News in Pics: చిత్రం చెప్పే సంగతులు-02(29-01-2023)

Updated : 29 Jan 2023 21:13 IST
1/26
పులివెందుల పట్టణంలోని పద్మావతి సమేత కళ్యాణ వేంకటరమణ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రధాన అర్చకుడు వరదాచార్యులు ఆధ్వర్యంలో ఊంజల్ సేవ నిర్వహించారు. శ్రీ దేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను పెదశేష వాహనంపై ఊరేగించారు. పులివెందుల పట్టణంలోని పద్మావతి సమేత కళ్యాణ వేంకటరమణ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రధాన అర్చకుడు వరదాచార్యులు ఆధ్వర్యంలో ఊంజల్ సేవ నిర్వహించారు. శ్రీ దేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను పెదశేష వాహనంపై ఊరేగించారు.
2/26
హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ అనంతరం కోలుకుంటున్న తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రను ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు పరామర్శించారు. హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ అనంతరం కోలుకుంటున్న తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రను ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు పరామర్శించారు.
3/26
పరామర్శిస్తున్న చంద్రబాబు పరామర్శిస్తున్న చంద్రబాబు
4/26
సైఫాబాద్‌లోని విద్యారణ్య హైస్కూల్‌లో నిర్వహిస్తున్న సాహితీ వేడుకలు ఆదివారం ముగింపునకు వచ్చాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ది నేషనల్‌ రాక్‌బీట్‌ బృందం ఇచ్చిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సైఫాబాద్‌లోని విద్యారణ్య హైస్కూల్‌లో నిర్వహిస్తున్న సాహితీ వేడుకలు ఆదివారం ముగింపునకు వచ్చాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ది నేషనల్‌ రాక్‌బీట్‌ బృందం ఇచ్చిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
5/26
సాహితీ వేడుకలకు హాజరైన ఓ మహిళ అక్కడ పనిచేసే మహిళా కార్మికులను ఫొటోలు తీశారు. దీంతో వారు తమ ఫొటోలను కెమెరాలో ఆసక్తిగా చూసి సంబరపడ్డారు. సాహితీ వేడుకలకు హాజరైన ఓ మహిళ అక్కడ పనిచేసే మహిళా కార్మికులను ఫొటోలు తీశారు. దీంతో వారు తమ ఫొటోలను కెమెరాలో ఆసక్తిగా చూసి సంబరపడ్డారు.
6/26
అండర్‌-19 మహిళల ప్రపంచకప్‌లో భారత్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్‌లో 7వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌ను ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా వీక్షించారు. (ఫొటో సోర్స్‌: ఐసీసీ). అండర్‌-19 మహిళల ప్రపంచకప్‌లో భారత్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్‌లో 7వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌ను ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా వీక్షించారు. (ఫొటో సోర్స్‌: ఐసీసీ).
7/26
ఫొటో సోర్స్‌: బీసీసీఐ వుమెన్‌ ఫొటో సోర్స్‌: బీసీసీఐ వుమెన్‌
8/26
పవన్‌ కల్యాణ్‌ హీరోగా దర్శకుడు సుజిత్‌ ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో సోమవారం ప్రారంభం కానుంది. ఈ మేరకు చిత్రబృందం పోస్టర్‌ను విడుదల చేసింది. పవన్‌ కల్యాణ్‌ హీరోగా దర్శకుడు సుజిత్‌ ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో సోమవారం ప్రారంభం కానుంది. ఈ మేరకు చిత్రబృందం పోస్టర్‌ను విడుదల చేసింది.
9/26
ఆస్ట్రేలియా ఓపెన్‌లో గెలుపు అనంతరం జకోవిచ్‌ తన తల్లి డిజానాతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె జకోవిచ్‌ను ఆప్యాయంగా ముద్దాడింది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో గెలుపు అనంతరం జకోవిచ్‌ తన తల్లి డిజానాతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె జకోవిచ్‌ను ఆప్యాయంగా ముద్దాడింది.
10/26
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో జకోవిచ్‌ విజయదుందుబి మోగించాడు. మెన్స్‌ సింగిల్స్‌ విభాగంలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పదో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రత్యర్థి సిట్సిపాస్‌పై గెలుపు అనంతరం జకోవిచ్‌ భావోద్వేగానికి గురై ఆనందబాష్పాలు రాల్చాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో జకోవిచ్‌ విజయదుందుబి మోగించాడు. మెన్స్‌ సింగిల్స్‌ విభాగంలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పదో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రత్యర్థి సిట్సిపాస్‌పై గెలుపు అనంతరం జకోవిచ్‌ భావోద్వేగానికి గురై ఆనందబాష్పాలు రాల్చాడు.
11/26
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తి సురేష్‌ జంటగా తెరకెక్కిన సినిమా ‘దసరా’. ఈ సినిమా టీజర్‌ను సోమవారం సాయంత్రం 4.05గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తి సురేష్‌ జంటగా తెరకెక్కిన సినిమా ‘దసరా’. ఈ సినిమా టీజర్‌ను సోమవారం సాయంత్రం 4.05గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
12/26
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికి దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికి దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.
13/26
ఆస్ట్రేలియా గాయని, నటి డెల్టా గుడ్‌రెమ్‌ లాస్ఏంజెలెస్‌లో నిర్వహించిన ‘జీ డే.. యూఎస్‌ ఆర్ట్స్ గాలా’ కార్యక్రమానికి హాజరై ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. ఆస్ట్రేలియా గాయని, నటి డెల్టా గుడ్‌రెమ్‌ లాస్ఏంజెలెస్‌లో నిర్వహించిన ‘జీ డే.. యూఎస్‌ ఆర్ట్స్ గాలా’ కార్యక్రమానికి హాజరై ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
14/26
ఆస్ట్రేలియా ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఛాంపియన్‌, బెలారస్‌ క్రీడాకారిణి సబలెంక ఆస్ట్రేలియాలోని రాయల్‌ బొటానికల్‌ గార్డెన్స్‌లో ట్రోఫీతో ఫొటోలు దిగుతూ సందడి చేశారు. టెన్నిస్‌ చరిత్రలో తటస్థ క్రీడాకారిణిగా ఆడి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన తొలి ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఛాంపియన్‌, బెలారస్‌ క్రీడాకారిణి సబలెంక ఆస్ట్రేలియాలోని రాయల్‌ బొటానికల్‌ గార్డెన్స్‌లో ట్రోఫీతో ఫొటోలు దిగుతూ సందడి చేశారు. టెన్నిస్‌ చరిత్రలో తటస్థ క్రీడాకారిణిగా ఆడి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన తొలి ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
15/26
16/26
హైదరాబాద్‌లోని దుర్గం చెరువు వద్ద 21కె, 10కె, 5కె రన్‌ నిర్వహించారు. నగరవాసులు పెద్దఎత్తున పాల్గొని సందడి చేశారు. హైదరాబాద్‌లోని దుర్గం చెరువు వద్ద 21కె, 10కె, 5కె రన్‌ నిర్వహించారు. నగరవాసులు పెద్దఎత్తున పాల్గొని సందడి చేశారు.
17/26
18/26
తన తల్లి అంజనాదేవికి చిరంజీవి ట్విటర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్‌కల్యాణ్‌, నాగబాబు, రామ్‌చరణ్‌లతో కలిసి జన్మదిన వేడుకలు నిర్వహించిన ఫొటోలను ఆయన పంచుకున్నారు. ‘జన్మజన్మలు నీకు బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటున్నాం’ అని తెలుపుతూ చిరంజీవి పోస్టు పెట్టారు. తన తల్లి అంజనాదేవికి చిరంజీవి ట్విటర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్‌కల్యాణ్‌, నాగబాబు, రామ్‌చరణ్‌లతో కలిసి జన్మదిన వేడుకలు నిర్వహించిన ఫొటోలను ఆయన పంచుకున్నారు. ‘జన్మజన్మలు నీకు బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటున్నాం’ అని తెలుపుతూ చిరంజీవి పోస్టు పెట్టారు.
19/26
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్‌లో ‘అమృత్‌ ఉద్యాన్‌’ను ప్రారంభించారు. ఇక్కడి అందాలను వీక్షించేందుకు ఈ నెల 31 నుంచి మార్చి 26 వరకు సందర్శకులకు అనుమతినిచ్చారు. గతంలో ఉన్న ‘మొగల్‌ గార్డెన్స్‌’ పేరును ‘అమృత్‌ ఉద్యాన్‌’గా మార్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్‌లో ‘అమృత్‌ ఉద్యాన్‌’ను ప్రారంభించారు. ఇక్కడి అందాలను వీక్షించేందుకు ఈ నెల 31 నుంచి మార్చి 26 వరకు సందర్శకులకు అనుమతినిచ్చారు. గతంలో ఉన్న ‘మొగల్‌ గార్డెన్స్‌’ పేరును ‘అమృత్‌ ఉద్యాన్‌’గా మార్చిన సంగతి తెలిసిందే.
20/26
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టులో జడల రామలింగేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి వేడుకను వీక్షించారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టులో జడల రామలింగేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి వేడుకను వీక్షించారు.
21/26
రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్ర నేడు శ్రీనగర్‌లో ముగిసింది. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ అక్కడి లాల్‌చౌక్‌ వద్ద భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్ర నేడు శ్రీనగర్‌లో ముగిసింది. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ అక్కడి లాల్‌చౌక్‌ వద్ద భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు.
22/26
గణతంత్ర దినోత్సవం సందర్భంగా వరల్డ్‌ సైక్లింగ్‌ అలయన్స్‌, హైదరాబాద్‌ సైక్లింగ్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సైక్లథాన్‌’ పేరుతో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 20 కిలోమీటర్ల సైక్లథాన్‌ నిర్వహించారు. కార్యక్రమంలో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వరల్డ్‌ సైక్లింగ్‌ అలయన్స్‌, హైదరాబాద్‌ సైక్లింగ్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సైక్లథాన్‌’ పేరుతో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 20 కిలోమీటర్ల సైక్లథాన్‌ నిర్వహించారు. కార్యక్రమంలో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
23/26
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో సిక్కుల పవిత్ర స్థలం గురుద్వారాను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే జోగు రామన్న తదితరులు దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వీరికి గురుద్వారా ప్రబంధక కమిటీ స్వాగతం పలికి శాలువాలతో సత్కరించింది. భారాస సభ నిర్వహిచడం కోసం వీరంతా నాందేడ్‌ వెళ్లిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో సిక్కుల పవిత్ర స్థలం గురుద్వారాను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే జోగు రామన్న తదితరులు దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వీరికి గురుద్వారా ప్రబంధక కమిటీ స్వాగతం పలికి శాలువాలతో సత్కరించింది. భారాస సభ నిర్వహిచడం కోసం వీరంతా నాందేడ్‌ వెళ్లిన విషయం తెలిసిందే.
24/26
25/26
హైదరాబాద్‌ హయత్‌నగర్‌లోని ఓ పరీక్షా కేంద్రానికి జేఈఈ మెయిన్స్ పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సందడి నెలకొంది. హైదరాబాద్‌ హయత్‌నగర్‌లోని ఓ పరీక్షా కేంద్రానికి జేఈఈ మెయిన్స్ పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సందడి నెలకొంది.
26/26
నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను చూసేందుకు సినీనటులు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ తమ కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకున్నారు. అక్కడ తారకరత్న తండ్రి నందమూరి మోహనకృష్ణ, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను చూసేందుకు సినీనటులు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ తమ కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకున్నారు. అక్కడ తారకరత్న తండ్రి నందమూరి మోహనకృష్ణ, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

మరిన్ని