News in Pics: చిత్రం చెప్పే సంగతులు-02(30-01-2023)

Updated : 30 Jan 2023 22:31 IST
1/25
ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్‌, అనసూయ ప్రధాన పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రంగమార్తాండ’. ఈ సినిమాలోని స్టిల్స్‌ను చిత్రబృందం సోమవారం ట్విటర్‌ వేదికగా పంచుకుంది. ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్‌, అనసూయ ప్రధాన పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రంగమార్తాండ’. ఈ సినిమాలోని స్టిల్స్‌ను చిత్రబృందం సోమవారం ట్విటర్‌ వేదికగా పంచుకుంది.
2/25
షారుఖ్‌ ఖాన్‌, జాన్‌ అబ్రహం, దీపికా పదుకొణే ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘పఠాన్‌’. ఈ సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా ముంబయిలో ఫ్యాన్స్‌ మీట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షారుఖ్‌ మాట్లాడుతూ.. దీపికాను అమర్‌, తనను అక్బర్‌, జాన్‌ అబ్రహంను ఆంథోని పాత్రలతో పోల్చి చెప్పారు. బాలీవుడ్‌లో ‘అమర్‌ అక్బర్‌ ఆంథోని’ సినిమా 1977లో విడుదలై ఘనవిజయం సాధించింది. షారుఖ్‌ ఖాన్‌, జాన్‌ అబ్రహం, దీపికా పదుకొణే ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘పఠాన్‌’. ఈ సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా ముంబయిలో ఫ్యాన్స్‌ మీట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షారుఖ్‌ మాట్లాడుతూ.. దీపికాను అమర్‌, తనను అక్బర్‌, జాన్‌ అబ్రహంను ఆంథోని పాత్రలతో పోల్చి చెప్పారు. బాలీవుడ్‌లో ‘అమర్‌ అక్బర్‌ ఆంథోని’ సినిమా 1977లో విడుదలై ఘనవిజయం సాధించింది.
3/25
4/25
కరీంనగర్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా యువతులు చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. కరీంనగర్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా యువతులు చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.
5/25
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ‘ఫుట్ సోల్జర్స్‌ ఆఫ్ ఇండియన్ ఫ్రీడం’ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గాయకుడు రామ్‌ మిరియాల తన పాటలతో అలరించారు. విద్యార్థులు సందడి చేశారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ‘ఫుట్ సోల్జర్స్‌ ఆఫ్ ఇండియన్ ఫ్రీడం’ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గాయకుడు రామ్‌ మిరియాల తన పాటలతో అలరించారు. విద్యార్థులు సందడి చేశారు.
6/25
సదస్సులో రామ్‌ మిరియాల సదస్సులో రామ్‌ మిరియాల
7/25
కొంపల్లిలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ప్రముఖ మోటివేషనల్‌ స్పీకర్‌ నిక్‌ వుజిసిక్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి ఆయన్ను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కొంపల్లిలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ప్రముఖ మోటివేషనల్‌ స్పీకర్‌ నిక్‌ వుజిసిక్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి ఆయన్ను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
8/25
రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన కుమ్మరి దేవయ్య దళితబంధు పథకంలో భాగంగా ఏర్పాటు చేసుకున్న హోటల్‌ను మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. వారితో ముచ్చటించి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన కుమ్మరి దేవయ్య దళితబంధు పథకంలో భాగంగా ఏర్పాటు చేసుకున్న హోటల్‌ను మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. వారితో ముచ్చటించి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.
9/25
భారత్‌జోడో యాత్ర ముగింపు వేడుకల సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు కశ్మీర్‌లో భారీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత్‌జోడో యాత్ర ముగింపు వేడుకల సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు కశ్మీర్‌లో భారీ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
10/25
జాతీయ జెండాకు వందనం చేస్తున్న మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు జాతీయ జెండాకు వందనం చేస్తున్న మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు
11/25
అనిక సురేంద్రన్‌, అర్జున్‌ దాస్‌, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో శౌరి చంద్రశేఖర్‌ టీ రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బుట్టబొమ్మ’. ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను ఫిబ్రవరి 2న సాయంత్రం 6గంటలకు   హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌లో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు హీరో సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఫిబ్రవరి 4న ‘బుట్టబొమ్మ’ విడుదల కానుంది.. అనిక సురేంద్రన్‌, అర్జున్‌ దాస్‌, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో శౌరి చంద్రశేఖర్‌ టీ రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బుట్టబొమ్మ’. ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను ఫిబ్రవరి 2న సాయంత్రం 6గంటలకు హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌లో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు హీరో సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఫిబ్రవరి 4న ‘బుట్టబొమ్మ’ విడుదల కానుంది..
12/25
కశ్మీర్‌లో నేడు భారత్‌జోడో యాత్ర ముగింపు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ ఒకరికొకరు శాలువాలు కప్పి సత్కరించుకున్నారు. కశ్మీర్‌లో నేడు భారత్‌జోడో యాత్ర ముగింపు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ ఒకరికొకరు శాలువాలు కప్పి సత్కరించుకున్నారు.
13/25
టీ-హబ్ సహకారంతో పెట్‌ ఫోక్ సంస్థ ‘పెట్‌ ఫోక్‌ గ్రూమింగ్ వ్యాన్‌’ను ప్రారంభించింది. ఈ వాహనం హైదరాబాద్‌ నగరంలో తిరుగుతూ పిల్లులు, శునకాలు తదితర పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణకు కృషి చేయనుంది. గ్రూమింగ్‌ వ్యాన్‌ ప్రారంభోత్సవంలో పలువురు మోడల్స్‌ పాల్గొని పెంపుడు జంతువులతో ఫొటోలు దిగారు. టీ-హబ్ సహకారంతో పెట్‌ ఫోక్ సంస్థ ‘పెట్‌ ఫోక్‌ గ్రూమింగ్ వ్యాన్‌’ను ప్రారంభించింది. ఈ వాహనం హైదరాబాద్‌ నగరంలో తిరుగుతూ పిల్లులు, శునకాలు తదితర పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణకు కృషి చేయనుంది. గ్రూమింగ్‌ వ్యాన్‌ ప్రారంభోత్సవంలో పలువురు మోడల్స్‌ పాల్గొని పెంపుడు జంతువులతో ఫొటోలు దిగారు.
14/25
15/25
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌  చేపట్టిన ‘యువగళం’  పాదయాత్ర నాలుగో రోజు సోమవారం వి.కోటలో కొనసాగింది. ఈ సందర్భంగా బందోబస్తు నిర్వహించిన కర్ణాటక పోలీసులు లోకేశ్‌తో సెల్ఫీలు, ఫొటోలు తీసుకొని సంబరపడ్డారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర నాలుగో రోజు సోమవారం వి.కోటలో కొనసాగింది. ఈ సందర్భంగా బందోబస్తు నిర్వహించిన కర్ణాటక పోలీసులు లోకేశ్‌తో సెల్ఫీలు, ఫొటోలు తీసుకొని సంబరపడ్డారు.
16/25
తిరుమల శ్రీవారిని ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ దర్శించుకున్నారు. ఈరోజు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుమారుడితో కలిసి స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. అంతకుముందు తితిదే అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేదపండితులు ఆమెకు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ దర్శించుకున్నారు. ఈరోజు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుమారుడితో కలిసి స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. అంతకుముందు తితిదే అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేదపండితులు ఆమెకు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
17/25
జనసేన కార్యకర్త బాలాజీ పల్నాడు ప్రాంతంలో పల్లెపల్లెకు తిరుగుతూ ప్రజాసమస్యలపై అర్జీలు స్వీకరించారు. ‘పల్నాడు ప్రజా సమస్యల పెట్టె’ పేరిట ఈ కార్యక్రమరం చేపట్టారు. ఈ ఆలోచనకు మెచ్చిన పవన్‌కల్యాణ్ అతనికి ప్రోత్సాహక నగదు, మొబైల్‌ ఫోన్‌ బహూకరించారు. జనసేన కార్యకర్త బాలాజీ పల్నాడు ప్రాంతంలో పల్లెపల్లెకు తిరుగుతూ ప్రజాసమస్యలపై అర్జీలు స్వీకరించారు. ‘పల్నాడు ప్రజా సమస్యల పెట్టె’ పేరిట ఈ కార్యక్రమరం చేపట్టారు. ఈ ఆలోచనకు మెచ్చిన పవన్‌కల్యాణ్ అతనికి ప్రోత్సాహక నగదు, మొబైల్‌ ఫోన్‌ బహూకరించారు.
18/25
సెర్బియా క్రీడాకారుడు, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ విజేత జకోవిచ్‌ తన ట్రోఫీతో ఆస్ట్రేలియాలోని ‘గవర్నమెంట్‌ హౌస్‌ గార్డెన్స్‌లో’ ఫొటోలకు పోజులిచ్చారు. సెర్బియా క్రీడాకారుడు, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ విజేత జకోవిచ్‌ తన ట్రోఫీతో ఆస్ట్రేలియాలోని ‘గవర్నమెంట్‌ హౌస్‌ గార్డెన్స్‌లో’ ఫొటోలకు పోజులిచ్చారు.
19/25
మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలోని రాజ్‌ఘాట్‌లో గాంధీ స్మారకం వద్ద నివాళి అర్పించారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలోని రాజ్‌ఘాట్‌లో గాంధీ స్మారకం వద్ద నివాళి అర్పించారు.
20/25
నిఖిల్ హీరోగా గ్యారీ బీహెచ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘స్పై’. ఈ సినిమాలో తన లుక్‌కు సంబంధించిన ఫొటోను నిఖిల్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. అఫీషియల్‌ లీక్‌ అని తెలుపుతూ పోస్టు పెట్టారు. వేసవిలో పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయనున్నట్లు చెప్పారు. నిఖిల్ హీరోగా గ్యారీ బీహెచ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘స్పై’. ఈ సినిమాలో తన లుక్‌కు సంబంధించిన ఫొటోను నిఖిల్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. అఫీషియల్‌ లీక్‌ అని తెలుపుతూ పోస్టు పెట్టారు. వేసవిలో పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయనున్నట్లు చెప్పారు.
21/25
మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బాపు ఘాట్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సీఎస్ శాంతికుమారి తదితరులు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్యం కోసం గాంధీ చేసిన త్యాగాలను వారు గుర్తు చేసుకున్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బాపు ఘాట్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సీఎస్ శాంతికుమారి తదితరులు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్యం కోసం గాంధీ చేసిన త్యాగాలను వారు గుర్తు చేసుకున్నారు.
22/25
వైఎస్‌ఆర్‌ జిల్లా పెద్దముడియం మండలంలోని జంగాలపల్లె గ్రామానికి చెందిన సుంకేసుల దస్తగిరి కొన్నేళ్లుగా నాటు కోళ్లను పెంచుతున్నారు. ఆదివారం ఓ కోడి ఉసిరికాయ పరిమాణంలో గుడ్డు పెట్టింది. సుమారు గంట సమయం తర్వాత అదే కోడి సాధారణ పరిమాణంలో మరో గుడ్డు పెట్టింది. వైఎస్‌ఆర్‌ జిల్లా పెద్దముడియం మండలంలోని జంగాలపల్లె గ్రామానికి చెందిన సుంకేసుల దస్తగిరి కొన్నేళ్లుగా నాటు కోళ్లను పెంచుతున్నారు. ఆదివారం ఓ కోడి ఉసిరికాయ పరిమాణంలో గుడ్డు పెట్టింది. సుమారు గంట సమయం తర్వాత అదే కోడి సాధారణ పరిమాణంలో మరో గుడ్డు పెట్టింది.
23/25
కరీంనగర్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి కల్యాణోత్సవం నిర్వహించారు. వేడుకకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మార్మోగింది. కరీంనగర్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి కల్యాణోత్సవం నిర్వహించారు. వేడుకకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మార్మోగింది.
24/25
నెల్లూరు జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి వినూత్నంగా బ్యాటరీ సైకిల్‌ మార్కెట్లోకి తెచ్చారు. తైవాన్‌ నుంచి వస్తువులు తెప్పించి మరీ ఈ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 50 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తూ.. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తోంది. నెల్లూరు జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి వినూత్నంగా బ్యాటరీ సైకిల్‌ మార్కెట్లోకి తెచ్చారు. తైవాన్‌ నుంచి వస్తువులు తెప్పించి మరీ ఈ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 50 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తూ.. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తోంది.
25/25
పవన్‌కల్యాణ్‌-సుజిత్‌ కాంబోలో తెరకెక్కనున్న కొత్త సినిమా పూజా కార్యక్రమం నేడు హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితం కానుంది. పూజా కార్యక్రమంలో అల్లు అరవింద్‌, దగ్గుబాటి సురేశ్‌బాబు, దిల్‌రాజు పాల్గొన్నారు. ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ ఓజీ(ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌) పాత్రలో కనిపించనున్నారని ప్రచారం సాగుతోంది. పవన్‌కల్యాణ్‌-సుజిత్‌ కాంబోలో తెరకెక్కనున్న కొత్త సినిమా పూజా కార్యక్రమం నేడు హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితం కానుంది. పూజా కార్యక్రమంలో అల్లు అరవింద్‌, దగ్గుబాటి సురేశ్‌బాబు, దిల్‌రాజు పాల్గొన్నారు. ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ ఓజీ(ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌) పాత్రలో కనిపించనున్నారని ప్రచారం సాగుతోంది.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు