చిత్రం చెప్పే సంగతులు-02(31-01-2023)

Updated : 31 Jan 2023 22:03 IST
1/15
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలోని పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవం  ఘనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలోని పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవం ఘనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
2/15
సన్నాయి వాయిద్యాలతో వస్తున్న అర్చకులు సన్నాయి వాయిద్యాలతో వస్తున్న అర్చకులు
3/15
గుంటూరులోని బీఆర్‌ స్టేడియంలో మోటివేషన్ ఈవెంట్‌ నిర్వహించారు. ప్రఖ్యాత ప్రేరణ వక్త నిక్‌వుజిసిక్‌ పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు ఎంపీ నందిగం సురేశ్‌, విద్యార్థులు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. గుంటూరులోని బీఆర్‌ స్టేడియంలో మోటివేషన్ ఈవెంట్‌ నిర్వహించారు. ప్రఖ్యాత ప్రేరణ వక్త నిక్‌వుజిసిక్‌ పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు ఎంపీ నందిగం సురేశ్‌, విద్యార్థులు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.
4/15
పెద్దఎత్తున పాల్గొన్న విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్న విద్యార్థులు
5/15
కల్యాణ్‌రామ్‌, ఆషిక రంగనాథ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఎమిగోస్‌’. రాజేంద్రరెడ్డి దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన ‘ఎన్నోరాత్రులొస్తాయి’ వీడియో సాంగ్‌ను ఈ రోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్‌ ఆషిక రంగనాథ్, దర్శకుడు రాజేంద్రరెడ్డి ‘రెడ్ ఎఫ్‌ఎంఇండియా’లో శ్రోతలతో మాట్లాడి సందడి చేశారు. కల్యాణ్‌రామ్‌, ఆషిక రంగనాథ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఎమిగోస్‌’. రాజేంద్రరెడ్డి దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన ‘ఎన్నోరాత్రులొస్తాయి’ వీడియో సాంగ్‌ను ఈ రోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్‌ ఆషిక రంగనాథ్, దర్శకుడు రాజేంద్రరెడ్డి ‘రెడ్ ఎఫ్‌ఎంఇండియా’లో శ్రోతలతో మాట్లాడి సందడి చేశారు.
6/15
శ్రోతలతో ముచ్చటిస్తున్న ఆషిక రంగనాథ్‌ శ్రోతలతో ముచ్చటిస్తున్న ఆషిక రంగనాథ్‌
7/15
సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లిలోని శ్రీ లింగమంతుల స్వామి జాతర ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. కళాకారులు పాటలు పాడుతూ.. నృత్యాలు చేయడం ఆకట్టుకుంటోంది. సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లిలోని శ్రీ లింగమంతుల స్వామి జాతర ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. కళాకారులు పాటలు పాడుతూ.. నృత్యాలు చేయడం ఆకట్టుకుంటోంది.
8/15
జాతర కోసం ఏర్పాటు చేసిన రంగుల రాట్నం జాతర కోసం ఏర్పాటు చేసిన రంగుల రాట్నం
9/15
ఆదిలాబాద్‌ జిల్లాలోని గుడిహత్నూర్‌ జాతీయ రహదారి మీదుగా ప్రయాణించే వారిని ఈ రెండు చెట్లు ఆకట్టుకుంటున్నాయి. ఒకటి ఆకుపచ్చ రంగులో, మరొకటి పసుపు రంగులో పక్కపక్కనే ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇందులో పచ్చ రంగులో కుంకుడి చెట్టు ఉండగా.. మరొకటి ఫైకాస్‌(అందం కోసం పెంచే చెట్టు) కొత్త చిగురు రావడంతో ఇలా పసుపు రంగులో మెరుస్తోంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని గుడిహత్నూర్‌ జాతీయ రహదారి మీదుగా ప్రయాణించే వారిని ఈ రెండు చెట్లు ఆకట్టుకుంటున్నాయి. ఒకటి ఆకుపచ్చ రంగులో, మరొకటి పసుపు రంగులో పక్కపక్కనే ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇందులో పచ్చ రంగులో కుంకుడి చెట్టు ఉండగా.. మరొకటి ఫైకాస్‌(అందం కోసం పెంచే చెట్టు) కొత్త చిగురు రావడంతో ఇలా పసుపు రంగులో మెరుస్తోంది.
10/15
మంత్రి కేటీఆర్‌ హనుమకొండ జిల్లాలోని కమలాపూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి పాఠశాలలో విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. అంతకుముందు పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మంత్రి కేటీఆర్‌ హనుమకొండ జిల్లాలోని కమలాపూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి పాఠశాలలో విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. అంతకుముందు పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
11/15
12/15
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం రిషీకేశ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఓ ఫొటోను ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌కు ముందు విరాట్‌ విరామం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం రిషీకేశ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఓ ఫొటోను ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌కు ముందు విరాట్‌ విరామం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
13/15
విశాఖపట్నంలో ఏయూ సౌత్‌జోన్‌ వీసీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విశాఖపట్నంలో ఏయూ సౌత్‌జోన్‌ వీసీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
14/15
15/15
హీరో నాని, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి శౌర్యవ్‌ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని క్లాప్‌ కొట్టారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. హీరో నాని, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి శౌర్యవ్‌ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని క్లాప్‌ కొట్టారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు