News In Pics: చిత్రం చెప్పే సంగతులు 01 (25-09-2023)

Updated : 25 Sep 2023 05:15 IST
1/11
విశాఖపట్నం,: బీచ్‌రోడ్డులోని ఓ హోటల్లో ఆదివారం సాయంత్రం మిస్సెస్‌ వైజాగ్‌-2023 పేరుతో అందాల పోటీలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ పోటీల్లో పాల్గొని ర్యాంప్‌వాక్‌ చేశారు. విశాఖపట్నం,: బీచ్‌రోడ్డులోని ఓ హోటల్లో ఆదివారం సాయంత్రం మిస్సెస్‌ వైజాగ్‌-2023 పేరుతో అందాల పోటీలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ పోటీల్లో పాల్గొని ర్యాంప్‌వాక్‌ చేశారు.
2/11
విశాఖపట్నం,: పాడేరు ఘాట్‌రోడ్డులో మంచు సోయగాలు కనువిందు చేస్తున్నాయి. మోదకొండమ్మ పాదాలు నుంచి కాంతమ్మ వ్యూ పాయింట్‌ వరకు ఆదివారం మధ్యాహ్నం సమయంలోనే రోడ్డుకు ఇరువైపులా మంచు అవహించింది. విశాఖపట్నం,: పాడేరు ఘాట్‌రోడ్డులో మంచు సోయగాలు కనువిందు చేస్తున్నాయి. మోదకొండమ్మ పాదాలు నుంచి కాంతమ్మ వ్యూ పాయింట్‌ వరకు ఆదివారం మధ్యాహ్నం సమయంలోనే రోడ్డుకు ఇరువైపులా మంచు అవహించింది.
3/11
సిద్దిపేట:  రాజీవ్‌ రహదారిపై మొక్కజొన్న కంకులను కాల్చి అమ్ముకునే ఈ లక్ష్మికి చిల్లర సమస్య తలెత్తదు. ఆమె డిజిటల్‌ యుగాన్ని అవగాహన చేసుకోవడమే కారణం. చరవాణి ద్వారా స్కాన్‌ చేసి.. కొనుగోలు చేసిన వస్తువుకు నేరుగా పేమెంట్‌ యాప్‌ ద్వారా నగదు చెల్లింపులు గ్రామాల్లోనూ విస్తరిస్తుండటంతో అర్థం చేసుకున్న చిరు వ్యాపారి లక్ష్మి.. స్కానర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. సిద్దిపేట: రాజీవ్‌ రహదారిపై మొక్కజొన్న కంకులను కాల్చి అమ్ముకునే ఈ లక్ష్మికి చిల్లర సమస్య తలెత్తదు. ఆమె డిజిటల్‌ యుగాన్ని అవగాహన చేసుకోవడమే కారణం. చరవాణి ద్వారా స్కాన్‌ చేసి.. కొనుగోలు చేసిన వస్తువుకు నేరుగా పేమెంట్‌ యాప్‌ ద్వారా నగదు చెల్లింపులు గ్రామాల్లోనూ విస్తరిస్తుండటంతో అర్థం చేసుకున్న చిరు వ్యాపారి లక్ష్మి.. స్కానర్‌ను ఏర్పాటు చేసుకున్నారు.
4/11
వరంగల్‌ : తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో వెంకటాపురం మండలంలోని ముత్తారం జలపాతం కనువిందు చేస్తోంది. వరంగల్‌ : తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో వెంకటాపురం మండలంలోని ముత్తారం జలపాతం కనువిందు చేస్తోంది.
5/11
మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోని ఓ కూరగాయల దుకాణంలో టమాటా వక్రతుండుని ఆకారంలో దర్శనమిచ్చింది. గణపతి నవరాత్రుల వేళ బొజ్జ గణపయ్య టమాటా ఆకృతిలో కనిపించడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోని ఓ కూరగాయల దుకాణంలో టమాటా వక్రతుండుని ఆకారంలో దర్శనమిచ్చింది. గణపతి నవరాత్రుల వేళ బొజ్జ గణపయ్య టమాటా ఆకృతిలో కనిపించడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
6/11
హైదరాబాద్‌: నగర వీధులన్నీ గణపతి నామస్మరణతో మారుమోగాయి. వారం రోజులుగా పూజలందుకున్న లంబోదరులను భక్తులు ఆదివారం నిమజ్జనానికి తరలించారు. దీంతో ట్యాంక్‌బండ్‌ పరిసరాలన్నీ జనసంద్రంగా మారాయి. చెరువులు, కొలనుల వద్ద సందడి వాతావరణం కనిపించింది. హైదరాబాద్‌: నగర వీధులన్నీ గణపతి నామస్మరణతో మారుమోగాయి. వారం రోజులుగా పూజలందుకున్న లంబోదరులను భక్తులు ఆదివారం నిమజ్జనానికి తరలించారు. దీంతో ట్యాంక్‌బండ్‌ పరిసరాలన్నీ జనసంద్రంగా మారాయి. చెరువులు, కొలనుల వద్ద సందడి వాతావరణం కనిపించింది.
7/11
8/11
9/11
హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి దేవాలయానికి ఆదివారం చంద్రముఖి-2 చిత్ర బృందం విచ్చేసింది. చిత్ర దర్శకుడు పి.వాసుతోపాటు నటి కంగనా రనౌత్, నటుడు రాఘవ లారెన్స్, నటి మహిమ నంబియార్‌కు ఆలయంలో అధికారులు, అర్చకులు స్వాగతం  పలికారు. హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి దేవాలయానికి ఆదివారం చంద్రముఖి-2 చిత్ర బృందం విచ్చేసింది. చిత్ర దర్శకుడు పి.వాసుతోపాటు నటి కంగనా రనౌత్, నటుడు రాఘవ లారెన్స్, నటి మహిమ నంబియార్‌కు ఆలయంలో అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు.
10/11
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌-బోయినపల్లి ప్రధాన రహదారి  పక్కనే ఉన్న రామన్నకుంట చెరువు పరిసర ప్రాంతాల్లో రోజూ వ్యర్థాలను పారబోసి నిప్పు పెడుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగ గాలిలోకి వ్యాపిస్తోంది. స్థానికులతో పాటు వాహనదారులు ఊపిరాడక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌-బోయినపల్లి ప్రధాన రహదారి పక్కనే ఉన్న రామన్నకుంట చెరువు పరిసర ప్రాంతాల్లో రోజూ వ్యర్థాలను పారబోసి నిప్పు పెడుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగ గాలిలోకి వ్యాపిస్తోంది. స్థానికులతో పాటు వాహనదారులు ఊపిరాడక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
11/11
గుజరాత్‌లోని సూరత్‌ నగరం మినీ హీరా బజార్‌ ప్రాంతమిది. వీరందరూ వెతుకుతున్నది వేటికోసమో తెలుసా? వజ్రాల కోసం. వజ్రాల వ్యాపారం జరిగే ఈ ప్రాంతంలో ఆదివారం ఉదయం రహదారిపై కొన్ని సీవీడీ వజ్రాలు కనిపించాయి. దీంతో ఆ దారిన వెళుతున్న వారంతా ఆ ప్రాంతాన్ని ఇలా అణువణువూ కళ్లతో స్కాన్‌ చేసి వజ్రాలను గుర్తించే పనిలో పడ్డారు. గుజరాత్‌లోని సూరత్‌ నగరం మినీ హీరా బజార్‌ ప్రాంతమిది. వీరందరూ వెతుకుతున్నది వేటికోసమో తెలుసా? వజ్రాల కోసం. వజ్రాల వ్యాపారం జరిగే ఈ ప్రాంతంలో ఆదివారం ఉదయం రహదారిపై కొన్ని సీవీడీ వజ్రాలు కనిపించాయి. దీంతో ఆ దారిన వెళుతున్న వారంతా ఆ ప్రాంతాన్ని ఇలా అణువణువూ కళ్లతో స్కాన్‌ చేసి వజ్రాలను గుర్తించే పనిలో పడ్డారు.

మరిన్ని