News In Pics: చిత్రం చెప్పే సంగతులు 02 (07-06-2023)

Updated : 07 Jun 2023 22:57 IST
1/16
బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ రూ.50 లక్షల నగదు, 40 ఆల్టో కార్లు లక్కీ డ్రా విజేతలకు బహుమతి ప్రదానం కార్యక్రమంలో పాల్గొన్న సినీనటులు బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ రూ.50 లక్షల నగదు, 40 ఆల్టో కార్లు లక్కీ డ్రా విజేతలకు బహుమతి ప్రదానం కార్యక్రమంలో పాల్గొన్న సినీనటులు
2/16
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ కుమారుడి వివాహం కత్తిమండ గ్రామంలో ఆయన నివాసంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ కుమారుడి వివాహం కత్తిమండ గ్రామంలో ఆయన నివాసంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
3/16
బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ విడుదల హంగామా రేపు ఉదయం ప్రారంభం కానున్నట్లు చిత్రబృందం పోస్టర్‌ విడుదల చేసింది. బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ విడుదల హంగామా రేపు ఉదయం ప్రారంభం కానున్నట్లు చిత్రబృందం పోస్టర్‌ విడుదల చేసింది.
4/16
నయనతార, జయంరవి జంటగా దర్శకుడు అహ్మద్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఇరైవన్’. ఈ నేపథ్యంలో చిత్రబృందం పోస్టర్‌ను విడుదల చేస్తూ.. ఆగస్ట్ 25న ఈ సినిమా 4 భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది. నయనతార, జయంరవి జంటగా దర్శకుడు అహ్మద్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఇరైవన్’. ఈ నేపథ్యంలో చిత్రబృందం పోస్టర్‌ను విడుదల చేస్తూ.. ఆగస్ట్ 25న ఈ సినిమా 4 భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది.
5/16
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ సందర్భంగా ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ జట్లు పోటీపడుతున్న ఓవల్‌ స్టేడియంలో... యూకేలోని తెలుగు యువత ఇలా యువగళం జెండాలను చేతపట్టుకుని ఏపీలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్‌కు మద్దతు తెలిపారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ సందర్భంగా ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ జట్లు పోటీపడుతున్న ఓవల్‌ స్టేడియంలో... యూకేలోని తెలుగు యువత ఇలా యువగళం జెండాలను చేతపట్టుకుని ఏపీలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్‌కు మద్దతు తెలిపారు.
6/16
బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్‌బీకే 108గా ఇది ప్రచారంలో ఉంది. జూన్‌ 10న బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని అనిల్‌ తాజాగా ఓ పోస్టర్‌ విడుదల చేశారు. అభిమానులందరి తరఫు నుంచి ఇకపై బాలయ్యను ‘గ్లోబల్‌ లయన్‌’ అనే టైటిల్‌తో పిలవనున్నట్లు చెప్పారు. బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్‌బీకే 108గా ఇది ప్రచారంలో ఉంది. జూన్‌ 10న బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని అనిల్‌ తాజాగా ఓ పోస్టర్‌ విడుదల చేశారు. అభిమానులందరి తరఫు నుంచి ఇకపై బాలయ్యను ‘గ్లోబల్‌ లయన్‌’ అనే టైటిల్‌తో పిలవనున్నట్లు చెప్పారు.
7/16
వరుణ్ తేజ్‌ హీరోగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన చిత్రం ‘గాండీవధారి అర్జున’. ఈ సినీమా ఆగస్టు 25 ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం తెలుపుతు పోస్టర్‌ విడుదల చేసింది. వరుణ్ తేజ్‌ హీరోగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన చిత్రం ‘గాండీవధారి అర్జున’. ఈ సినీమా ఆగస్టు 25 ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం తెలుపుతు పోస్టర్‌ విడుదల చేసింది.
8/16
సినీనటి తమన్నా తన తాజా ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు. ఈ ఫొటోల్లో ఆమె తెలుపు వర్ణం దుస్తుల్లో ఫ్యాన్స్‌ ఆకట్టుకుంది. సినీనటి తమన్నా తన తాజా ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు. ఈ ఫొటోల్లో ఆమె తెలుపు వర్ణం దుస్తుల్లో ఫ్యాన్స్‌ ఆకట్టుకుంది.
9/16
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్‌లోని న్యూ అంబేడ్కర్‌ భవన్‌లో సాగు నీటి దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గణేష్‌తో పాటు కవిత పాల్గొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్‌లోని న్యూ అంబేడ్కర్‌ భవన్‌లో సాగు నీటి దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గణేష్‌తో పాటు కవిత పాల్గొన్నారు.
10/16
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ర్టవ్యాప్తంగా సాగునీటి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా చిన్న చల్మెడలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి మంత్రి హరీశ్‌రావు భూమిపూజ చేశారు.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ర్టవ్యాప్తంగా సాగునీటి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా చిన్న చల్మెడలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి మంత్రి హరీశ్‌రావు భూమిపూజ చేశారు..
11/16
ఇంగ్లాండ్‌లోని కెన్నింగ్టన్‌ ఓవల్ మైదానం వేదికగా  భారత్‌ -ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఐసీసీ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. ఇంగ్లాండ్‌లోని కెన్నింగ్టన్‌ ఓవల్ మైదానం వేదికగా భారత్‌ -ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఐసీసీ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది.
12/16
నిన్న భారత క్రికెటర్‌ అజింక్య రహానె జన్మదినం. టీమిండియా కోచ్‌  రాహుల్‌ ద్రవిడ్‌, క్రికెటర్‌ మహ్మద్ షమి, ఇతర సభ్యులు రహానెతో కేక్‌ కట్‌ చేయించారు. ఈ ఫొటోను బీసీసీఐ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. నిన్న భారత క్రికెటర్‌ అజింక్య రహానె జన్మదినం. టీమిండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, క్రికెటర్‌ మహ్మద్ షమి, ఇతర సభ్యులు రహానెతో కేక్‌ కట్‌ చేయించారు. ఈ ఫొటోను బీసీసీఐ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది.
13/16
సినీనటి రాశిఖన్నా తన తాజా ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటోకు ఆమె ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. సినీనటి రాశిఖన్నా తన తాజా ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటోకు ఆమె ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.
14/16
ములుగు జిల్లాలో మంత్రులు కేటీఆర్‌, సత్యవతిరాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావులు  పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించనున్న సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయ, జిల్లా పోలీస్‌ కార్యాలయ భవన నిర్మాణాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ములుగు జిల్లాలో మంత్రులు కేటీఆర్‌, సత్యవతిరాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావులు పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించనున్న సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయ, జిల్లా పోలీస్‌ కార్యాలయ భవన నిర్మాణాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు.
15/16
మహారాష్ట్రలోని నవీ ముంబయిలో శ్రీవారి ఆలయానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌శిందే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, రేమాండ్స్ అధినేత సింఘానియా, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.	మహారాష్ట్రలోని నవీ ముంబయిలో శ్రీవారి ఆలయానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌శిందే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, రేమాండ్స్ అధినేత సింఘానియా, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
16/16
తిరుమల (Tirumala) శ్రీవారిని ‘ఆదిపురుష్’ (Adipurush) చిత్ర నటి కృతి సనన్ (Krithi Sanon) ,దర్శకుడు ఓం రౌత్ (Om Raut)లు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం శ్రీవారి అర్చన సేవలో పాల్గొన్నారు. తిరుమల (Tirumala) శ్రీవారిని ‘ఆదిపురుష్’ (Adipurush) చిత్ర నటి కృతి సనన్ (Krithi Sanon) ,దర్శకుడు ఓం రౌత్ (Om Raut)లు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం శ్రీవారి అర్చన సేవలో పాల్గొన్నారు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు