News in Pics: చిత్రం చెప్పే సంగతులు-01(02-02-2023)

Updated : 02 Feb 2023 11:06 IST
1/17
విజయవాడ బెంజిసర్కిల్‌ పై వంతెన కోసం గతంలో జాతీయ రహదారిలో ఉన్న చెట్లను తొలగించిన అధికారులు.. ఇప్పుడు పైవంతెన పిల్లర్ల కింద పచ్చదనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బెంజిసర్కిల్ నుంచి రమేష్ ఆసుపత్రి కూడలి వరకు పిల్లర్ల చుట్టూ పచ్చని చెట్లతో అలంకరిస్తున్నారు. విజయవాడ బెంజిసర్కిల్‌ పై వంతెన కోసం గతంలో జాతీయ రహదారిలో ఉన్న చెట్లను తొలగించిన అధికారులు.. ఇప్పుడు పైవంతెన పిల్లర్ల కింద పచ్చదనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బెంజిసర్కిల్ నుంచి రమేష్ ఆసుపత్రి కూడలి వరకు పిల్లర్ల చుట్టూ పచ్చని చెట్లతో అలంకరిస్తున్నారు.
2/17
వికారాబాద్‌- వెంకటాపూర్‌ తండాలో వెలసిన జగదాంబ భవానీ మాత, జగద్గురు సేవాలాల్‌ మహారాజ్‌ ఆలయ 16వ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయ. వికారాబాద్‌- వెంకటాపూర్‌ తండాలో వెలసిన జగదాంబ భవానీ మాత, జగద్గురు సేవాలాల్‌ మహారాజ్‌ ఆలయ 16వ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయ.
3/17
సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలంలో రైతులు ఎక్కువగా పొద్దుతిరుగుడు పంటపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎటూ చూసినా కళకళలాడుతున్న పొద్దుతిరుగుడు పైర్లు దర్శనమిస్తున్నాయి. ఇదంతా చూపరుల మనస్సుకు హాయినిస్తుంది. సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలంలో రైతులు ఎక్కువగా పొద్దుతిరుగుడు పంటపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎటూ చూసినా కళకళలాడుతున్న పొద్దుతిరుగుడు పైర్లు దర్శనమిస్తున్నాయి. ఇదంతా చూపరుల మనస్సుకు హాయినిస్తుంది.
4/17
కంచె వేసేందుకు ఉపయోగించే రాతి కడీ మీద ఓ శిల్పకారుడు తన కళను ప్రదర్శించాడు. ఊసరవెల్లి బొమ్మను అందంగా మలిచి రంగు వేశాడు. హైదరాబాద్‌ కొత్తగూడలోని పాలపిట్ట సైక్లింగ్ పార్కులో ఈ కళాకృతి సహజత్వం ఉట్టిపడుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. కంచె వేసేందుకు ఉపయోగించే రాతి కడీ మీద ఓ శిల్పకారుడు తన కళను ప్రదర్శించాడు. ఊసరవెల్లి బొమ్మను అందంగా మలిచి రంగు వేశాడు. హైదరాబాద్‌ కొత్తగూడలోని పాలపిట్ట సైక్లింగ్ పార్కులో ఈ కళాకృతి సహజత్వం ఉట్టిపడుతూ అందరినీ ఆకట్టుకుంటోంది.
5/17
హనుమకొండ జిల్లాలోని నక్కలగుట్ట హరిత కాకతీయ హోటల్‌ పక్కన నగర పాలక సంస్థ ఆధునిక హంగులతో బస్‌ షెల్టర్‌ ఏర్పాటు చేసింది. దీని ఎదుట కొంతమంది ప్రత్యేక వాహనం పెట్టి.. టిఫిన్ సెంటర్‌ నడిపిస్తున్నారు. దీంతో అక్కడ అదొక అల్పాహార కేంద్రంగా ఉంది హనుమకొండ జిల్లాలోని నక్కలగుట్ట హరిత కాకతీయ హోటల్‌ పక్కన నగర పాలక సంస్థ ఆధునిక హంగులతో బస్‌ షెల్టర్‌ ఏర్పాటు చేసింది. దీని ఎదుట కొంతమంది ప్రత్యేక వాహనం పెట్టి.. టిఫిన్ సెంటర్‌ నడిపిస్తున్నారు. దీంతో అక్కడ అదొక అల్పాహార కేంద్రంగా ఉంది
6/17
సరకు రవాణా చేసే వాహన చోదకులు నిబంధనలు పాటించకపోవడంతో ప్రమాదాలకు కారణమవుతున్నారు. జాతీయ రహదారిపై సోమవారం ఓ మినీ వ్యానుపై భారీ ఎత్తున మూటలు కట్టి ప్రమాదకరంగా రవాణా చేస్తుండగా ‘న్యూస్‌టుడే’ క్లిక్‌ మనిపించింది. మూటలకు కట్టిన తాడు తెగిపోయేలా ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సరకు రవాణా చేసే వాహన చోదకులు నిబంధనలు పాటించకపోవడంతో ప్రమాదాలకు కారణమవుతున్నారు. జాతీయ రహదారిపై సోమవారం ఓ మినీ వ్యానుపై భారీ ఎత్తున మూటలు కట్టి ప్రమాదకరంగా రవాణా చేస్తుండగా ‘న్యూస్‌టుడే’ క్లిక్‌ మనిపించింది. మూటలకు కట్టిన తాడు తెగిపోయేలా ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
7/17
150 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన పొదలకూరు చెరువు అంతా గుర్రపుడెక్కతో నిండిపోయింది. పొదలకూరు, నెల్లూరు జిల్లా, లింగంపల్లికి చెందిన సుమారు 200 మందికి పైగా రైతులు ఈ చెరువు కింద భూములు కలిగి ఉన్నారు. గత నాలుగేళ్లుగా చెరువు అభివృద్ధి పనులు చేయకపోవడంతో లోతట్టు ప్రాంతం ఇలా మారింది.  

8/17
రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాలల స్పోర్ట్స్, గేమ్స్‌ మీట్‌ విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో మూడురోజుల పాటు జరగనున్నాయి.. రాష్ట్రం నలుమూలల నుంచి వందలాది క్రీడాకారులు పోటీలకు వచ్చారు. వీరు ఉండటానికి సరైన ఏర్పాట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. 

9/17
  డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది క్షేత్ర స్థలిలో బుధవారం చూడముచ్చటగా ఆవిష్కృతమైంది . సముద్రతీరంలో భక్తుల పుణ్యస్నానాలుసముద్రతీరంలో  పుణ్యస్నానాలు చేస్తున్న భక్తుల

10/17
ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలం రామతీర్థంలోని రామాలయం  దేవస్థానానికి వెళ్లే దారి ఇలా జలమయమైంది. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉండడంతో... ఆలయానికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

11/17
భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని  అనకాపల్ల్కి జిల్లా, నర్సీపట్నం షిర్డీ సాయి ఆలయం ప్రాంతం బుధవారం రాత్రి దీపకాంతులతో శోభిల్లింది. గుడి పక్కనే ఉన్న స్టేడియం కనులు మిరిమిట్లుగొల్పే లక్ష దీపాల కాంతితో ధగధగలాడింది.  స్టేడియంలో శివుని ఆకృతిలో దీపాలు.

12/17
  విదేశాల్లో లభించే పండ్లు సైతం మన మన్యంలో పండుతున్నాయి.అల్లూరి సీతారామ రాజు జిల్లా , రాజవొమ్మంగి మండలం సింగంపల్లికి చెందిన రైతులు కొల్లి శ్రీనుబాబు, కోనా అప్పన్నబాబు ఇంటి వద్ద ఫ్యాషన్‌ ఫ్రూట్స్‌ (పాసిఫ్లోరా ఎడులిస్‌ జాతి) సాగు చేపట్టారు. స్నేహితుల ద్వారా సేకరించిన ఈ తీగ జాతికి చెందిన మొక్కలను రెండేళ్ల కితం నాటారు. పెరిగి పెద్దదై పండ్లు కాస్తున్నాయి.

13/17
   డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో లక్ష్మీ నారసింహస్వామి కల్యాణోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. బుధవారం రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది

14/17
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వనదేవతల మండమెలిగె పండగ (చిన్న జాతర) బుధవారం ఘనంగా ఆరంభమైంది. ఉదయాన్నే మేడారంలోని సమ్మక్క పూజా మందిరాన్ని, కన్నెపల్లిలోని సారలమ్మ గుడిని పూజారులు శుద్ధి చేశారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 

15/17
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో ఈ నెల 2 నుంచి 14 వరకు సమతా కుంభ్‌-2023 బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసినట్లు జీవా ప్రతినిధులు బుధవారం పేర్కొన్నారు.

16/17
 అయోధ్య రామాలయంలో సీతారాముల విగ్రహాలను రూపొందించేందుకు వినియోగించనున్న సాలగ్రామ శిలను నేపాల్‌లోని జనక్‌పుర్‌ నుంచి బుధవారం రాత్రి తీసుకొచ్చారు

17/17
 నిశీధిలో మరకతంలా పచ్చగా వెలుగుతున్న ఈ తోకచుక్క పేరు సి/2022 ఈ3 (జీటీఎఫ్‌).చివరగా 50 వేల సంవత్సరాల క్రితం  భూమికి దగ్గరగా వచ్చింది. మళ్లీ బుధవారం స్పెయిన్‌లోని గ్రాన్‌ కనేరియా దీవి నుంచి ఇలా దగ్గరగా దర్శనమిచ్చింది.

మరిన్ని