Auto Expo: ఆటో ఎక్స్‌పోలో సందడి చేసిన టాప్‌ 10 కార్లు!

ఆసియాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దిల్లీ ఆటో ఎక్స్‌పో 2023 (Auto Expo 2023) మూడేళ్ల విరామం తర్వాత తిరిగి ప్రారంభమైంది. రెండేళ్లకోసారి నిర్వహించే వాహన ప్రదర్శన వాస్తవానికి 2022లో జరగాల్సి ఉన్నా.. కొవిడ్‌ కారణాలతో ఈ ఏడాదికి వాయిదా పడింది. జనవరి 13 నుంచి జనవరి 18 వరకు ఈ వాహన ప్రదర్శన ఉంటుంది. రెండు రోజుల (జనవరి 11- జనవరి 12) ముందు మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. మరి, ఈ ఏడాది ఆటోఎక్స్‌పోలో ప్రదర్శించిన వాటిలో టాప్‌ 10 కార్లపై ఓ లుక్కేద్దామా..?

Updated : 13 Jan 2023 20:17 IST
1/10
ఎంజీ మోటార్‌ ఇండియా మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీ శ్రేణిలో హైబ్రిడ్‌ కారును ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఎంజీ ఈహెచ్‌ఎస్‌ హైబ్రిడ్‌ (MG eHS Hybrid) పేరుతో తీసుకొస్తున్న ఈ కారులో 1.5 లీటర్ల టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌, 16.6 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ అమర్చారు. ఎంజీ మోటార్‌ ఇండియా మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీ శ్రేణిలో హైబ్రిడ్‌ కారును ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఎంజీ ఈహెచ్‌ఎస్‌ హైబ్రిడ్‌ (MG eHS Hybrid) పేరుతో తీసుకొస్తున్న ఈ కారులో 1.5 లీటర్ల టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌, 16.6 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ అమర్చారు.
2/10
టాటా మోటార్స్‌ సియారా (Tata Sierra EV) పేరుతో కొత్త ఈవీని ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. కాన్సెప్ట్‌ మోడల్‌ అని కంపెనీ చెబుతోంది. అంటే, ఈ మోడల్‌ మార్కెట్లోకి రావడానికి మరింత సమయం పట్టొచ్చు. టాటా మోటార్స్‌ సియారా (Tata Sierra EV) పేరుతో కొత్త ఈవీని ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. కాన్సెప్ట్‌ మోడల్‌ అని కంపెనీ చెబుతోంది. అంటే, ఈ మోడల్‌ మార్కెట్లోకి రావడానికి మరింత సమయం పట్టొచ్చు.
3/10
టాటా మోటార్స్‌ హారియర్‌ మోడల్‌ ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ హారియర్‌ ఈవీ (Tata Harrier EV)ని ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చేఏడాది ప్రథమార్థంలో కానీ హారియర్‌ ఈవీ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. టాటా మోటార్స్‌ హారియర్‌ మోడల్‌ ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ హారియర్‌ ఈవీ (Tata Harrier EV)ని ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చేఏడాది ప్రథమార్థంలో కానీ హారియర్‌ ఈవీ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం.
4/10
టాటా మోటార్స్‌ కర్వ్‌ (Tata Curvv) పేరుతో కొత్త కారును ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. సెమీ ఎస్‌యూవీ శ్రేణిలో తీసుకొస్తున్న ఈ కారును వచ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుదల చేస్తారని మార్కెట్ వర్గాల అంచనా వేస్తున్నాయి. టాటా మోటార్స్‌ కర్వ్‌ (Tata Curvv) పేరుతో కొత్త కారును ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. సెమీ ఎస్‌యూవీ శ్రేణిలో తీసుకొస్తున్న ఈ కారును వచ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుదల చేస్తారని మార్కెట్ వర్గాల అంచనా వేస్తున్నాయి.
5/10
మారుతీ సుజుకీ  ఆటో ఎక్స్‌పోలో విద్యుత్తు ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ ఈవీఎక్స్‌ (Maruti Suzuki EVX)ను ఆవిష్కరించింది. ఇది 60 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 550 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. 2025 నాటికి దీన్ని మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు సమాచారం. మారుతీ సుజుకీ ఆటో ఎక్స్‌పోలో విద్యుత్తు ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ ఈవీఎక్స్‌ (Maruti Suzuki EVX)ను ఆవిష్కరించింది. ఇది 60 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 550 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. 2025 నాటికి దీన్ని మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు సమాచారం.
6/10
ఎంజీ మోటార్‌ ఇండియా సరికొత్త ఎంపీవీ మోడల్‌ యూనిక్‌7 (MG Euniq7)ను ప్రదర్శించింది. ఇందులో 6.4 కేజీల హైడ్రోజన్‌ సిలిండర్ అమర్చారు. ఇది 201హెచ్‌పీ శక్తిని విడుదల విడుదల చేస్తుంది. ఇందులో ఏడుగురు ప్రయాణించవచ్చు. ఎంజీ మోటార్‌ ఇండియా సరికొత్త ఎంపీవీ మోడల్‌ యూనిక్‌7 (MG Euniq7)ను ప్రదర్శించింది. ఇందులో 6.4 కేజీల హైడ్రోజన్‌ సిలిండర్ అమర్చారు. ఇది 201హెచ్‌పీ శక్తిని విడుదల విడుదల చేస్తుంది. ఇందులో ఏడుగురు ప్రయాణించవచ్చు.
7/10
కియా కంపెనీ ఎలక్ట్రిక్‌ వాహన శ్రేణిలో ఈవీ9 (Kia EV9)ను తీసుకొస్తుంది. సింగిల్‌ ఛార్జ్‌తో 450 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఐదు సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని తెలిపింది. కియా కంపెనీ ఎలక్ట్రిక్‌ వాహన శ్రేణిలో ఈవీ9 (Kia EV9)ను తీసుకొస్తుంది. సింగిల్‌ ఛార్జ్‌తో 450 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఐదు సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని తెలిపింది.
8/10
హ్యుందాయ్‌ గతేడాది విడుదల చేసిన అయోనిక్‌5 (Hyundai  Ioniq5) ఈవీ మోడల్‌ను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఈ కారు 7.6 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 2022 సంవత్సరానికిగాను వరల్డ్‌ కార్‌ అవార్డ్స్‌లో మూడు విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. హ్యుందాయ్‌ గతేడాది విడుదల చేసిన అయోనిక్‌5 (Hyundai Ioniq5) ఈవీ మోడల్‌ను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఈ కారు 7.6 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 2022 సంవత్సరానికిగాను వరల్డ్‌ కార్‌ అవార్డ్స్‌లో మూడు విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది.
9/10
చైనాకు చెందిన బీవైడీ ఇండియా సీల్‌ (BYD Seal) పేరిట ఈవీని ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. 2023 చివరి త్రైమాసికంలో విడుదల చేయనున్నారు. దీన్ని ఒకసారి ఛార్జ్‌ చేస్తే 700 కి.మీ వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. చైనాకు చెందిన బీవైడీ ఇండియా సీల్‌ (BYD Seal) పేరిట ఈవీని ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. 2023 చివరి త్రైమాసికంలో విడుదల చేయనున్నారు. దీన్ని ఒకసారి ఛార్జ్‌ చేస్తే 700 కి.మీ వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది.
10/10
మారుతీ సుజుకీ సంస్థ జిమ్మీ, ఫ్రాంక్స్‌ పేరుతో రెండు కొత్త కార్లను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఫ్రాంక్స్‌ బుకింగ్స్‌ ఏప్రిల్‌ నుంచి, జిమ్మీ బుకింగ్స్‌ మే నుంచి ప్రారంభంకానున్నాయి. మారుతీ సుజుకీ సంస్థ జిమ్మీ, ఫ్రాంక్స్‌ పేరుతో రెండు కొత్త కార్లను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఫ్రాంక్స్‌ బుకింగ్స్‌ ఏప్రిల్‌ నుంచి, జిమ్మీ బుకింగ్స్‌ మే నుంచి ప్రారంభంకానున్నాయి.

మరిన్ని