‘వై’ సిరీస్‌లో వివో కొత్త ఫోన్..ప్రత్యేకతలివే..!

‘వై’ సిరీస్‌లో వివో కొత్త ఫోన్..ప్రత్యేకతలివే..!

1/10

వివో కంపెనీ ‘వై’ సిరీస్‌లో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వివో వై21 పేరుతో ఈ ఫోన్‌ ప్రవేశపెట్టింది. బడ్జెట్ ధరలో తీసుకొస్తున్న ఈ ఫోన్‌ ఫీచర్లను తెలుసుకుందాం.

2/10

ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్‌ 11.1 ఓఎస్‌తో వై21 పనిచేస్తుంది.

3/10

ఇందులో 6.5-అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు.

4/10

వై21లో మొత్తం మూడు కెమెరాలున్నాయి. వెనుకవైపు 13ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 2ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ముందుభాగంలో 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు.

5/10

సైడ్ ఫింగర్‌ ప్రింట్ స్కానర్‌, ఫేస్‌ రికగ్నిషన్ లాక్ వంటి ఫీచర్లున్నాయి.

6/10

గేమింగ్ ప్రియుల కోసం ఇందులో అల్ట్రా గేమింగ్ మోడ్ ఇస్తున్నారు. ఇందులో 4డీ గేమ్‌ వైబ్రేషన్, గేమ్‌ పిక్చర్‌-ఇన్‌-పిక్చర్‌, డొ నాట్ డిస్ట్రబ్ మోడ్‌, ఈస్పోర్ట్స్‌ మోడ్ ఫీచర్లు ఉన్నాయి.

7/10

మీడియాటెక్‌ హీలియో పీ35 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 4జీబీ ర్యామ్‌తోపాటు అదనంగా 1జీబీ ఎక్స్‌టెండ్ ర్యామ్‌ ఇస్తున్నారు.

8/10

ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

9/10

వివో వై21 4జీబీ ర్యామ్‌/128జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వేరియంట్‌ ధర రూ. 15,490. త్వరలోనే ఈ ఫోన్‌ను4జీబీ ర్యామ్/64జీబీ వేరియంట్లో అందుబాటులోకి తీసుకొస్తామని వివో తెలిపింది.

10/10

అన్ని రకాల ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్‌ను కొనుగోలు చెయ్యొచ్చు. డైమండ్ గ్లో, మిడ్‌నైట్ బ్లూ రంగుల్లో వై21 లభిస్తుంది.


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని