు.
7/10
8/10
హైదరాబాద్: ఖైరతాబాద్‌ వినాయకుడిని దర్శించుకునేందుకు తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు 5 లక్షల మంది వచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. హైదరాబాద్: ఖైరతాబాద్‌ వినాయకుడిని దర్శించుకునేందుకు తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు 5 లక్షల మంది వచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
9/10
హైదరాబాద్: ఎల్బీనగర్‌ కూడలిలో వంతెన పనులు జరుగుతున్న సమయంలో ఏర్పాటు చేసిన ఇనుప చువ్వలను అలాగే వదిలేశారు. దీంతో పాదచారులకు అవి ప్రమాదకరంగా మారాయి. హైదరాబాద్: ఎల్బీనగర్‌ కూడలిలో వంతెన పనులు జరుగుతున్న సమయంలో ఏర్పాటు చేసిన ఇనుప చువ్వలను అలాగే వదిలేశారు. దీంతో పాదచారులకు అవి ప్రమాదకరంగా మారాయి.
10/10
హైదరాబాద్: బేగంపేటలోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ మహిళా కళాశాలలో శనివారం నిర్వహించిన స్నాతకోత్సవంలో విద్యార్థినులు సందడి చేశారు. పట్టాలు పొందిన ఆనందంలో స్వీయ చిత్రాలు తీసుకున్నారు. హైదరాబాద్: బేగంపేటలోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ మహిళా కళాశాలలో శనివారం నిర్వహించిన స్నాతకోత్సవంలో విద్యార్థినులు సందడి చేశారు. పట్టాలు పొందిన ఆనందంలో స్వీయ చిత్రాలు తీసుకున్నారు.

మరిన్ని