ఎస్‌బీఐ కొత్త డిపాజిట్‌ స్కీమ్‌.. వీరికి 7.9 శాతం వడ్డీ!

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) కొత్త డిపాజిట్‌ స్కీమ్‌ను తీసుకొచ్చింది. సర్వోత్తమ్‌ టర్మ్‌ డిపాజిట్‌ పేరుతో ఈ డిపాజిట్‌ స్కీమ్‌ అందుబాటులోకి తెచ్చింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF-7.1%), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC-7.0%), ఇతర పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ పథకాల కంటే ఎక్కువ వడ్డీ అందిస్తోంది. ఈ పథకం పూర్తి వివరాలివీ..

Updated : 03 Mar 2023 20:58 IST
1/6
ఈ డిపాజిట్‌ స్కీమ్‌లో కనీసం రూ.15 లక్షలు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఆపై రూ.1000 చొప్పున ఎంతైనా డిపాజిట్‌ చేయొచ్చు. బల్క్‌ డిపాజిట్లకూ అనుమతి ఉంది. ఈ డిపాజిట్‌ స్కీమ్‌లో కనీసం రూ.15 లక్షలు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఆపై రూ.1000 చొప్పున ఎంతైనా డిపాజిట్‌ చేయొచ్చు. బల్క్‌ డిపాజిట్లకూ అనుమతి ఉంది.
2/6
ఏడాది, రెండేళ్ల కాలవ్యవధిపై ఈ పథకం అందుబాటులో ఉంది. ఈ స్కీమ్‌లో ముందస్తు విత్‌ డ్రాకు అనుమతి లేదు.	ఏడాది, రెండేళ్ల కాలవ్యవధిపై ఈ పథకం అందుబాటులో ఉంది. ఈ స్కీమ్‌లో ముందస్తు విత్‌ డ్రాకు అనుమతి లేదు.
3/6
సీనియర్‌ సిటిజన్లకు, సిబ్బందికి, స్టాఫ్‌ సీనియర్‌ సిటిజన్లకు అదనపు వడ్డీ రేటు లభిస్తుంది. మైనర్లకు, ఎన్నారై కస్టమర్లకు ఈ పథకానికి అనర్హులు	సీనియర్‌ సిటిజన్లకు, సిబ్బందికి, స్టాఫ్‌ సీనియర్‌ సిటిజన్లకు అదనపు వడ్డీ రేటు లభిస్తుంది. మైనర్లకు, ఎన్నారై కస్టమర్లకు ఈ పథకానికి అనర్హులు
4/6
రూ.2కోట్లలోపు డిపాజిట్లపై ఏడాది కాలానికి సాధారణ ప్రజలకు 7.10 శాతం వడ్డీ లభిస్తుంది. అదే రెండేళ్లకైతే 7.40 శాతం చొప్పున లభిస్తుంది. సీనియర్‌ సిటిజన్లకు ఏడాది డిపాజిట్లపై 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. అదే రెండేళ్ల కాలానికి 7.9 శాతం లభిస్తుంది. రూ.2కోట్లలోపు డిపాజిట్లపై ఏడాది కాలానికి సాధారణ ప్రజలకు 7.10 శాతం వడ్డీ లభిస్తుంది. అదే రెండేళ్లకైతే 7.40 శాతం చొప్పున లభిస్తుంది. సీనియర్‌ సిటిజన్లకు ఏడాది డిపాజిట్లపై 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. అదే రెండేళ్ల కాలానికి 7.9 శాతం లభిస్తుంది.
5/6
రూ.రెండు కోట్లపైన డిపాజిట్లపై సాధారణ పౌరులకు ఏడాది కాలానికి 7.05 శాతం, రెండేళ్లకు 6.09 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్‌ సిటిజన్లకు ఏడాదికి 7.55, రెండేళ్లకు 7.4 వడ్డీ రేటు వర్తిస్తుంది. రూ.రెండు కోట్లపైన డిపాజిట్లపై సాధారణ పౌరులకు ఏడాది కాలానికి 7.05 శాతం, రెండేళ్లకు 6.09 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్‌ సిటిజన్లకు ఏడాదికి 7.55, రెండేళ్లకు 7.4 వడ్డీ రేటు వర్తిస్తుంది.
6/6
సర్వోత్తమ్‌ డిపాజిట్లను రెన్యువల్‌ చేసుకొనే వెసులుబాటు లేదు. కాలవ్యవధి పూర్తయ్యాక మెచ్యూరిటీ మొత్తం ఖాతాలో జమ అవుతుంది. సర్వోత్తమ్‌ డిపాజిట్లను రెన్యువల్‌ చేసుకొనే వెసులుబాటు లేదు. కాలవ్యవధి పూర్తయ్యాక మెచ్యూరిటీ మొత్తం ఖాతాలో జమ అవుతుంది.

మరిన్ని