News in Pics: చిత్రం చెప్పే సంగతులు-01(29-01-2023)

Updated : 29 Jan 2023 07:20 IST
1/19
ముఖ్యమంత్రి జగన్‌ భద్రత పేరుతో ఆర్టీసీ బస్టాండు రోడ్డులో డివైడర్‌ మధ్యలో ఏపుగా పెరిగిన పచ్చని చెట్లను అడ్డంగా నరికేశారు. చేదోడు కార్యక్రమంలో లబ్ధిదారులకు మూడో విడత ఆర్థిక సాయం విడుదల చేసేందుకు 30న సీఎం పల్నాడు జిల్లా వినుకొండ వస్తున్నారు. ఈ సందర్భంగా భద్రత పేరుతో అధికారులు చెట్లను శనివారం రాత్రి రంపంతో కోయించారు. సీఎం వెళ్లే మార్గంలో సుమారు 50కి పైగా చెట్లను ఇలా నరికేశారు. ముఖ్యమంత్రి జగన్‌ భద్రత పేరుతో ఆర్టీసీ బస్టాండు రోడ్డులో డివైడర్‌ మధ్యలో ఏపుగా పెరిగిన పచ్చని చెట్లను అడ్డంగా నరికేశారు. చేదోడు కార్యక్రమంలో లబ్ధిదారులకు మూడో విడత ఆర్థిక సాయం విడుదల చేసేందుకు 30న సీఎం పల్నాడు జిల్లా వినుకొండ వస్తున్నారు. ఈ సందర్భంగా భద్రత పేరుతో అధికారులు చెట్లను శనివారం రాత్రి రంపంతో కోయించారు. సీఎం వెళ్లే మార్గంలో సుమారు 50కి పైగా చెట్లను ఇలా నరికేశారు.
2/19
సైఫాబాద్‌ ప్రధాన రహదారిలో ఓ ఆర్టీసీ బస్సు పాడైపోవడంతో డ్రైవర్‌ రోడ్డుపక్కన నిలిపాడు. ఇంతలో అటుగా వచ్చిన ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ చలానా వేసేందుకు ఫొటో తీసుకున్నాడు. బస్సు పాడైపోవడంతో ఇలా రోడ్డు పక్కన నిలపాల్సి వచ్చిందని చలానా వేయవద్దని డ్రైవర్, కండక్టర్‌ ఆయన్ను కోరారు. సైఫాబాద్‌ ప్రధాన రహదారిలో ఓ ఆర్టీసీ బస్సు పాడైపోవడంతో డ్రైవర్‌ రోడ్డుపక్కన నిలిపాడు. ఇంతలో అటుగా వచ్చిన ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ చలానా వేసేందుకు ఫొటో తీసుకున్నాడు. బస్సు పాడైపోవడంతో ఇలా రోడ్డు పక్కన నిలపాల్సి వచ్చిందని చలానా వేయవద్దని డ్రైవర్, కండక్టర్‌ ఆయన్ను కోరారు.
3/19
కృష్ణా పరీవాహక ప్రాంత ప్రజలను వరదల నుంచి కాపాడేందుకు వారధి పరిసరాల నుంచి గీతానగర్‌ వరకూ రక్షణ గోడను నిర్మించారు. ఈ పరిసర ప్రాంతాల పిల్లలతో పాటు, కొందరు ఆకతాయిలు గోడ ఎక్కి కూర్చుని చేపలు పడుతున్నారు. ఇది ప్రమాద భరితంగా మారింది. ఈ నేపథ్యంలో ఎవరూ ఎక్కడానికి వీలు లేకుండా నగర పాలక సంస్థ అధికారులు రక్షణ గోడపై చెక్కలతో ఫెన్సింగ్‌ తరహా ఏర్పాటు చేశారు. కృష్ణా పరీవాహక ప్రాంత ప్రజలను వరదల నుంచి కాపాడేందుకు వారధి పరిసరాల నుంచి గీతానగర్‌ వరకూ రక్షణ గోడను నిర్మించారు. ఈ పరిసర ప్రాంతాల పిల్లలతో పాటు, కొందరు ఆకతాయిలు గోడ ఎక్కి కూర్చుని చేపలు పడుతున్నారు. ఇది ప్రమాద భరితంగా మారింది. ఈ నేపథ్యంలో ఎవరూ ఎక్కడానికి వీలు లేకుండా నగర పాలక సంస్థ అధికారులు రక్షణ గోడపై చెక్కలతో ఫెన్సింగ్‌ తరహా ఏర్పాటు చేశారు.
4/19
మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వొద్దని పోలీసులు ఎంత మొత్తుకున్నా తల్లిదండ్రులకు పట్టడం లేదు. బరువైన బైక్‌లను కాలు కూడా అందని మైనర్లు నడిపి వారితోపాటు ఇతరులకూ ప్రమాదకరంగా మారుతున్నారు. బీకేగూడలో శనివారం ఓ బాలుడు ద్విచక్ర వాహనాన్ని రహదారిపై నడుపుతూ ఇలా కనిపించాడు. మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వొద్దని పోలీసులు ఎంత మొత్తుకున్నా తల్లిదండ్రులకు పట్టడం లేదు. బరువైన బైక్‌లను కాలు కూడా అందని మైనర్లు నడిపి వారితోపాటు ఇతరులకూ ప్రమాదకరంగా మారుతున్నారు. బీకేగూడలో శనివారం ఓ బాలుడు ద్విచక్ర వాహనాన్ని రహదారిపై నడుపుతూ ఇలా కనిపించాడు.
5/19
 చారిత్రక విజయనగర సామ్రాజ్య రాజధాని హంపీ వీధుల్లో యువతీయువకుల కోసం కుస్తీపోటీలు ఉత్కంఠ భరితంగా ప్రారంభమయ్యాయి. దేశ, విదేశీ పర్యాటకుల రాకతో హంపీ వీధులు కొత్త అందాలను సంతరించుకున్నాయి. 

చారిత్రక విజయనగర సామ్రాజ్య రాజధాని హంపీ వీధుల్లో యువతీయువకుల కోసం కుస్తీపోటీలు ఉత్కంఠ భరితంగా ప్రారంభమయ్యాయి. దేశ, విదేశీ పర్యాటకుల రాకతో హంపీ వీధులు కొత్త అందాలను సంతరించుకున్నాయి.
6/19
  శ్రీకాకుళం, రథసప్తమి సందర్భంగా శనివారం తీరానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సముద్రస్నానాలు చేసి సూర్యునికి పూజలు నిర్వహించారు.

శ్రీకాకుళం, రథసప్తమి సందర్భంగా శనివారం తీరానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సముద్రస్నానాలు చేసి సూర్యునికి పూజలు నిర్వహించారు.
7/19
   అనంతపురం జిల్లాలోని డి.హీరేహాళ్‌లో పవనసుతుడి ఊరేగింపు అనంతపురం జిల్లాలోని డి.హీరేహాళ్‌లో పవనసుతుడి ఊరేగింపు
8/19
వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం చెన్నూరులోని చెరువులో మోడువారిన చెట్ల కొమ్మలు కొంగలు వాలి కొత్తరూపును సంతరించుకోవడమే కాకుండా ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి.

వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం చెన్నూరులోని చెరువులో మోడువారిన చెట్ల కొమ్మలు కొంగలు వాలి కొత్తరూపును సంతరించుకోవడమే కాకుండా ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి.
9/19
 నల్గొండ జిల్లా,మిర్యాలగూడ పట్టణానికి చెందిన నవ్య కళానికేతన్‌ సాంస్కృతిక, సంగీత సంస్థ వ్యవస్థాపకుడు తడకమళ్ల రామరంగారావు 64ఏళ్లు వయసులో  విన్యాసాలు చేస్తూ అబ్బురపరుస్తున్నాడు. గత ఆరేళ్లుగా యోగా సాధన చేస్తున్న ఆయన నీటిపై పద్మాసనం, సుఖాసనంతో పాటు ఇతర ఆసనాలు గంటల తరబడి వేస్తున్నారు. నల్గొండ జిల్లా,మిర్యాలగూడ పట్టణానికి చెందిన నవ్య కళానికేతన్‌ సాంస్కృతిక, సంగీత సంస్థ వ్యవస్థాపకుడు తడకమళ్ల రామరంగారావు 64ఏళ్లు వయసులో విన్యాసాలు చేస్తూ అబ్బురపరుస్తున్నాడు. గత ఆరేళ్లుగా యోగా సాధన చేస్తున్న ఆయన నీటిపై పద్మాసనం, సుఖాసనంతో పాటు ఇతర ఆసనాలు గంటల తరబడి వేస్తున్నారు.
10/19
   హైదరాబాద్, మాదాపూర్‌ హైటెక్స్‌లో జరుగుతున్న పెటెక్స్‌ ఇండియా-2023 ప్రదర్శనలో రెండోరోజు శనివారం సందర్శకులు పోటెత్తారు. విభిన్న జాతుల శునకాలు, పిల్లులు, పక్షులు, చేపలను ఆసక్తిగా తిలకిస్తూ సందడి చేశారు. 

హైదరాబాద్, మాదాపూర్‌ హైటెక్స్‌లో జరుగుతున్న పెటెక్స్‌ ఇండియా-2023 ప్రదర్శనలో రెండోరోజు శనివారం సందర్శకులు పోటెత్తారు. విభిన్న జాతుల శునకాలు, పిల్లులు, పక్షులు, చేపలను ఆసక్తిగా తిలకిస్తూ సందడి చేశారు.
11/19
 హైదరాబాద్, మాదాపూర్‌ హైటెక్స్‌లో జరుగుతున్న పెటెక్స్‌ ఇండియా ప్రదర్శనలో  అరుదైన చేప ఇది. ఇండోనేషియాకు చెందిన ఈ అరోవాన (వాస్తు చేప)  చేప దాదాపు 30-35 ఏళ్లకు పైగా జీవిస్తుందని, దీని ధర రూ.లక్షల్లో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

12/19
 హైదరాబాద్‌ నగరంలో ఫుట్‌పాత్‌ల ఆక్రమణపై ఇప్పటికే పలుమార్లు కోర్టు జీహెచ్‌ఎంసీకి మొట్టికాయలు వేసినా తీరు మారలేదు. నెక్లెస్‌ రోడ్డులో ఓ వ్యక్తి ఏకంగా పశువులను కట్టేస్తున్నాడు.

హైదరాబాద్‌ నగరంలో ఫుట్‌పాత్‌ల ఆక్రమణపై ఇప్పటికే పలుమార్లు కోర్టు జీహెచ్‌ఎంసీకి మొట్టికాయలు వేసినా తీరు మారలేదు. నెక్లెస్‌ రోడ్డులో ఓ వ్యక్తి ఏకంగా పశువులను కట్టేస్తున్నాడు.
13/19
  హైదరాబాద్‌ నగరంలో చలి మళ్లీ పెరిగింది. గాంధీ ఆసుపత్రిలో రోగుల సంబంధీకులు పడుకోవడానికి ఏర్పాటు చేసిన షెడ్లు పూర్తిగా నిండిపోవడంతో పలువురు ఇలా కాలిబాటపై నిద్రించారు.

హైదరాబాద్‌ నగరంలో చలి మళ్లీ పెరిగింది. గాంధీ ఆసుపత్రిలో రోగుల సంబంధీకులు పడుకోవడానికి ఏర్పాటు చేసిన షెడ్లు పూర్తిగా నిండిపోవడంతో పలువురు ఇలా కాలిబాటపై నిద్రించారు.
14/19
 ఈ చిత్రాన్ని చూసి నగర శివారులోని ఇంజినీరింగ్‌ కాలేజీలకు వెళుతున్న విద్యార్థులు అనుకుంటే పొరపాటు.. సికింద్రాబాద్‌-దిల్‌సుఖ్‌నగర్‌ బస్సు ప్రయాణికులు వీరంతా. అత్యంత ప్రమాదకరంగా వేలాడుతూ ప్రయాణిస్తున్నారు.

15/19
 రాజస్థాన్‌ రాష్ట్రంలోని కోటా జిల్లా బంధ ధర్మపురకు చెందిన సునీల్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా పట్టణానికి చెందిన రేఖా అనే యువతిని గత గురువారం వివాహం చేసుకున్నాడు. తాతయ్య, నానమ్మల కోరిక తీర్చేందుకు నవవధువును తీసుకువెళ్లేందుకువరుడు హెలికాప్టర్‌లో వచ్చాడు.

16/19
 రష్యా క్షిపణి దాడి కారణంగా ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్‌ రీజియన్‌ వుహ్లెదార్‌లో ధ్వంసమైన భవనాలు, వాహనాలు

రష్యా క్షిపణి దాడి కారణంగా ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్‌ రీజియన్‌ వుహ్లెదార్‌లో ధ్వంసమైన భవనాలు, వాహనాలు
17/19
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాందీ జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో అమరులైన 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు శనివారం నివాళులు అర్పించారు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాందీ జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో అమరులైన 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు శనివారం నివాళులు అర్పించారు
18/19
 జమ్మూకశ్మీర్‌లోని, గుల్మార్గ్‌లో ఉన్న గ్రీన్‌ హైట్స్‌ రెస్టారెంటు వినూత్నంగా అద్దాల ఇగ్లూలను ఏర్పాటు చేసింది.

జమ్మూకశ్మీర్‌లోని, గుల్మార్గ్‌లో ఉన్న గ్రీన్‌ హైట్స్‌ రెస్టారెంటు వినూత్నంగా అద్దాల ఇగ్లూలను ఏర్పాటు చేసింది.
19/19
 ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ ఉద్యానవనాల్లో ఒకటైన దిల్లీ, రాష్ట్రపతి భవన్‌లోని మొగల్‌ గార్డెన్స్‌ పేరు మారింది. ఇక నుంచి దీనిని ‘అమృత్‌ ఉద్యాన్‌’గా పిలవనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు