Bihu Dance: గిన్నిస్‌ రికార్డు సాధించిన అస్సాం సంప్రదాయ నృత్యం

అస్సాం సంప్రదాయ నృత్యం బిహు గిన్నిస్ రికార్డుల్లో చేరింది. శుక్రవారం ప్రధాని మోదీ సమక్షంలో అస్సాంలోని గువహటిలోని సరుసజై మైదానంలో 11,304మంది జానపద కళాకారులు నృత్యం చేయగా.. 2,548 మంది డ్రమ్ములు వాయించారు. గిన్నిస్ ప్రతినిధులు శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi), అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మకు గిన్నిస్‌ రికార్డు ప్రతులను అందజేశారు. 

Updated : 15 Apr 2023 16:03 IST
1/13
బిహు నృత్యం అస్సాం రాష్ట్రానికి చెందిన జానపద నృత్యరీతి. ఈ నృత్యంలో నాట్యకారులు అస్సామీ పట్టు, ముగా పట్టు దుస్తులు ధరిస్తారు. బిహు నృత్యం అస్సాం రాష్ట్రానికి చెందిన జానపద నృత్యరీతి. ఈ నృత్యంలో నాట్యకారులు అస్సామీ పట్టు, ముగా పట్టు దుస్తులు ధరిస్తారు.
2/13
బిహు పాటలు అస్సామీ రైతులు, ప్రజల జీవన శైలికి సంబంధించిన వివిధమైన అంశాలను వివరిస్తాయి. బొహాగ్ బిహు(వసంత ఋతువులో వచ్చే బిహు) సమయంలో ఈ నాట్యాన్ని చేస్తారు. బిహు పాటలు అస్సామీ రైతులు, ప్రజల జీవన శైలికి సంబంధించిన వివిధమైన అంశాలను వివరిస్తాయి. బొహాగ్ బిహు(వసంత ఋతువులో వచ్చే బిహు) సమయంలో ఈ నాట్యాన్ని చేస్తారు.
3/13
4/13
5/13
6/13
బిహులో డోలు, తాల్‌, పెపా(ఎద్దు కొమ్ముతో చెయబడే ఒక వాద్యం), టొకా (వెదురుని మధ్యకి చీల్చి ఒక వైపు అతికి ఉండేట్టుగా చేసి చిడతలులాగా వాయించే వాద్యం),
బాహి (వేణువు), హుతులి (చిన్న వాద్యం), గొగొనా (పళ్ళతో పట్టుకుని పక్కలను చేతులతో వాయించే చిన్న వాద్యం)లను వినియోగిస్తారు. బిహులో డోలు, తాల్‌, పెపా(ఎద్దు కొమ్ముతో చెయబడే ఒక వాద్యం), టొకా (వెదురుని మధ్యకి చీల్చి ఒక వైపు అతికి ఉండేట్టుగా చేసి చిడతలులాగా వాయించే వాద్యం), బాహి (వేణువు), హుతులి (చిన్న వాద్యం), గొగొనా (పళ్ళతో పట్టుకుని పక్కలను చేతులతో వాయించే చిన్న వాద్యం)లను వినియోగిస్తారు.
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని