Redmi 10 Prime: లైట్ వెయిట్..తక్కువ ధర..ఎక్కువ ఫీచర్స్‌తో రెడ్‌మీ 10 ప్రైమ్‌

Redmi 10 Prime: లైట్ వెయిట్..తక్కువ ధర..ఎక్కువ ఫీచర్స్‌తో రెడ్‌మీ 10 ప్రైమ్‌

1/12

షావోమి కంపెనీ రెడ్‌మీ మొబైల్‌ శ్రేణిలో మరో కొత్త ఫోన్‌ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్‌మీ 10 ప్రైమ్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ మోడల్‌లో కెమెరా ప్రాధాన్యంగా ఎన్నో రకాల ఆకర్షణీయమైన ఫీచర్స్‌ ఇస్తున్నారు. గతంలో విడుదల చేసిన రెడ్‌మీ 9 ప్రైమ్‌కి కొనసాగింపుగా తీసుకొచ్చిన రెడ్‌మీ 10 ప్రైమ్‌ ధర..ఫీచర్స్‌తోపాటు ఇతర వివరాలను తెలుసుకుందాం.

2/12

రెడ్‌మీ 10 ప్రైమ్‌లో 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. అలానే రిఫ్రెష్‌ రేట్‌ యూజర్‌ చూసే కంటెంట్‌ని ఆధారంగా మారుతుంది. అంటే గేమింగ్ సమయంలో 90 హెర్జ్‌, వీడియోలకు 60 హెర్జ్‌, ఫొటోలకు 45 హెర్జ్‌ ఉంటుంది.

3/12

ఫోన్‌లో టెక్ట్స్‌ ఎక్కువగా చదివే వారి కోసం రీడింగ్‌ మోడ్‌ 3.0ని ఇస్తున్నారు. దీంతో కంటికి అనుకూలమైన కలర్‌ టెంపరేచర్‌ సెట్ చేసుకోవచ్చు.

4/12

గేమింగ్ కోసం ఈ ఫోన్‌లో హైపర్ గేమింగ్ 2.0, గేమ్ టర్బో ఫీచర్స్ ఇస్తున్నారు. గేమింగ్‌ సమయంలో ఫోన్ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ నుంచి 2 జీబీ ర్యామ్‌ సపోర్ట్ అదనంగా ఉంటుంది.

5/12

ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్‌ఐయూఐ 12.5 ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ ఫోన్ కేవలం 192 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది.

6/12

మొత్తం ఐదు కెమెరాలున్నాయి. వెనుక నాలుగు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్‌, రెండు 2 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. ముందు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు.

7/12

డిజిటల్‌ వీడియో కంటెంట్ తయారు చేసేవారి కోసం ఈ ఫోన్‌లో స్లోమోషన్‌, టైమ్‌ ల్యాప్స్‌, స్కై మోడ్, వీడియో ఫిల్టర్స్‌, ఎడిటల్‌ మోడ్స్‌, డ్యూయల్‌ స్టీరియో స్పీకర్స్‌, డ్యూయల్‌ మైక్స్‌ వంటి ఫీచర్స్‌ ఇస్తున్నారు.

8/12

ఇందులో మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఏఆర్‌ఎమ్‌ మలి-జీ52 ఎమ్‌సీ2 గ్రాఫిక్ కార్డ్‌ ఇస్తున్నారు. 4 జీబీ, 6 జీబీ ర్యామ్‌లు ఉన్నాయి. వీటికి అదనంగా 2 జీబీ ర్యామ్‌ను ఇంటర్నల్ స్టోరేజ్‌ నుంచి తీసుకుంటుంది.

9/12

రెడ్‌మీ 10 ప్రైమ్‌లో 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలానే ఈ ఫోన్ 9 వాట్‌ రివర్స్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే ఫోన్ బ్యాటరీ సాయంతో ఇయర్‌బడ్స్‌, బ్లూటూత్‌ ఇయర్‌ఫోన్స్ వంటివి ఛార్జ్ చేసుకోవచ్చు.

10/12

రెడ్‌మీ 10 ప్రైమ్‌లో డ్యూయల్‌ గ్రాఫైట్ షీట్స్‌, నీటిలో తడిచినా పాడవకుండా స్ప్లాష్‌ ప్రూఫ్‌తో రక్షణ కల్పించారు.

11/12

4 జీబీ ర్యామ్‌/64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 12,499. 6 జీబీ ర్యామ్‌/128 జీబీ ధర రూ. 14,499.

12/12

అస్ట్రాల్ వైట్, బైఫ్రోస్ట్ బ్లూ, ఫాంటమ్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. సెప్టెంబరు 7 నుంచి అమెజాన్‌, ఎంఐ వెబ్‌సైట్లతోపాటు ఎంఐ హోం స్టోర్‌, ఎంఐ స్టూడియోతోపాటు అన్ని రిటైల్ అవులెట్లలో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని