News In Pics: చిత్రం చెప్పే సంగతులు 01 (08-06-2023)

Updated : 08 Jun 2023 07:47 IST
1/14
ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం ఘన్‌పూర్‌లోని మండల పరిషత్‌ పాఠశాల ఉపాధ్యాయుడు జాదవ్‌ గణేష్‌.  ఇంటింటికీ వెళ్లి.. విద్యార్థులను తమ పాఠశాలలో చేర్చుకుంటున్నారు. వెనుక నిలుచుని ఉన్నవారంతా సొనాల గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు. బడి ఈడు పిల్లల కోసం సాగుతున్న పోటీకి ఇదో నిదర్శనం. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం ఘన్‌పూర్‌లోని మండల పరిషత్‌ పాఠశాల ఉపాధ్యాయుడు జాదవ్‌ గణేష్‌. ఇంటింటికీ వెళ్లి.. విద్యార్థులను తమ పాఠశాలలో చేర్చుకుంటున్నారు. వెనుక నిలుచుని ఉన్నవారంతా సొనాల గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు. బడి ఈడు పిల్లల కోసం సాగుతున్న పోటీకి ఇదో నిదర్శనం.
2/14
ఒకప్పుడు మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే.. ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌ జిల్లా కొట్పాడు సమితి ఎమ్మెల్యే పద్మిని దియాన్‌ బుధవారం పొలం పనులు చేశారు. ఆమె వరికోతల్లో పాల్గొన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.  ఏటా తన పొలంలో కార్మికులతో కలిసి కోతల్లో పాల్గొంటానని, చెరువులో చేపలు పడతానని ఆమె చెప్పారు. ఒకప్పుడు మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే.. ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌ జిల్లా కొట్పాడు సమితి ఎమ్మెల్యే పద్మిని దియాన్‌ బుధవారం పొలం పనులు చేశారు. ఆమె వరికోతల్లో పాల్గొన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఏటా తన పొలంలో కార్మికులతో కలిసి కోతల్లో పాల్గొంటానని, చెరువులో చేపలు పడతానని ఆమె చెప్పారు.
3/14
జగిత్యాల జిల్లా కేంద్రం కరీంనగర్‌ రోడ్డులో ఇటీవల నూతనంగా నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్తూపం పట్టణవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జాతీయ పక్షులు,  కర్ర నమూనాలతో స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేశారు. విభిన్న రకాల పూల మొక్కలు నలువైపులా నాటడంతో స్తూపం ఆవరణ పచ్చదనం సంతరించుకుంది. పక్షుల చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రం కరీంనగర్‌ రోడ్డులో ఇటీవల నూతనంగా నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్తూపం పట్టణవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జాతీయ పక్షులు, కర్ర నమూనాలతో స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేశారు. విభిన్న రకాల పూల మొక్కలు నలువైపులా నాటడంతో స్తూపం ఆవరణ పచ్చదనం సంతరించుకుంది. పక్షుల చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.
4/14
పూర్వతూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో బొంగు చికెచ్‌, బొంగుకల్లు ప్రత్యేకత. వీటి కోసం దూర ప్రాంతాల నుంచి వెళుతుంటారు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం, మణుగూరు ఆదివాసీ గ్రామాల్లో కూడా ఇవి దొరుకుతున్నాయి.  కుండల బదులు వెదురు కర్రలతో తీసిన కల్లు, వెదురు కర్రలతో చేసిన చికెన్‌ను కూడా తయారుచేసి ఇస్తున్నారు.  అశ్వాపురం మండలం బుగ్గ గ్రామాల్లో దీనికి ప్రసిద్ధి. పూర్వతూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో బొంగు చికెచ్‌, బొంగుకల్లు ప్రత్యేకత. వీటి కోసం దూర ప్రాంతాల నుంచి వెళుతుంటారు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం, మణుగూరు ఆదివాసీ గ్రామాల్లో కూడా ఇవి దొరుకుతున్నాయి. కుండల బదులు వెదురు కర్రలతో తీసిన కల్లు, వెదురు కర్రలతో చేసిన చికెన్‌ను కూడా తయారుచేసి ఇస్తున్నారు. అశ్వాపురం మండలం బుగ్గ గ్రామాల్లో దీనికి ప్రసిద్ధి.
5/14
 సురినాంలోని పరమరిబోలో ఉన్న ఆర్యదివాకర్‌ మందిర్‌, విష్ణుమందిర్‌లను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం సందర్శించారు సురినాంలోని పరమరిబోలో ఉన్న ఆర్యదివాకర్‌ మందిర్‌, విష్ణుమందిర్‌లను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం సందర్శించారు
6/14
 ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూకు చెందిన ఓ వ్యాపారి ఇల్లు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించి రూ.8 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూకు చెందిన ఓ వ్యాపారి ఇల్లు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించి రూ.8 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు
7/14
 మాదాపూర్‌: శిల్పారామంలో బుధవారం సాయంత్రం చిన్నారులు చూడముచ్చటైన పేరిణి నృత్యప్రదర్శనతో చూపరులను ఆకట్టుకున్నారు. మణిద్వీప ఆర్ట్స్‌ అకాడమీకి చెందిన విద్యార్థులు చక్కటి హావభావాలతో లయాత్మకంగా నృత్యం చేసిన తీరు అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. మాదాపూర్‌: శిల్పారామంలో బుధవారం సాయంత్రం చిన్నారులు చూడముచ్చటైన పేరిణి నృత్యప్రదర్శనతో చూపరులను ఆకట్టుకున్నారు. మణిద్వీప ఆర్ట్స్‌ అకాడమీకి చెందిన విద్యార్థులు చక్కటి హావభావాలతో లయాత్మకంగా నృత్యం చేసిన తీరు అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది.
8/14
 రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శంషాబాద్‌ విమానాశ్రయంలో నగరంలోని పర్యాటక ప్రాంతాల నమూనాలు ఏర్పాటు చేశారు. చార్మినార్‌, హుస్సేన్‌ సాగర్‌, అమర వీరుల స్తూపం, సచివాలయ భవనం, అంబేడ్కర్‌ విగ్రహం నమూనాలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శంషాబాద్‌ విమానాశ్రయంలో నగరంలోని పర్యాటక ప్రాంతాల నమూనాలు ఏర్పాటు చేశారు. చార్మినార్‌, హుస్సేన్‌ సాగర్‌, అమర వీరుల స్తూపం, సచివాలయ భవనం, అంబేడ్కర్‌ విగ్రహం నమూనాలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి.
9/14
మధ్య కర్ణాటకపై వానదేవుడు ఇంకా కరుణించలేదు. కొప్పళ జిల్లా కిన్నాళ జలాశయం వెనుక ప్రాంతం తడారి.. భూమి బీటలు వారిన దృశ్యం.. పరిస్థితి తీవ్రతకు దర్పణం..
మధ్య కర్ణాటకపై వానదేవుడు ఇంకా కరుణించలేదు. కొప్పళ జిల్లా కిన్నాళ జలాశయం వెనుక ప్రాంతం తడారి.. భూమి బీటలు వారిన దృశ్యం.. పరిస్థితి తీవ్రతకు దర్పణం..
10/14
 వీరవాసరం- పెనుమంట్ర రహదారిలో పలు చోట్ల నిండుగా ఎర్రటి పుష్పాలతో ఉన్న తురాయి చెట్లు కనువిందు చేస్తున్నాయి. మండుటెండలోనూ విరబూసిన ఈ వృక్షాల చెంత ఈ మార్గంలో రాకపోకలు సాగించే వారు స్వీయ చిత్రాలు తీసుకుంటున్నారు.	వీరవాసరం- పెనుమంట్ర రహదారిలో పలు చోట్ల నిండుగా ఎర్రటి పుష్పాలతో ఉన్న తురాయి చెట్లు కనువిందు చేస్తున్నాయి. మండుటెండలోనూ విరబూసిన ఈ వృక్షాల చెంత ఈ మార్గంలో రాకపోకలు సాగించే వారు స్వీయ చిత్రాలు తీసుకుంటున్నారు.
11/14
 చెట్టు మొదట్లో నేలకు ఆనేలా కాసిన ఈ పనస కాయలు అప్పారావుపేటలోని ఓ రైతు ఇంటివద్ద కనువిందు చేస్తున్నాయి. సాధారణంగా పనసకాయ లోపల భాగం లేత పసుపు లేదా బంగారు రంగులో ఉంటుంది. ఈ పనస మాత్రం ఎరువు రంగు తొనలతో ఉంటుందని రైతు జోగిబాబు తెలిపారు. చెట్టు మొదట్లో నేలకు ఆనేలా కాసిన ఈ పనస కాయలు అప్పారావుపేటలోని ఓ రైతు ఇంటివద్ద కనువిందు చేస్తున్నాయి. సాధారణంగా పనసకాయ లోపల భాగం లేత పసుపు లేదా బంగారు రంగులో ఉంటుంది. ఈ పనస మాత్రం ఎరువు రంగు తొనలతో ఉంటుందని రైతు జోగిబాబు తెలిపారు.
12/14
 కేపీహెచ్‌బీ నెక్సెస్‌ మాల్‌లో నటుడు హర్షవర్ధన్‌ రాణే, తారలు సురభి, వర్ష, కుషిత సందడి చేశారు. బుధవారం బజాజ్‌  ఎలక్టాన్రిక్స్‌ అధ్వర్యంలో నిర్వహించిన బంపర్‌ డ్రాలో వారు లక్కీ కూపన్లు తీసి విజేతలను ప్రకటించారు.   కేపీహెచ్‌బీ నెక్సెస్‌ మాల్‌లో నటుడు హర్షవర్ధన్‌ రాణే, తారలు సురభి, వర్ష, కుషిత సందడి చేశారు. బుధవారం బజాజ్‌ ఎలక్టాన్రిక్స్‌ అధ్వర్యంలో నిర్వహించిన బంపర్‌ డ్రాలో వారు లక్కీ కూపన్లు తీసి విజేతలను ప్రకటించారు.
13/14
 హైదరాబాద్‌: బుధవారం రాత్రి 8 గంటల సమయంలో బయో డైవర్పిటీ కూడలి నుంచి రహేజా మైండ్‌ స్పేస్‌ మీదుగా సైబర్‌ టవర్స్‌ వరకు రహదారిపై భారీగా వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్‌: బుధవారం రాత్రి 8 గంటల సమయంలో బయో డైవర్పిటీ కూడలి నుంచి రహేజా మైండ్‌ స్పేస్‌ మీదుగా సైబర్‌ టవర్స్‌ వరకు రహదారిపై భారీగా వాహనాలు బారులు తీరాయి.
14/14
 హైదరాబాద్‌: మృగశిర కార్తె  గురువారం ప్రారంభం కానుండడంతో చేపల కొనుగోలుదారులతో ముషీరాబాద్‌లోని మార్కెట్‌ బుధవారం కిటకిటలాడింది. హైదరాబాద్‌: మృగశిర కార్తె గురువారం ప్రారంభం కానుండడంతో చేపల కొనుగోలుదారులతో ముషీరాబాద్‌లోని మార్కెట్‌ బుధవారం కిటకిటలాడింది.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు