News in Pics: చిత్రం చెప్పే సంగతులు-02(27-01-2023)

Updated : 27 Jan 2023 21:23 IST
1/29
హైదరాబాద్‌లోని ఓ పాఠశాలలో సాహితీ వేడుకను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కళాకృతులు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్‌లోని ఓ పాఠశాలలో సాహితీ వేడుకను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కళాకృతులు ఆకట్టుకున్నాయి.
2/29
చెట్టు మధ్యలో గుండె ఆకారం.. చెట్టు మధ్యలో గుండె ఆకారం..
3/29
కరీంనగర్‌లో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు కళాకారులు తమ నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. కరీంనగర్‌లో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు కళాకారులు తమ నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
4/29
కరీంనగర్‌లో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా కొనసాగాయి. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్‌లో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా కొనసాగాయి. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
5/29
భారత క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ తన ప్రేయసి అతియాశెట్టిని ఇటీవల వివాహమాడిన సంగతి తెలిసిందే. తమ హల్దీ వేడుకకు సంబంధించిన ఫొటోను కేఎల్‌ రాహుల్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచకున్నారు. 
దీంతో నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఫ్యాన్స్‌ కామెంట్లు, లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. భారత క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ తన ప్రేయసి అతియాశెట్టిని ఇటీవల వివాహమాడిన సంగతి తెలిసిందే. తమ హల్దీ వేడుకకు సంబంధించిన ఫొటోను కేఎల్‌ రాహుల్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచకున్నారు. దీంతో నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఫ్యాన్స్‌ కామెంట్లు, లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు.
6/29
హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘తెలంగాణ బాలోత్సవం’ నిర్వహించారు. కార్యక్రమానికి చిన్నారులు వివిధ వేషధారణల్లో హాజరై నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘తెలంగాణ బాలోత్సవం’ నిర్వహించారు. కార్యక్రమానికి చిన్నారులు వివిధ వేషధారణల్లో హాజరై నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
7/29
8/29
యువగళం పాదయాత్ర కోసం కుప్పం వచ్చిన ఓ కార్యకర్త ఇలా తన ద్విచక్రవాహనానికి సైకిల్‌ నమూనాను అలంకరించుకొని కనిపించాడు. ఆయన్ను ‘న్యూస్‌టుడే’ పలకరించగా తన పేరు సాంబశివ, స్వస్థలం కుప్పం అని తెలిపారు. తెదేపాపై అభిమానంతో బైక్‌ను ఇలా అలంకరించినట్లు, సాధ్యమైనంత దూరం యువగళం పాదయాత్రలో పాల్గొంటానని చెప్పారు. యువగళం పాదయాత్ర కోసం కుప్పం వచ్చిన ఓ కార్యకర్త ఇలా తన ద్విచక్రవాహనానికి సైకిల్‌ నమూనాను అలంకరించుకొని కనిపించాడు. ఆయన్ను ‘న్యూస్‌టుడే’ పలకరించగా తన పేరు సాంబశివ, స్వస్థలం కుప్పం అని తెలిపారు. తెదేపాపై అభిమానంతో బైక్‌ను ఇలా అలంకరించినట్లు, సాధ్యమైనంత దూరం యువగళం పాదయాత్రలో పాల్గొంటానని చెప్పారు.
9/29
రక్షిత్‌ అట్లూరి, కోమలీ ప్రసాద్‌ జంటగా సాయిమోహన్‌ ఉబ్బన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శశివదనే’. ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ ప్రోమోను విడుదల చేశారు. పూర్తి పాటను ఫిబ్రవరి 1న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. రక్షిత్‌ అట్లూరి, కోమలీ ప్రసాద్‌ జంటగా సాయిమోహన్‌ ఉబ్బన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శశివదనే’. ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ ప్రోమోను విడుదల చేశారు. పూర్తి పాటను ఫిబ్రవరి 1న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
10/29
అండర్‌-19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 8వికెట్ల తేడాతో ఓడించి భారత్‌ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. దీంతో జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘బీసీసీఐ వుమెన్‌’ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో ఈ ఫొటోను పంచుకుంది. అండర్‌-19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 8వికెట్ల తేడాతో ఓడించి భారత్‌ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. దీంతో జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘బీసీసీఐ వుమెన్‌’ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో ఈ ఫొటోను పంచుకుంది.
11/29
సుహాస్‌ హీరోగా షణ్ముఖ ప్రశాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రైటర్‌ పద్మభూషణ్‌’. టీనా శిల్పారాజ్‌ కథానాయిక. ఫిబ్రవరి 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసింది. సుహాస్‌ హీరోగా షణ్ముఖ ప్రశాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రైటర్‌ పద్మభూషణ్‌’. టీనా శిల్పారాజ్‌ కథానాయిక. ఫిబ్రవరి 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసింది.
12/29
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో శుక్రవారం ‘పెటెక్స్‌ ఇండియా’ ప్రదర్శన ప్రారంభించారు. ఇందులో 500రకాల శునకాలు, 120రకాల పిల్లుల్ని ప్రదర్శనకు ఉంచారు. వీటిని ముద్దు చేస్తూ సందర్శకులు సందడి చేశారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో శుక్రవారం ‘పెటెక్స్‌ ఇండియా’ ప్రదర్శన ప్రారంభించారు. ఇందులో 500రకాల శునకాలు, 120రకాల పిల్లుల్ని ప్రదర్శనకు ఉంచారు. వీటిని ముద్దు చేస్తూ సందర్శకులు సందడి చేశారు.
13/29
14/29
కాలిఫోర్నియాలో నిర్వహించిన యూఎస్‌ ఫిగర్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పలువురు క్రీడాకారులు సాహసోపేత విన్యాసాలు చేసి ఆకట్టుకున్నారు. కాలిఫోర్నియాలో నిర్వహించిన యూఎస్‌ ఫిగర్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పలువురు క్రీడాకారులు సాహసోపేత విన్యాసాలు చేసి ఆకట్టుకున్నారు.
15/29
చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ‘వీరయ్య విజయ విహారం’ పేరిట జనవరి 28న హనుమకొండలోని ఆర్ట్స్ అండ్‌ సైన్స్‌ కళాశాలలో వేడుకను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సినీ నటుడు రామ్‌చరణ్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారని చిత్రబృందం ప్రకటిచింది. చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ‘వీరయ్య విజయ విహారం’ పేరిట జనవరి 28న హనుమకొండలోని ఆర్ట్స్ అండ్‌ సైన్స్‌ కళాశాలలో వేడుకను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సినీ నటుడు రామ్‌చరణ్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారని చిత్రబృందం ప్రకటిచింది.
16/29
అనికా సురేంద్రన్‌, సూర్య వశిష్ఠ, అర్జున్‌ దాస్‌ ప్రధాన పాత్రల్లో శౌరి చంద్రశేఖర్‌ రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బుట్టబొమ్మ’. ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. విశ్వక్‌సేన్‌ చేతులమీదుగా 
ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం ఉదయం 11.07గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. అనికా సురేంద్రన్‌, సూర్య వశిష్ఠ, అర్జున్‌ దాస్‌ ప్రధాన పాత్రల్లో శౌరి చంద్రశేఖర్‌ రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బుట్టబొమ్మ’. ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. విశ్వక్‌సేన్‌ చేతులమీదుగా ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం ఉదయం 11.07గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
17/29
కాచిగూడలోని భద్రుకా కళాశాలలో ‘ఫ్లాష్ 2023’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థినులు నృత్యం, ర్యాంప్‌ వాక్‌, సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కాచిగూడలోని భద్రుకా కళాశాలలో ‘ఫ్లాష్ 2023’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థినులు నృత్యం, ర్యాంప్‌ వాక్‌, సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
18/29
నృత్య ప్రదర్శన ఇస్తున్న యువతులు నృత్య ప్రదర్శన ఇస్తున్న యువతులు
19/29
ఇటీవల అగ్నిప్రమాదం సంభవించిన సికింద్రాబాద్ మినిస్టర్‌ రోడ్డులోని డెక్కన్ మాల్ భవనం కూల్చివేత పనులను అధికారులు మొదలుపెట్టారు. ఇటీవల అగ్నిప్రమాదం సంభవించిన సికింద్రాబాద్ మినిస్టర్‌ రోడ్డులోని డెక్కన్ మాల్ భవనం కూల్చివేత పనులను అధికారులు మొదలుపెట్టారు.
20/29
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకోశ్‌ కుప్పంలో ‘యువగళం’ పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రకు భారీగా నాయకులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకోశ్‌ కుప్పంలో ‘యువగళం’ పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రకు భారీగా నాయకులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు.
21/29
గణతంత్ర వేడుకల్లో భాగంగా రాజమహేంద్రవరంలో జరిగిన కార్యక్రమంలో పుంగనూరు దూడలు అందరినీ ఆకట్టుకున్నాయి. రంగంపేటకు చెందిన రైతు మహేష్ పెంచుతున్న మూడు నెలల వయసున్న 16 అంగుళాల దూడ ఒకటి, రెండేళ్ల వయసున్న 24 అంగుళాల దూడ మరొకటి ముచ్చట గొలిపాయి. గణతంత్ర వేడుకల్లో భాగంగా రాజమహేంద్రవరంలో జరిగిన కార్యక్రమంలో పుంగనూరు దూడలు అందరినీ ఆకట్టుకున్నాయి. రంగంపేటకు చెందిన రైతు మహేష్ పెంచుతున్న మూడు నెలల వయసున్న 16 అంగుళాల దూడ ఒకటి, రెండేళ్ల వయసున్న 24 అంగుళాల దూడ మరొకటి ముచ్చట గొలిపాయి.
22/29
గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా విశాఖపట్నంలోని ఎండాడ(ఎస్సీ కాలనీ) అంబేడ్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో 1600 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా విశాఖపట్నంలోని ఎండాడ(ఎస్సీ కాలనీ) అంబేడ్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో 1600 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు.
23/29
మన్యంలో చలి తీవ్రత కొనసాగుతోంది. మూడు రోజులుగా చింతపల్లిలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం ఉదయం అత్యల్పంగా 4.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డా. ఎం.సురేష్‌కుమార్‌ తెలిపారు. మారేడుమిల్లి ప్రాంతంలో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మన్యంలో చలి తీవ్రత కొనసాగుతోంది. మూడు రోజులుగా చింతపల్లిలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం ఉదయం అత్యల్పంగా 4.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డా. ఎం.సురేష్‌కుమార్‌ తెలిపారు. మారేడుమిల్లి ప్రాంతంలో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
24/29
కోహెడ మండలం తంగళ్లపల్లి, కూరెల్ల గ్రామాల మధ్య ఉన్న మోయతుమ్మెద వాగు అందాలు చూపరులను ఆకట్టుకుంటోంది. ఎత్తైన పచ్చని గుట్టల మధ్య నుంచి ప్రవహించే ఈ వాగు దగ్గర సింగరాయ జాతర నిర్వహిస్తారు. కోహెడ మండలం తంగళ్లపల్లి, కూరెల్ల గ్రామాల మధ్య ఉన్న మోయతుమ్మెద వాగు అందాలు చూపరులను ఆకట్టుకుంటోంది. ఎత్తైన పచ్చని గుట్టల మధ్య నుంచి ప్రవహించే ఈ వాగు దగ్గర సింగరాయ జాతర నిర్వహిస్తారు.
25/29
సంగారెడ్డి జిల్లాలోని ఫల పరిశోధనా కేంద్రం ఆవరణలో ఎర్రటి కాగితం పూల మొక్క అటుగా వెళ్లేవారిని పలకరిస్తోంది. లోపలికి వచ్చేవారిని ఆహ్వానిస్తున్నట్లుగా ఎర్రని పుష్పాలతో అల్లుకంది. సంగారెడ్డి జిల్లాలోని ఫల పరిశోధనా కేంద్రం ఆవరణలో ఎర్రటి కాగితం పూల మొక్క అటుగా వెళ్లేవారిని పలకరిస్తోంది. లోపలికి వచ్చేవారిని ఆహ్వానిస్తున్నట్లుగా ఎర్రని పుష్పాలతో అల్లుకంది.
26/29

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ ఏరియాలోని గనుల్లో కోతుల సంచారం రోజు రోజుకీ పెరిగిపోతోంది. దీంతో స్థానికులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ ఏరియాలోని గనుల్లో కోతుల సంచారం రోజు రోజుకీ పెరిగిపోతోంది. దీంతో స్థానికులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
27/29
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌ను త్రివర్ణ విద్యుద్దీపాల వెలుగులతో ముస్తాబు చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌ను త్రివర్ణ విద్యుద్దీపాల వెలుగులతో ముస్తాబు చేశారు.
28/29
హనుమకొండలోని కేసముద్రం మండలానికి చెందిన వడ్డేబోయిన సదాశివుడు తన తనయుడి కోసం చేసిన ఆలోచన అందరిని ఆకట్టుకుంటోంది. కుమారుడికి కారు నడుపుతున్న అనుభూతిని కలిగించేందుకు సైకిల్‌కి స్ట్రీరింగ్‌ అమర్చాడు. దీంతో ఆ బాలుడి ఆనందం అవధులు దాటింది. హనుమకొండలోని కేసముద్రం మండలానికి చెందిన వడ్డేబోయిన సదాశివుడు తన తనయుడి కోసం చేసిన ఆలోచన అందరిని ఆకట్టుకుంటోంది. కుమారుడికి కారు నడుపుతున్న అనుభూతిని కలిగించేందుకు సైకిల్‌కి స్ట్రీరింగ్‌ అమర్చాడు. దీంతో ఆ బాలుడి ఆనందం అవధులు దాటింది.
29/29
వసంతి పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్మల్‌ జిల్లా కేంద్రంలో గురువారం ఓ బుల్లి రైలును ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు తయారు చేశారు. ఈ రంగుల రైలు అందరి దృష్టిని ఆకర్షించింది. వసంతి పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్మల్‌ జిల్లా కేంద్రంలో గురువారం ఓ బుల్లి రైలును ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు తయారు చేశారు. ఈ రంగుల రైలు అందరి దృష్టిని ఆకర్షించింది.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు