News in Pics: చిత్రం చెప్పే సంగతులు-01(05-02-2023)

Updated : 05 Feb 2023 07:31 IST
1/19
పలు కేసుల్లో పట్టుబడిన వాహనాలను ఇలా చాదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఏళ్ల తరబడి నిలిపారు. ఇవి నిత్యం ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నాయి. పలు కేసుల్లో పట్టుబడిన వాహనాలను ఇలా చాదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఏళ్ల తరబడి నిలిపారు. ఇవి నిత్యం ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నాయి.
2/19
గోల్కొండ కోట నుంచి చూస్తే సెవెన్‌ టూమ్స్‌ గోపురాలు.. పక్కనే అధునాతన భవనాలు ఆకట్టుకుంటున్నాయి. పాత కొత్త నిర్మాణాలు నగరవాసులను కనువిందు చేస్తున్నాయి. గోల్కొండ కోట నుంచి చూస్తే సెవెన్‌ టూమ్స్‌ గోపురాలు.. పక్కనే అధునాతన భవనాలు ఆకట్టుకుంటున్నాయి. పాత కొత్త నిర్మాణాలు నగరవాసులను కనువిందు చేస్తున్నాయి.
3/19
ఓ పక్క సూర్యుడి తాకేలా ఉన్నట్లు భవనాలు..మరో వైపు పచ్చదనంతో కూడిన గుట్టలు కేపీహెచ్‌బీలో ఆకట్టుకుంటున్నాయి. వాటి పక్కనే గోడలపై సుందరీకరణలో భాగంగా వివిధ పుష్పాలు, సీతాకోకచిలుక చిత్రాలు వేశారు. పాదచారుల కోసం కాలిబాట సిద్ధం చేస్తున్నారు. అటుగా వెళ్లే వారిని ఆకట్టుకుంటున్నాయి. ఓ పక్క సూర్యుడి తాకేలా ఉన్నట్లు భవనాలు..మరో వైపు పచ్చదనంతో కూడిన గుట్టలు కేపీహెచ్‌బీలో ఆకట్టుకుంటున్నాయి. వాటి పక్కనే గోడలపై సుందరీకరణలో భాగంగా వివిధ పుష్పాలు, సీతాకోకచిలుక చిత్రాలు వేశారు. పాదచారుల కోసం కాలిబాట సిద్ధం చేస్తున్నారు. అటుగా వెళ్లే వారిని ఆకట్టుకుంటున్నాయి.
4/19
చౌమొహల్లా ప్యాలెస్‌లో శనివారం జరిగిన ‘స్త్రీ సత్రంగి’లో ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. యువతులు సందడి చేశారు. చౌమొహల్లా ప్యాలెస్‌లో శనివారం జరిగిన ‘స్త్రీ సత్రంగి’లో ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. యువతులు సందడి చేశారు.
5/19
సికింద్రాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన రహదారిపై పిచ్చి మొక్కలు, ఎండిపోయిన ఆకులను నిత్యం తగలబెడుతున్నారు. పక్కనే విద్యుత్‌ నియంత్రికలు ఉన్నా వాటిని పట్టించుకోవట్లేదు. ప్రమాదం పొంచి ఉన్నా నిర్లక్ష్యంగా నిప్పు పెడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన రహదారిపై పిచ్చి మొక్కలు, ఎండిపోయిన ఆకులను నిత్యం తగలబెడుతున్నారు. పక్కనే విద్యుత్‌ నియంత్రికలు ఉన్నా వాటిని పట్టించుకోవట్లేదు. ప్రమాదం పొంచి ఉన్నా నిర్లక్ష్యంగా నిప్పు పెడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
6/19
భాగ్యనగర్‌ కాలనీ నుంచి కూకట్‌పల్లి వరకు ప్రతి వారాంతంలో భారీగా ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. పలు దుకాణాలు, షాపింగ్‌ మాల్‌ వద్ద రోడ్లపైనే వాహనాలను పార్క్‌ చేస్తుండటంతో సమస్య తలెత్తుతోంది. అత్యవసర వాహనాలు సైతం నిలిచిపోతున్నాయి. శనివారం వివేకానందనగర్‌ వద్ద ట్రాఫిక్‌లో అంబులెన్స్‌ చిక్కుకొని కనిపించింది. భాగ్యనగర్‌ కాలనీ నుంచి కూకట్‌పల్లి వరకు ప్రతి వారాంతంలో భారీగా ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. పలు దుకాణాలు, షాపింగ్‌ మాల్‌ వద్ద రోడ్లపైనే వాహనాలను పార్క్‌ చేస్తుండటంతో సమస్య తలెత్తుతోంది. అత్యవసర వాహనాలు సైతం నిలిచిపోతున్నాయి. శనివారం వివేకానందనగర్‌ వద్ద ట్రాఫిక్‌లో అంబులెన్స్‌ చిక్కుకొని కనిపించింది.
7/19
  శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద ఉన్న ఎన్టీఆర్‌ నగరపాలక సంస్థ క్రీడామైదానంలో యోగ వేదాంత సేవా సమితి ఆధ్వర్యంలో తల్లిదండ్రుల పూజా మహోత్సవం 

నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై తల్లిదండ్రులకు తిలక ధారణ, ప్రదక్షిణ పూజలు చేశారు.


శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద ఉన్న ఎన్టీఆర్‌ నగరపాలక సంస్థ క్రీడామైదానంలో యోగ వేదాంత సేవా సమితి ఆధ్వర్యంలో తల్లిదండ్రుల పూజా మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై తల్లిదండ్రులకు తిలక ధారణ, ప్రదక్షిణ పూజలు చేశారు.
8/19
     వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తున్న అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో లాటిన్‌ అమెరికా దేశం చిలీలో కార్చిచ్చు తీవ్రతకు నామరూపాలు లేకుండా పోయిన ఇళ్లు.

వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తున్న అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో లాటిన్‌ అమెరికా దేశం చిలీలో కార్చిచ్చు తీవ్రతకు నామరూపాలు లేకుండా పోయిన ఇళ్లు.
9/19
 గవర్నర్‌ ముఖ్య కార్యదర్శిగా శనివారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అనిల్‌ కుమార్‌ 

సింఘాల్‌.


గవర్నర్‌ ముఖ్య కార్యదర్శిగా శనివారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌.
10/19
 శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళుతున్న రైలుపై ఖమ్మం రైల్వేస్టేషన్‌ దాటిన తర్వాత ముస్తఫానగర్‌ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసరడంతో సీ12 

బోగీలో అద్దానికి పగుళ్లు వచ్చాయి.





శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళుతున్న రైలుపై ఖమ్మం రైల్వేస్టేషన్‌ దాటిన తర్వాత ముస్తఫానగర్‌ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసరడంతో సీ12 బోగీలో అద్దానికి పగుళ్లు వచ్చాయి.
11/19
 ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో శనివారం యాదాద్రీశుల కల్యాణ వైభవంగా జరిగింది. యాదాద్రి క్షేత్ర అర్చకులు పాంచరాత్రాగమ విధానాలతో ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. 


ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో శనివారం యాదాద్రీశుల కల్యాణ వైభవంగా జరిగింది. యాదాద్రి క్షేత్ర అర్చకులు పాంచరాత్రాగమ విధానాలతో ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహించారు.
12/19
  హిమాచల్‌ ప్రదేశ్‌ కిన్నౌర్‌ జిల్లాలోని నాకో సరస్సు వద్ద సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. 12 వేల అడుగుల ఎత్తులో సహజసిద్ధంగా ఉన్న ఈ సరస్సులో పొడవైన ఐస్‌ ట్రాక్‌ తీర్చిదిద్ది ఈ 

ఘనత సాధించారు.


హిమాచల్‌ ప్రదేశ్‌ కిన్నౌర్‌ జిల్లాలోని నాకో సరస్సు వద్ద సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. 12 వేల అడుగుల ఎత్తులో సహజసిద్ధంగా ఉన్న ఈ సరస్సులో పొడవైన ఐస్‌ ట్రాక్‌ తీర్చిదిద్ది ఈ ఘనత సాధించారు.
13/19
  జమ్మూకశ్మీర్‌లోని డోడా జిల్లా నయీ బస్తీ గ్రామంలో నెర్రెలిచ్చిన ఇంటిని చూపుతున్న స్థానికుడు.





జమ్మూకశ్మీర్‌లోని డోడా జిల్లా నయీ బస్తీ గ్రామంలో నెర్రెలిచ్చిన ఇంటిని చూపుతున్న స్థానికుడు.
14/19
 విశాఖపట్నం: రుషికొండ నుంచి సాగర్‌నగర్‌ వెళ్లే దారిలో ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలను ఇష్టారీతిన  కొట్టేస్తున్నారు. ఎందుకిలా అంటే...పైనున్న విద్యుద్దీపాల వెలుగులు దారిపై పడకుండా 

అడ్డుగా ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. ఇలా పచ్చదనంపై వేటు వేసే చర్యలు తగదంటూ ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులు వాపోతున్నారు.


విశాఖపట్నం: రుషికొండ నుంచి సాగర్‌నగర్‌ వెళ్లే దారిలో ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలను ఇష్టారీతిన కొట్టేస్తున్నారు. ఎందుకిలా అంటే...పైనున్న విద్యుద్దీపాల వెలుగులు దారిపై పడకుండా అడ్డుగా ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. ఇలా పచ్చదనంపై వేటు వేసే చర్యలు తగదంటూ ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులు వాపోతున్నారు.
15/19
 ఈ నెలాఖరులో జరిగే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు, జీ-20 సన్నాహక సమావేశాల నిమిత్తం విశాఖ సాగర తీరప్రాంతాల్లో సుందరీకరణపై అధికారులు దృష్టిసారించారు. పేరుగాంచిన రుషికొండ 

సాగరతీరానికి విదేశీయులు వస్తారని అంచనా. బ్లూఫ్లాగ్‌ గుర్తింపు ఉన్న ఈ తీరం పలు చోట్ల ప్రస్తుతం డంపింగ్‌ యార్డులా మారింది. పేరుకుపోతున్న చెత్త, వస్త్రాల పీలికలు కాళ్లకు 

అడ్డుపడుతుండటంతో సందర్శకులు హడలిపోతున్నారు.





ఈ నెలాఖరులో జరిగే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు, జీ-20 సన్నాహక సమావేశాల నిమిత్తం విశాఖ సాగర తీరప్రాంతాల్లో సుందరీకరణపై అధికారులు దృష్టిసారించారు. పేరుగాంచిన రుషికొండ సాగరతీరానికి విదేశీయులు వస్తారని అంచనా. బ్లూఫ్లాగ్‌ గుర్తింపు ఉన్న ఈ తీరం పలు చోట్ల ప్రస్తుతం డంపింగ్‌ యార్డులా మారింది. పేరుకుపోతున్న చెత్త, వస్త్రాల పీలికలు కాళ్లకు అడ్డుపడుతుండటంతో సందర్శకులు హడలిపోతున్నారు.
16/19
  క్యాన్సర్‌పై చైతన్యం చేస్తూ శనివారం  విశాఖపట్నం బీచ్‌ రోడ్డులో ‘అవగాహన నడక’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా యువత డ్యాన్స్‌ చేసి అక్కడికి వచ్చిన వారిని ఆకట్టుకున్నారు. క్యాన్సర్‌పై చైతన్యం చేస్తూ శనివారం విశాఖపట్నం బీచ్‌ రోడ్డులో ‘అవగాహన నడక’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా యువత డ్యాన్స్‌ చేసి అక్కడికి వచ్చిన వారిని ఆకట్టుకున్నారు.
17/19
 మన్యంలో కుటుంబమంతా వ్యవసాయ పనులకు వెళ్తారు. చంటి బిడ్డలనూ తమ వెంట తీసుకెళ్తారు. చింతపల్లి మండలం లంబసింగి పంచాయతీ చీకటిమామిడిలో పసుపు తవ్వేందుకు వెళ్లిన ఓ గిరిజన కుటుంబం తమ చిన్నారినీ వెంట తీసుకెళ్లింది. అక్కడ గొడుగు నీడలో చిన్నారిని పడుకోబెట్టి పనులు చేసుకున్నారు. మన్యంలో కుటుంబమంతా వ్యవసాయ పనులకు వెళ్తారు. చంటి బిడ్డలనూ తమ వెంట తీసుకెళ్తారు. చింతపల్లి మండలం లంబసింగి పంచాయతీ చీకటిమామిడిలో పసుపు తవ్వేందుకు వెళ్లిన ఓ గిరిజన కుటుంబం తమ చిన్నారినీ వెంట తీసుకెళ్లింది. అక్కడ గొడుగు నీడలో చిన్నారిని పడుకోబెట్టి పనులు చేసుకున్నారు.
18/19
  తిరుపతి పేరూరు సమీపంలోని శ్రీచైతన్య బాలికల జూనియర్‌ కళాశాల (శ్రీ మీనాక్షి సౌధ]ం) వేదికగా ఈనాడు- కేఎల్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన దశ- దిశ కార్యక్రమాన్ని  జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న కేఎల్‌ యూనివర్సిటీ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ జె.శ్రీనివాసరావు. చిత్రంలో ‘ఈనాడు’ యూనిట్‌ ఇన్‌ఛార్జి బి.చంద్రశేఖర్,


తిరుపతి పేరూరు సమీపంలోని శ్రీచైతన్య బాలికల జూనియర్‌ కళాశాల (శ్రీ మీనాక్షి సౌధ]ం) వేదికగా ఈనాడు- కేఎల్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన దశ- దిశ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న కేఎల్‌ యూనివర్సిటీ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ జె.శ్రీనివాసరావు. చిత్రంలో ‘ఈనాడు’ యూనిట్‌ ఇన్‌ఛార్జి బి.చంద్రశేఖర్,
19/19
 పాఠశాల విద్యార్థులకు జగనన్న విద్యా కానుకలో భాగంగా కిట్లను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. నాణ్యత లేకపోవడంతో బ్యాగులు చిరిగాయి. కుప్పం పట్టణంలోని నారాయణపురం ప్రాథమిక పాఠశాల నుంచి ఇళ్లకు విద్యార్థులు ఇలా చిరిగిన బ్యాగులతో పయనమయ్యారు. మరికొందరు కొత్త బ్యాగులను మార్కెట్లో కొనుగోలు చేసి పాఠశాలకు వస్తున్నారు. 


పాఠశాల విద్యార్థులకు జగనన్న విద్యా కానుకలో భాగంగా కిట్లను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. నాణ్యత లేకపోవడంతో బ్యాగులు చిరిగాయి. కుప్పం పట్టణంలోని నారాయణపురం ప్రాథమిక పాఠశాల నుంచి ఇళ్లకు విద్యార్థులు ఇలా చిరిగిన బ్యాగులతో పయనమయ్యారు. మరికొందరు కొత్త బ్యాగులను మార్కెట్లో కొనుగోలు చేసి పాఠశాలకు వస్తున్నారు.

మరిన్ని