News in Pics: చిత్రం చెప్పే సంగతులు-01(03-02-2023)

Updated : 03 Feb 2023 12:15 IST
1/20
తమ కోరికలు నెరవేర్చాలని భక్తులు వేడుకునే విధానంలో ఒక్కోచోట ఒక్కో ఆచారం ఉంటుంది. నిజామాబాద్‌ జిల్లా పెద్దగుట్ట(బడాపహాడ్‌) దర్గాలో ఇంకాస్త భిన్నంగా తమ కోరికలను మనసులో అనుకుని గుర్రం ప్రతిమ వద్ద గొలుసుకు తాళం వేసి పేపరుపై కోరిక రాసి తాడుతో కడతారు. కోరుకున్నవి నెరవేరాక మళ్లీ వచ్చి తాళం తీస్తారు. ఏటా జరిగే ఈ ఉర్సు ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ర్ట నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి ఇలా మొక్కుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. తమ కోరికలు నెరవేర్చాలని భక్తులు వేడుకునే విధానంలో ఒక్కోచోట ఒక్కో ఆచారం ఉంటుంది. నిజామాబాద్‌ జిల్లా పెద్దగుట్ట(బడాపహాడ్‌) దర్గాలో ఇంకాస్త భిన్నంగా తమ కోరికలను మనసులో అనుకుని గుర్రం ప్రతిమ వద్ద గొలుసుకు తాళం వేసి పేపరుపై కోరిక రాసి తాడుతో కడతారు. కోరుకున్నవి నెరవేరాక మళ్లీ వచ్చి తాళం తీస్తారు. ఏటా జరిగే ఈ ఉర్సు ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ర్ట నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి ఇలా మొక్కుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
2/20
   భూసారాన్ని పెంచే కట్టె జనుము పసుపు పచ్చని పూలతో కనువిందు చేస్తోంది. ఏపుగా పెరిగిన తరువాత రాలిన ఆకులు దుక్కి దున్నినపుడు భూమిలో కలిసి.. వరిలో దిగుబడులు పెంచుతాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని అలజంగి, పిరిడి, జగన్నాథపురం, కోమటిపల్లి, పెంట, కొత్తపెంట, రంగరాయపురం గ్రామాల్లో ఎక్కువగా దీన్ని వేస్తున్నారు.   

3/20
  పార్వతీపురం పట్టణ బైపాస్‌ రోడ్డు మలుపు వద్ద దుర్గగుడి ఎదురుగా గురువారం త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ట్రాక్టరుపై దుంగలను తరలిస్తుండగా తాళ్లు తెగి.. రోడ్డుపై పడ్డాయి. వెనుక వస్తున్న వాహన చోదకులు, పాదచారులు అప్రమత్తమవడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. కొంత సమయం రాకపోకలు నిలిచాయి. 

4/20
అన్నదాత రూపంలో పొలం బాట పట్టిన వీరంతా విజయనగరం జిల్లాలోని రాజాం పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు. రైతులు అప్పలనాయుడు, సోములు వీరికి సాగు పాఠాలు బోధించారు. సస్యభారత్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన్నారు.

5/20
కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. నగరంలో అభివృద్ధి పనుల పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు.కల్లూరు పట్టణం 27వ వార్డు కృష్ణానగర్‌ పరిధిలో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లే దారిలో సీసీ రోడ్డు బాగున్నా.. దానిపై మళ్లీ నిర్మిస్తుండటం గమనార్హం. రూ.8 లక్షలతో రహదారి పనులు చేపట్టారు.

6/20
  ఈ చిత్రం చూశారా..ఖమ్మం జిల్లాలోని జన్నారం ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న ఓ ప్రైవేటు స్థలంలో మిరప కాయలు ఇలా పెద్ద మొత్తంలో ఆరబోశారు. పాఠశాలకు ప్రహరీ సౌకర్యం లేకపోవడంతో వాటి ఘాటు ప్రభావంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ చిత్రం చూశారా..ఖమ్మం జిల్లాలోని జన్నారం ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న ఓ ప్రైవేటు స్థలంలో మిరప కాయలు ఇలా పెద్ద మొత్తంలో ఆరబోశారు. పాఠశాలకు ప్రహరీ సౌకర్యం లేకపోవడంతో వాటి ఘాటు ప్రభావంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
7/20
      రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం, ముచ్చింతల్‌ శ్రీరామనగరంలో  సమతా కుంభ్‌ ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి.  యాగశాలలో వేడుకలకు చినజీయర్‌స్వామి అంకురార్పణ చేశారు.  రుత్వికులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలలో సేవలందించేందుకు వేల మంది వికాస తరంగిణి కార్యకర్తలు విచ్చేశారు.

8/20
  అండర్‌-19 మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌లో విజయం సాధించి గురువారం  స్వదేశానికి చేరుకున్న యువ ఛాంపియన్లు త్రిష, యశశ్రీలకు శంషాబాద్‌ విమానాశ్రయంలో పలువురు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, శాట్స్‌ ఛైర్మన్‌ ఆంజనేయగౌడ్, కుటుంబ సభ్యులు, పుష్పగుచ్ఛాలు అందజేసి సన్మానించారు.

9/20
ఈ చిత్రాలు ఏ కార్పొరేట్‌ పాఠశాలకు చెందినవో అనుకుంటే పొరపాటే. మనబస్తీ.. మనబడి పథకంలో భాగంగా ప్రభుత్వం పలు బడులను వసతులతో తీర్చిదిద్దింది. ఇందులో భాగంగానే సికింద్రాబాద్‌ పద్మారావునగర్‌ ప్రాథమిక పాఠశాలలో ల్యాప్‌టాప్‌లు అందజేయగా.. పికెట్‌ ప్రాథమిక పాఠశాలలో కొత్త రూమ్, బెంచీలతో తరగతి గది మెరిసిపోతోంది. 

10/20
 గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విశాఖ జిల్లా భీమిలి మండలం కె.నగరపాలేనికి గురువారం వెళ్లిన ఏపీ మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు చుక్కెదురైంది. ఎమ్మెల్యే తమ గ్రామానికి రాకుండా  గ్రామ తెదేపా మాజీ అధ్యక్షుడు సూరిబాబు, మరికొందరు కలిసి రోడ్డుకు అడ్డంగా పాత చెప్పులదండ కట్టడం ఉద్రిక్తతకు దారితీసింది.

11/20
 హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై సుందరీకరణ కోసం మొక్కలు పెట్టేందుకు ఈ కుండీలను తీసుకొచ్చి ఉంచారు. వాటిలో మొక్కలు పెట్టకపోవడంతో ఇవి నిరుపయోగంగా మారాయి.

12/20
 దాదాపు రూ.1800 కోట్లతో దేశంలోనే తొలిసారిగా రాయదుర్గం వద్ద ఐటీ కారిడార్‌ కోసం నిర్మించిన 400 కేవీ భారీ సబ్‌స్టేషన్‌కు సంబంధించిన టవర్లివి.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం అమ్రాబాద్‌ వద్ద, గచ్చిబౌలి బాహ్య వలయ రహదారి వెంట కనిపించాయి. దాదాపు రూ.1800 కోట్లతో దేశంలోనే తొలిసారిగా రాయదుర్గం వద్ద ఐటీ కారిడార్‌ కోసం నిర్మించిన 400 కేవీ భారీ సబ్‌స్టేషన్‌కు సంబంధించిన టవర్లివి.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం అమ్రాబాద్‌ వద్ద, గచ్చిబౌలి బాహ్య వలయ రహదారి వెంట కనిపించాయి.
13/20
సాధారణంగా వేసవిలో తాటి ముంజలు విపణిలో విక్రయిస్తుంటారు. ప్రస్తుతం ముందే వచ్చేశాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ రోడ్డులో విక్రయదారులు కొనుగోలు చేస్తూ కనిపించిన చిత్రమిది

14/20
  హైదరాబాద్‌లోని హుస్సేన్‌ సాగర్‌లో భారీ మ్యూజిక్‌ ఫౌంటెన్‌ ఏర్పాటు చేస్తున్న కార్మికులు వీరు. రోజంతా కష్టపడి భోజన విరామ సమయంలో ఫ్లోటింగ్‌ డాక్‌ యాడ్‌లపై ఇలా సేద తీరుతున్నారు. అదుపు తప్పితే ఎంత ప్రమాదం? హైదరాబాద్‌లోని హుస్సేన్‌ సాగర్‌లో భారీ మ్యూజిక్‌ ఫౌంటెన్‌ ఏర్పాటు చేస్తున్న కార్మికులు వీరు. రోజంతా కష్టపడి భోజన విరామ సమయంలో ఫ్లోటింగ్‌ డాక్‌ యాడ్‌లపై ఇలా సేద తీరుతున్నారు. అదుపు తప్పితే ఎంత ప్రమాదం?
15/20
 ఇరాన్‌ ఆయుధ కర్మాగారంపై దాడిలో ఎగసిపడుతున్న మంటలు.

16/20
   దిల్లీలోని నరైన్‌ ప్రాంతంలో గురువారం బ్రేకులు విఫలం అవడంతో  సబ్‌వేలోకి దూసుకుపోయిన డీటీసీ బస్సు

17/20
 యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఈ నెల 21వ తేదీ నుంచి పంచనారసింహుల వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. పునర్నిర్మితమైన ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఇదే తొలిసారి.

18/20
ఫ్రాన్స్‌ నౌకాదళం గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లో స్వాధీనం చేసుకున్న అసాల్ట్‌ రైఫిళ్లు, క్షిపణలు ఇవి. ఇరాన్‌ నుంచి యెమెన్‌లోని హౌతీ దళాల కోసం పంపుతున్న ఈ రైఫిళ్లు, మెషీన్‌ గన్నులు, ట్యాంకు విధ్వంసక క్షిపణులను జనవరిలో ఫ్రాన్స్‌ నౌకా దళం అడ్డుకుని స్వాధీనం చేసుకుంది.

19/20
 అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించే సీతారాముల విగ్రహాలను రూపొందించేందుకు నేపాల్‌లోని జనక్‌పుర్‌ నుంచి తీసుకొచ్చిన సాలగ్రామ శిల ఇది. 26, 14 టన్నుల బరువున్న శిలలు బుధవారం రాత్రి అయోధ్యకు చేరుకున్నాయి.

20/20
   రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ శ్రీరామనగరంలో సమతా కుంభ్‌-2023 ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి.యాగశాలలో త్రిదండి రామానుజ చిన జీయర్‌స్వామి, దేవనాధ జీయర్‌ స్వామి, అహోబిల జీయర్‌ స్వామిలు మొదటి వార్షికోత్సవాలకు గురువారం రాత్రి ఆగమశాస్త్రబద్ధంగా అంకురార్పణ చేశారు. ఈ ఉత్సవాలకు భక్తులు పెద్దఎత్తున కుటుంబ సమేతంగా తరలి వచ్చారు. 

మరిన్ని