News In Pics: చిత్రం చెప్పే సంగతులు 01 (26-09-2023)

Updated : 26 Sep 2023 06:07 IST
1/9
మైసూరు దసరా సంబరాల్లో పాల్గొనే గజరాజుల రెండో బృందం సోమవారం రాచనగరికి చేరుకుంది. ప్యాలెస్‌ ముంగిట వాటికి సంప్రదాయ స్వాగతం లభించింది. బండీపుర, నాగరహొళె అభయారణ్యాల నుంచి ఈ ఏనుగులను రాచనగరికి ప్రత్యేక వాహనాల్లో రప్పించారు.
మైసూరు దసరా సంబరాల్లో పాల్గొనే గజరాజుల రెండో బృందం సోమవారం రాచనగరికి చేరుకుంది. ప్యాలెస్‌ ముంగిట వాటికి సంప్రదాయ స్వాగతం లభించింది. బండీపుర, నాగరహొళె అభయారణ్యాల నుంచి ఈ ఏనుగులను రాచనగరికి ప్రత్యేక వాహనాల్లో రప్పించారు.
2/9
విశాఖపట్నం: వంజంగి సమీపంలోని మేఘాలకొండ మంచు అందాలు సందర్శకులను మైమరిపిస్తున్నాయి. సోమవారం ఉదయం కొండపై మంచు దుప్పటి  పరచుకుంది. మైదాన ప్రాంతాల నుంచి పర్యాటకులు ఆదివారం రాత్రికే కొండపైకి చేరుకుని వేకువజామున మంచు అందాలను ఆస్వాదించారు. విశాఖపట్నం: వంజంగి సమీపంలోని మేఘాలకొండ మంచు అందాలు సందర్శకులను మైమరిపిస్తున్నాయి. సోమవారం ఉదయం కొండపై మంచు దుప్పటి పరచుకుంది. మైదాన ప్రాంతాల నుంచి పర్యాటకులు ఆదివారం రాత్రికే కొండపైకి చేరుకుని వేకువజామున మంచు అందాలను ఆస్వాదించారు.
3/9
ఒకే కాండంపై రెండు చెట్లు కనిపించటం వింతగానే ఉంటుంది. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ఏనుగొండ బైపాస్‌ సమీపంలోని ఈ చెట్లను ‘న్యూస్‌టుడే’ కెమెరాలో బంధించింది. ఒకే కాండంపై రెండు చెట్లు కనిపించటం వింతగానే ఉంటుంది. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ఏనుగొండ బైపాస్‌ సమీపంలోని ఈ చెట్లను ‘న్యూస్‌టుడే’ కెమెరాలో బంధించింది.
4/9
ఖమ్మం: ఇల్లెందు మండలం మసివాగు గ్రామానికి చెందిన కొడెం కృష్ణ వాహన టైర్ల మెకానిక్‌. అప్పుడప్పుడు సరదాగా చేసిన సాధనతో ట్యూబ్‌లను ట్రాక్టర్‌కు సోమవారం కట్టి 20 మీటర్ల వరకు వాహనాన్ని లాగి అబ్బురపరిచాడు. ఖమ్మం: ఇల్లెందు మండలం మసివాగు గ్రామానికి చెందిన కొడెం కృష్ణ వాహన టైర్ల మెకానిక్‌. అప్పుడప్పుడు సరదాగా చేసిన సాధనతో ట్యూబ్‌లను ట్రాక్టర్‌కు సోమవారం కట్టి 20 మీటర్ల వరకు వాహనాన్ని లాగి అబ్బురపరిచాడు.
5/9
హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ మహాగణపతిని దర్శించుకునేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ఎన్టీఆర్‌ మార్గ్‌లో విభాగినిని పూర్తిగా మూసివేశారు. దీంతో రోడ్డు దాటాలంటే పాదచారులు వంతెన మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వంతెన వద్ద వరద నీరు ఇలా నిలవడంతో సర్కస్‌ ఫీట్లు చేయాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ మహాగణపతిని దర్శించుకునేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ఎన్టీఆర్‌ మార్గ్‌లో విభాగినిని పూర్తిగా మూసివేశారు. దీంతో రోడ్డు దాటాలంటే పాదచారులు వంతెన మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వంతెన వద్ద వరద నీరు ఇలా నిలవడంతో సర్కస్‌ ఫీట్లు చేయాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు.
6/9
హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో దుర్గం చెరువులో ఏర్పాటు చేసిన మ్యూజికల్‌ ఫౌంటేన్‌ను సోమవారం ప్రారంభించారు. హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో దుర్గం చెరువులో ఏర్పాటు చేసిన మ్యూజికల్‌ ఫౌంటేన్‌ను సోమవారం ప్రారంభించారు.
7/9
హైదరాబాద్‌:  ఖైరతాబాద్‌ మహాగణపతి వద్ద సోమవారం రాష్ట్రీయ స్వయం సేవక్‌ సభ్యులు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.  వివిధ వాయిద్యాలతో నిర్వహించిన బ్యాండ్‌ అలరించింది. హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ మహాగణపతి వద్ద సోమవారం రాష్ట్రీయ స్వయం సేవక్‌ సభ్యులు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వివిధ వాయిద్యాలతో నిర్వహించిన బ్యాండ్‌ అలరించింది.
8/9
రోజురోజుకు డెంగీ కేసులు పెరిగిపోతుండడాన్ని నిరసిస్తూ పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో  సోమవారం దోమతెరలతో ఆందోళన నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు. రోజురోజుకు డెంగీ కేసులు పెరిగిపోతుండడాన్ని నిరసిస్తూ పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో సోమవారం దోమతెరలతో ఆందోళన నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు.
9/9
హైదరాబాద్‌: రాష్ట్రంలో డెంగీ, మలేరియా, విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి  తెల్లవారుజామునే వచ్చి ఓపీ కౌంటర్ల వద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. సోమవారం దాదాపు 2,500 మంది వచ్చారు. హైదరాబాద్‌: రాష్ట్రంలో డెంగీ, మలేరియా, విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తెల్లవారుజామునే వచ్చి ఓపీ కౌంటర్ల వద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. సోమవారం దాదాపు 2,500 మంది వచ్చారు.

మరిన్ని