News in Pics: చిత్రం చెప్పే సంగతులు-01(30-01-2023)

Updated : 30 Jan 2023 15:18 IST
1/25
బెంగళూరు - మైసూర్‌ల జాతీయ రహదారి 275కి సంబంధించిన ఫొటోలను కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ట్విటర్‌ వేదికగా పోస్టు చేశారు. చుట్టూ పచ్చదనం అలుముకుని మధ్యలో ఉన్న ఈ రహదారి నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. బెంగళూరు - మైసూర్‌ల జాతీయ రహదారి 275కి సంబంధించిన ఫొటోలను కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ట్విటర్‌ వేదికగా పోస్టు చేశారు. చుట్టూ పచ్చదనం అలుముకుని మధ్యలో ఉన్న ఈ రహదారి నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
2/25
ఖమ్మం నుంచి ఇల్లెందు వెళ్లే ప్రధాన రహదారి వెంట డివైడర్లపై పచ్చని చెట్లు, రంగురంగుల కాగితాల పూలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. వీటికి తోడు సెంట్రల్‌ లైటింగ్‌ పోల్స్‌ వాహనదారులకు ఆహ్లాదం పంచుతున్నాయి. ఖమ్మం నుంచి ఇల్లెందు వెళ్లే ప్రధాన రహదారి వెంట డివైడర్లపై పచ్చని చెట్లు, రంగురంగుల కాగితాల పూలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. వీటికి తోడు సెంట్రల్‌ లైటింగ్‌ పోల్స్‌ వాహనదారులకు ఆహ్లాదం పంచుతున్నాయి.
3/25
దంతాలపల్లి మండలం రేపోణిలోని పెద్ద చెరువులో జాలర్లకు భారీ చేప చిక్కింది. బొచ్చె రకానికి చెందిన ఈ చేప 11 కిలోల బరువు ఉంది. అతికష్టం మీద బయటకు తీసుకొచ్చారు. చిన్నారులు ఈ చేపతో ఆసక్తిగా ఫొటోలు దిగారు. గ్రామానికి చెందిన ఓ యువకుడు దీనిని రూ. వెయ్యి వెచ్చించి కొనుగోలు చేశారు. దంతాలపల్లి మండలం రేపోణిలోని పెద్ద చెరువులో జాలర్లకు భారీ చేప చిక్కింది. బొచ్చె రకానికి చెందిన ఈ చేప 11 కిలోల బరువు ఉంది. అతికష్టం మీద బయటకు తీసుకొచ్చారు. చిన్నారులు ఈ చేపతో ఆసక్తిగా ఫొటోలు దిగారు. గ్రామానికి చెందిన ఓ యువకుడు దీనిని రూ. వెయ్యి వెచ్చించి కొనుగోలు చేశారు.
4/25
ఈ చింత చెట్టు చూశారా.. చుట్టూ పచ్చగా ఉండి మధ్యలో ఎండిపోయి ఎరుపు రంగులో కనిపిస్తోంది కదూ.. ఈ దృశ్యం చూపరులను విశేషంగా ఆకర్షిస్తోంది. మహబూబాబాద్‌ పట్టణ పరిధిలోని 1వ వార్డు ఈదులపూసపల్లిలో ఈ చిత్రం తారసపడింది. అటువైపు వెళ్లేవారు తమ చరవాణిలో ఈ దృశ్యాన్ని బంధిస్తున్నారు. ఈ చింత చెట్టు చూశారా.. చుట్టూ పచ్చగా ఉండి మధ్యలో ఎండిపోయి ఎరుపు రంగులో కనిపిస్తోంది కదూ.. ఈ దృశ్యం చూపరులను విశేషంగా ఆకర్షిస్తోంది. మహబూబాబాద్‌ పట్టణ పరిధిలోని 1వ వార్డు ఈదులపూసపల్లిలో ఈ చిత్రం తారసపడింది. అటువైపు వెళ్లేవారు తమ చరవాణిలో ఈ దృశ్యాన్ని బంధిస్తున్నారు.
5/25
ఇనార్బిట్‌ - దుర్గం చెరువు రన్‌ (ఐడీసీఆర్‌)2023 ఆదివారం ఉత్సాహంగా సాగింది. దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధికి నిధులు సమీకరించే ఉద్దేశంతో నిర్వహించిన పరుగు ఇనార్బిట్‌ మాల్‌ వద్ద ప్రారంభమై మైండ్ స్పేస్‌లో పూర్తయింది. ఇనార్బిట్‌ - దుర్గం చెరువు రన్‌ (ఐడీసీఆర్‌)2023 ఆదివారం ఉత్సాహంగా సాగింది. దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధికి నిధులు సమీకరించే ఉద్దేశంతో నిర్వహించిన పరుగు ఇనార్బిట్‌ మాల్‌ వద్ద ప్రారంభమై మైండ్ స్పేస్‌లో పూర్తయింది.
6/25
జన్నారం గ్రామానికి చెందిన పులబాల నరసింహారావు మిరప పండిస్తున్నారు. దీనికి సోకే తామర పురుగు నివారించేందుకు ఓ వినూత్న ఆలోచన చేశారు. మిరప తోటలో అక్కడక్కడా జనుము మొక్కలు నాటారు. ఈ మొక్కలకు మందులు ఎక్కువగా పిచికారీ చేస్తే కొంత ఊరట కలుగుతుందని రైతు అంటున్నారు. ఏన్కూరి- పల్లిపాడు రహదారి వెంట ఈ దృశ్యాన్ని ‘న్యూస్‌టుడ్‌’ క్లిక్‌మనిపించింది. జన్నారం గ్రామానికి చెందిన పులబాల నరసింహారావు మిరప పండిస్తున్నారు. దీనికి సోకే తామర పురుగు నివారించేందుకు ఓ వినూత్న ఆలోచన చేశారు. మిరప తోటలో అక్కడక్కడా జనుము మొక్కలు నాటారు. ఈ మొక్కలకు మందులు ఎక్కువగా పిచికారీ చేస్తే కొంత ఊరట కలుగుతుందని రైతు అంటున్నారు. ఏన్కూరి- పల్లిపాడు రహదారి వెంట ఈ దృశ్యాన్ని ‘న్యూస్‌టుడ్‌’ క్లిక్‌మనిపించింది.
7/25
 ఈ చిత్రం చూడగానే కొల్లేరు పక్షులను గుర్తుకు తెచ్చేలా ఉంది కదూ..  అమరావతి,గన్నవరం వద్ద  ఓ వరి పొలంలో పురుగుల కోసం ఇలా పక్షులు ఎగబడుతుండగా ‘ఈనాడు’ కెమెరాకు చిక్కిన దృశ్యం.

8/25
  విజయనగరం, నెల్లిమర్ల మండలంలోని మల్యాడ తిరుమలగెడ్డ వద్ద పచ్చని తివాచీ పరిచినట్లు ఆకట్టుకుంటోంది. రణస్థలం మార్గంలో చూపరులకు కనువిందు చేస్తోంది. పచ్చని మైదానంలా కన్పిస్తున్నది చెరువే. గుర్రపుడెక్క, నాచు పేరుకుపోయి ఇలా గోచరిస్తోంది.

9/25
ఆదివారం నాడు విశాఖపట్నం ఆర్‌కే బీచ్‌ తీరంలో అలల నడుమ సరదాగా సేద తీరుతున్న నగరవాసులు.

10/25
 నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ కల్యాణ మండపం దిగువ భాగాన తాత్కాలికంగా వేసిన మండపంలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య ఈ వివాహ ఘట్టం ఆవిష్కృతమైంది.

11/25
 ఒకటి కాదు రెండు కాదు.. ఐదు తరాల అపూర్వ కలయిక దృశ్యం కాజీపేట మండలం రాంపూర్‌ తంగళ్లపల్లి హర్షవర్దన్‌ రిసార్ట్‌లో ఆదివారం చోటు చేసుకుంది. రాంపూర్‌కు చెందిన చందా కిష్టయ్య, సుందరవ్వ దంపతులకు ఒక కొడుకు, ఎనిమిది మంది ఆడపిల్లలు.. మొత్తం తొమ్మిది మంది సంతానం

12/25
 ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైన గచ్చిబౌలి-శిల్పాలేఅవుట్‌ పైవంతెనలకు ఇరువైపులా విద్యుద్దీపాలను   అమర్చారు. దాదాపు కిలోమీటర్‌ మేర డెకరేటివ్‌ ఇల్యుమినేషన్‌ దీపాలను ఏర్పాటు చేయడంతో   ఆ దారి కొత్త శోభను సంతరించుకొంది.  

13/25
   పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల విశేషాల గురించి వివరించే  ‘మ్యూజియం ఆన్‌ వీల్స్‌’ వాహనమిది.  మరమ్మతులకు నోచుకోక మూలన పడేయడంతో విశ్రాంతి గదిగా మారింది. 

14/25
 ఈ చిత్రంలో కనిపిస్తున్నది పొగమంచో, దోమల కోసం వదిలిన పొగో కాదు.  హైదరాబాద్, రాణిగంజ్‌ రోడ్డులో ఓ ఆటో నుంచి వెలువడుతున్న కాలుష్యం.  రోడ్డుపై పూర్తిగా కమ్ముకొని వాహనదారులను ఉక్కిరిబిక్కిరి చేసింది.

15/25
సికింద్రాబాద్‌ మినిస్టర్‌ రోడ్డులో ఇటీవల అగ్నికి ఆహుతైన దక్కన్‌ మాల్‌ కూల్చివేత పనులు చేపట్టేందుకు తీసుకొచ్చిన   భారీ యంత్రం ఇది. ఎంతటి బలమైన వస్తువునైనా తన కొండీలతో పట్టి లాగే శక్తి ఉన్న దీన్ని చూడగానే బాహుబలి   యంత్రం అనక మానరు.  

16/25
  హైదరాబాద్, ట్యాంక్‌బండ్‌ వద్ద మరో ఆకర్షణ సిద్ధమవుతోంది. 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటు పనులు సగం పూర్తయ్యాయి. ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ప్రారంభించేందుకు పనులు జరుగుతున్నాయి. ట్యాంక్‌బండ్‌ పైనుంచి చూస్తే బుద్ధుడు, అంబేడ్కరుడు పక్కపక్కనే ఉన్నట్టు కనిపించిందిలా.. 

17/25
  హైదరాబాద్,  మల్కాజిగిరి తూర్పు ఆనంద్‌బాగ్‌ డివిజన్‌ ప్రశాంత్‌ నగర్‌లోని ఖాళీ స్థలంలో  పెరుగుతున్న మొక్కలు ఇవీ. దాదాపు ఏడాది కిందట గ్రేటర్‌ ఉద్యాన శాఖ విభాగం ఆధ్వర్యంలో నాటారు. సరైన నీటి సదుపాయం   లేకపోవడంతో గిడసబారాయి. ఇప్పటికైనా నీటి సదుపాయం  కల్పించాలని స్థానికులు కోరుతున్నారు., 

18/25
 హైదరాబాద్‌లో ఆదివారం యువత సందడి చేసింది. ఇనార్బిట్‌ మాల్‌ నుంచి మైండ్‌ స్పేస్‌ వరకు సాగిన 21, 10, 5 కి.మీ. పరుగుతోపాటు ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా నిర్వహించిన సైక్లోథాన్‌లో చిన్నారులతో కలిసి పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు. హైదరాబాద్‌లో ఆదివారం యువత సందడి చేసింది. ఇనార్బిట్‌ మాల్‌ నుంచి మైండ్‌ స్పేస్‌ వరకు సాగిన 21, 10, 5 కి.మీ. పరుగుతోపాటు ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా నిర్వహించిన సైక్లోథాన్‌లో చిన్నారులతో కలిసి పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు.
19/25
 వందేభారత్‌ రైలు వస్తున్న సమయంలో విజయవాడ వాంబేకాలనీ సమీపంలో రైల్వేట్రాక్‌ దాటకుండా ప్రజలను నిలువరిస్తున్న రైల్వే పోలీసులు  మిగిలిన సమయాల్లో రైలు వస్తున్నా ప్రమాదకరంగా పట్టాలు దాటుతున్న స్థానికులు వందేభారత్‌ రైలు వస్తున్న సమయంలో విజయవాడ వాంబేకాలనీ సమీపంలో రైల్వేట్రాక్‌ దాటకుండా ప్రజలను నిలువరిస్తున్న రైల్వే పోలీసులు మిగిలిన సమయాల్లో రైలు వస్తున్నా ప్రమాదకరంగా పట్టాలు దాటుతున్న స్థానికులు
20/25
 బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళి వద్ద పొలాలకు విద్యుత్తు సౌకర్యం కోసం కిలోమీటరు మేర తాటి దుంగలతో విద్యుత్తు లైన్‌ను రైతులే సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు. 

21/25
 ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో విశాఖపట్నం రుషికొండ మీద రీడెవలప్‌మెంట్‌ హిల్‌ రిసార్టు పనులు వేగంగా సాగుతున్నాయి.

22/25
  అందాలతో కనువిందు చేసే బంగారు పసుపు వర్ణం పక్షి ఆకుపచ్చ రంగులో ఉన్న ఓ గడ్డి పురుగుని ముక్కుతో నోట కరుచుకోగా రంగురంగుల ఈ అద్భుత దృశ్యాన్ని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ తన కెమెరాలో క్లిక్‌ మనిపించారు. హైదరాబాద్‌లో తీసిన ఆ ఫొటోల్ని ఎంపీ ఆదివారం ట్వీట్‌ చేశారు.

23/25
సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాల పొలాల్లో రాష్ట్రంలోకెల్లా అతిపెద్ద ద్వారపాలక శిల్పం ఆలనాపాలనా కరవైందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో ఈమని శివనాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శిల్పకళ, లక్షణాల్ని బట్టి ఇది కళ్యాణి చాళుక్యుల తొలి కాలమైన క్రీ.శ.10వ శతాబ్దికి చెందిందని ఆయన పేర్కొన్నారు.

24/25
 రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని గుండాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు బడి ఆవరణలో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు.

25/25
 భారత గణతంత్ర దిన ముగింపు వేడుకలు దిల్లీలోని విజయ్‌చౌక్‌ వద్ద ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగాయి. స్వల్పంగా వర్షం కురుస్తున్నా కార్యక్రమ స్ఫూర్తి ఎక్కడా తగ్గకుండా సైనిక, పారామిలిటరీ దళాలు నిర్వహించిన బీటింగ్‌ రిట్రీట్‌ అలరించింది.

మరిన్ని