World Press Photo Contest: అవార్డు గెలుచుకున్న ఫొటోలు

‘వరల్డ్‌ ప్రెస్‌ ఫొటో కాంటెస్ట్‌’ 2023 సంవత్సరానికి గాను గ్లోబల్‌ అవార్డ్స్‌ను ప్రకటించింది. అవార్డు గెలుచుకున్న కొన్ని ఫొటోలు మీకోసం..

Updated : 20 Apr 2023 21:39 IST
1/13
రష్యా బలగాల దాడిలో గాయాలపాలై చికిత్స పొందుతున్న ఉక్రెయిన్‌ పౌరుడు సెర్హి క్రాల్యా(మార్చి 11, 2022) (ఫొటోగ్రాఫర్‌: ఎవిగ్నీ మాలలోలెట్కా). రష్యా బలగాల దాడిలో గాయాలపాలై చికిత్స పొందుతున్న ఉక్రెయిన్‌ పౌరుడు సెర్హి క్రాల్యా(మార్చి 11, 2022) (ఫొటోగ్రాఫర్‌: ఎవిగ్నీ మాలలోలెట్కా).
2/13
జన్న గోమా తన కుటుంబంతో కలిసి మేరియుపొల్‌లోని బాంబ్‌ షెల్టర్‌లో బిక్కుబిక్కుమంటూ కనిపించారు( మార్చి 6, 2022)( ఫొటోగ్రాఫర్‌ ఎవిగ్నీ మాలలోలెట్కా) జన్న గోమా తన కుటుంబంతో కలిసి మేరియుపొల్‌లోని బాంబ్‌ షెల్టర్‌లో బిక్కుబిక్కుమంటూ కనిపించారు( మార్చి 6, 2022)( ఫొటోగ్రాఫర్‌ ఎవిగ్నీ మాలలోలెట్కా)
3/13
బాంబు పేలుడులో ఉక్రెయిన్‌ ఆర్మీ వైద్య సిబ్బంది ఆంటన్‌ గ్లాడన్‌(22) రెండు కాళ్లను కోల్పోయి చెర్కసీలోని ఆసుపత్రిలో చికిత్స పొందారు(మే 5, 2022) (ఫొటోగ్రాఫర్‌: ఎమిలో మోరెనట్టి) బాంబు పేలుడులో ఉక్రెయిన్‌ ఆర్మీ వైద్య సిబ్బంది ఆంటన్‌ గ్లాడన్‌(22) రెండు కాళ్లను కోల్పోయి చెర్కసీలోని ఆసుపత్రిలో చికిత్స పొందారు(మే 5, 2022) (ఫొటోగ్రాఫర్‌: ఎమిలో మోరెనట్టి)
4/13
ఉక్రెయిన్‌లోని మేరియుపొల్‌లో కదులుతున్న రష్యన్‌ యుద్ధ ట్యాంకులు(మార్చి 11, 2022) (ఫొటోగ్రాఫర్‌: ఎవిగ్నీ మాలలోలెట్కా) ఉక్రెయిన్‌లోని మేరియుపొల్‌లో కదులుతున్న రష్యన్‌ యుద్ధ ట్యాంకులు(మార్చి 11, 2022) (ఫొటోగ్రాఫర్‌: ఎవిగ్నీ మాలలోలెట్కా)
5/13
కజకిస్థాన్‌లోని అకేస్పే గ్రామానికి సమీపంలో ఉన్న అరల్ సముద్రం నుంచి ఉద్భవించిన వేడి నీటి బుగ్గ వద్ద మహిళలు(27 ఆగస్టు 2019)((ఫొటోగ్రాఫర్‌: అనుష్‌ బాబాజన్యాన్‌) కజకిస్థాన్‌లోని అకేస్పే గ్రామానికి సమీపంలో ఉన్న అరల్ సముద్రం నుంచి ఉద్భవించిన వేడి నీటి బుగ్గ వద్ద మహిళలు(27 ఆగస్టు 2019)((ఫొటోగ్రాఫర్‌: అనుష్‌ బాబాజన్యాన్‌)
6/13
తజికిస్థాన్‌లోని రోగన్‌ డ్యామ్‌ వద్ద ఫొటో తీసుకుంటున్న సందర్శకులు(మార్చి 22, 2022). హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కోసం నిర్మిస్తున్న 335 మీటర్ల ఎత్తైన ఈ డ్యామ్‌ 2028-2029 మధ్య పూర్తి కానుంది.(ఫొటోగ్రాఫర్‌: అనుష్‌ బాబాజన్యాన్‌) తజికిస్థాన్‌లోని రోగన్‌ డ్యామ్‌ వద్ద ఫొటో తీసుకుంటున్న సందర్శకులు(మార్చి 22, 2022). హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కోసం నిర్మిస్తున్న 335 మీటర్ల ఎత్తైన ఈ డ్యామ్‌ 2028-2029 మధ్య పూర్తి కానుంది.(ఫొటోగ్రాఫర్‌: అనుష్‌ బాబాజన్యాన్‌)
7/13
ఉజ్బెకిస్థాన్‌లోని నదిలో నీటి నిల్వలు అడుగంటి ఎర్రగా మారిన దృశ్యం.(అక్టోబర్‌ 29, 2019)(ఫొటోగ్రాఫర్‌: అనుష్‌ బాబాజన్యాన్‌) ఉజ్బెకిస్థాన్‌లోని నదిలో నీటి నిల్వలు అడుగంటి ఎర్రగా మారిన దృశ్యం.(అక్టోబర్‌ 29, 2019)(ఫొటోగ్రాఫర్‌: అనుష్‌ బాబాజన్యాన్‌)
8/13
తజికిస్థాన్‌లోని వఖ్ష్ నది తీరంలో నిర్మించుకున్న తన నివాసం వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఇసికూల్‌ గ్రామ నివాసి చిత్రమిది. అనుష్‌ బాబాజన్యాన్‌ తీసిన ఈ ఫొటో.. వరల్డ్‌ ప్రెస్‌ ఫొటో లాంగ్‌ టర్మ్‌ ప్రాజెక్టు అవార్డును గెలుచుకుంది. తజికిస్థాన్‌లోని వఖ్ష్ నది తీరంలో నిర్మించుకున్న తన నివాసం వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఇసికూల్‌ గ్రామ నివాసి చిత్రమిది. అనుష్‌ బాబాజన్యాన్‌ తీసిన ఈ ఫొటో.. వరల్డ్‌ ప్రెస్‌ ఫొటో లాంగ్‌ టర్మ్‌ ప్రాజెక్టు అవార్డును గెలుచుకుంది.
9/13
కాబూల్‌లో గతంలో ఉన్న యూఎస్‌ ఎంబసీ మీద ‘అల్లా తప్ప మరే దేవుడు లేడు’ అని రాసిన ఉన్న సందేశం.(ఫొటోగ్రాఫర్‌: మాడ్స్‌ నిస్సన్‌) కాబూల్‌లో గతంలో ఉన్న యూఎస్‌ ఎంబసీ మీద ‘అల్లా తప్ప మరే దేవుడు లేడు’ అని రాసిన ఉన్న సందేశం.(ఫొటోగ్రాఫర్‌: మాడ్స్‌ నిస్సన్‌)
10/13
అఫ్గనిస్థాన్‌లోని కాబూల్‌లో ఓ బేకరీ ఎదుట మహిళలు, చిన్నారులు బ్రెడ్‌ను ఇవ్వాలని యాచిస్తూ, ప్రాధేయపడుతూ కనిపించారు( జనవరి 14, 2022)(ఫొటోగ్రాఫర్‌ మాడ్స్‌ నిస్సన్‌) అఫ్గనిస్థాన్‌లోని కాబూల్‌లో ఓ బేకరీ ఎదుట మహిళలు, చిన్నారులు బ్రెడ్‌ను ఇవ్వాలని యాచిస్తూ, ప్రాధేయపడుతూ కనిపించారు( జనవరి 14, 2022)(ఫొటోగ్రాఫర్‌ మాడ్స్‌ నిస్సన్‌)
11/13
అఫ్గనిస్థాన్‌లో తాలిబన్‌ చెక్‌పాయింట్‌ వద్ద గస్తీ ఫొటో(జనవరి 12, 2022)(ఫొటోగ్రాఫర్‌ మాడ్స్‌ నిస్సన్‌) అఫ్గనిస్థాన్‌లో తాలిబన్‌ చెక్‌పాయింట్‌ వద్ద గస్తీ ఫొటో(జనవరి 12, 2022)(ఫొటోగ్రాఫర్‌ మాడ్స్‌ నిస్సన్‌)
12/13
అఫ్గనిస్థాన్‌లో సంక్షోభం కారణంగా ఒక్కపూట భోజనం కూడా తినలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఖలీల్‌ అహ్మద్‌(15) తల్లిదండ్రులు బాలుడి  కిడ్నీని 3,500 యూఎస్‌ డాలర్లకు అమ్మారు.(ఫొటోగ్రాఫర్‌ ఫొలిటికెన్‌) అఫ్గనిస్థాన్‌లో సంక్షోభం కారణంగా ఒక్కపూట భోజనం కూడా తినలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఖలీల్‌ అహ్మద్‌(15) తల్లిదండ్రులు బాలుడి కిడ్నీని 3,500 యూఎస్‌ డాలర్లకు అమ్మారు.(ఫొటోగ్రాఫర్‌ ఫొలిటికెన్‌)
13/13
ఉక్రెయిన్‌లోని మేరియుపొల్‌లోని ప్రసూతి ఆసుపత్రిపై మార్చి 9, 2022న జరిగిన రష్యా వైమానిక దాడిలో 32 ఏళ్ల గర్భిణి కళినినా గాయపడ్డారు. ఆమెకు సత్వర వైద్యం అందించేందుకు తీసుకెళ్తున్న ఈ ఫొటోను అసోసియేటెడ్‌ ఫొటోగ్రాఫర్‌ ఎవ్‌గెన్లీ మలోటెకా తీశారు. ఉక్రెయిన్‌లోని మేరియుపొల్‌లోని ప్రసూతి ఆసుపత్రిపై మార్చి 9, 2022న జరిగిన రష్యా వైమానిక దాడిలో 32 ఏళ్ల గర్భిణి కళినినా గాయపడ్డారు. ఆమెకు సత్వర వైద్యం అందించేందుకు తీసుకెళ్తున్న ఈ ఫొటోను అసోసియేటెడ్‌ ఫొటోగ్రాఫర్‌ ఎవ్‌గెన్లీ మలోటెకా తీశారు.

మరిన్ని