చిత్రం చెప్పే సంగతులు- 02(20-01-2023)

Updated : 20 Jan 2023 22:44 IST
1/19
హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో శుక్రవారం ఇండియా సైన్స్‌ ఫెస్టివల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా విక్రమ్‌ సారాభాయ్‌ కుమార్తె మల్లికా సారాభాయ్‌ ఇచ్చిన నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నృత్యాన్ని గతంలో ఆమె తల్లి, విక్రమ్ సారాభాయ్ భార్య మృణాళిని సారాభాయ్‌ కంపోజ్‌ చేయడం విశేషం. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో శుక్రవారం ఇండియా సైన్స్‌ ఫెస్టివల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా విక్రమ్‌ సారాభాయ్‌ కుమార్తె మల్లికా సారాభాయ్‌ ఇచ్చిన నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నృత్యాన్ని గతంలో ఆమె తల్లి, విక్రమ్ సారాభాయ్ భార్య మృణాళిని సారాభాయ్‌ కంపోజ్‌ చేయడం విశేషం.
2/19
3/19
జర్మనీలోని బెర్లిన్‌లో ఇంటర్నేషనల్‌ గ్రీన్‌ వీక్‌ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆహార, వ్యవసాయ ఉత్పత్తుల ట్రేడ్‌ ప్రదర్శనలో ఓ వ్యక్తి చెట్టు వేషధారణలో కనిపించి ఆకట్టుకున్నాడు. జర్మనీలోని బెర్లిన్‌లో ఇంటర్నేషనల్‌ గ్రీన్‌ వీక్‌ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆహార, వ్యవసాయ ఉత్పత్తుల ట్రేడ్‌ ప్రదర్శనలో ఓ వ్యక్తి చెట్టు వేషధారణలో కనిపించి ఆకట్టుకున్నాడు.
4/19
ఈ దృశ్యం కారుపై యువకుడు కూర్చున్నట్లు కనిపిస్తోంది కదూ. హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడ చౌరస్తాలో సుందరీకరణలో భాగంగా యువకుడి కళాఖండాన్ని గతంలో ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో శుక్రవారం ఓ కారు వెళ్తుండగా.. దూరం నుంచి చూసినప్పుడు దానిపై యువకుడు కూర్చున్నాడా అన్నట్లుగా భ్రమ కలిగింది. ఈ దృశ్యం కారుపై యువకుడు కూర్చున్నట్లు కనిపిస్తోంది కదూ. హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడ చౌరస్తాలో సుందరీకరణలో భాగంగా యువకుడి కళాఖండాన్ని గతంలో ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో శుక్రవారం ఓ కారు వెళ్తుండగా.. దూరం నుంచి చూసినప్పుడు దానిపై యువకుడు కూర్చున్నాడా అన్నట్లుగా భ్రమ కలిగింది.
5/19
ఒంగోలుకు చెందిన జలీల్‌  కొత్తపట్నం మండలం పాదర్తిలో (సముద్ర తీర ప్రాంతం) తనకున్న ఇసుక భూమిలో చామదుంప, వేరుశనగ పంటలు సాగు చేస్తుంటారు. ఏటా సముద్రం నుంచి వీచే పడమటి గాలులతో ఆకులకు రంధ్రాలు పడి పంట నష్టం సంభవించేది. పొలం గట్లు కూడా చెదిరిపోయేవి. దీంతో ఆయన వినూత్నంగా ఆలోచించి 160 టైర్లతో గట్టు ఏర్పాటు చేశారు.  ఒంగోలుకు చెందిన జలీల్‌ కొత్తపట్నం మండలం పాదర్తిలో (సముద్ర తీర ప్రాంతం) తనకున్న ఇసుక భూమిలో చామదుంప, వేరుశనగ పంటలు సాగు చేస్తుంటారు. ఏటా సముద్రం నుంచి వీచే పడమటి గాలులతో ఆకులకు రంధ్రాలు పడి పంట నష్టం సంభవించేది. పొలం గట్లు కూడా చెదిరిపోయేవి. దీంతో ఆయన వినూత్నంగా ఆలోచించి 160 టైర్లతో గట్టు ఏర్పాటు చేశారు.
6/19
భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య శనివారం రెండో వన్డే మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో రాయ్‌పుర్‌లో భారత క్రికెటర్లు సాధన చేస్తూ కనిపించారు. ఇప్పటికే భారత్‌ మొదటి వన్డేలో గెలిచి 1-0 ఆధిక్యంలో ఉంది. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య శనివారం రెండో వన్డే మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో రాయ్‌పుర్‌లో భారత క్రికెటర్లు సాధన చేస్తూ కనిపించారు. ఇప్పటికే భారత్‌ మొదటి వన్డేలో గెలిచి 1-0 ఆధిక్యంలో ఉంది.
7/19
పశ్చిమబెంగాల్‌లోని కలైకుండాలో భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ‘ఏరోబెటిక్‌ ఏరియల్‌ డిస్‌ప్లే’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు పారాట్రూపర్లు ఇలా మువ్వన్నెల పారాచ్యూట్‌తో గాలిలో ఎగురుతూ ఆకట్టుకునే విన్యాసాలు చేశారు. పశ్చిమబెంగాల్‌లోని కలైకుండాలో భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ‘ఏరోబెటిక్‌ ఏరియల్‌ డిస్‌ప్లే’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు పారాట్రూపర్లు ఇలా మువ్వన్నెల పారాచ్యూట్‌తో గాలిలో ఎగురుతూ ఆకట్టుకునే విన్యాసాలు చేశారు.
8/19
‘ఏరోబెటిక్‌ ఏరియల్‌ డిస్‌ప్లే’లో విన్యాసాలు చేస్తున్న యుద్ధ విమానాలు ‘ఏరోబెటిక్‌ ఏరియల్‌ డిస్‌ప్లే’లో విన్యాసాలు చేస్తున్న యుద్ధ విమానాలు
9/19
సందీప్‌కిషన్‌ హీరోగా రంజిత్‌ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మైఖేల్‌. ఇందులో కథానాయిక దివ్యాంశ కౌశిక్‌ ‘తీర’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘మైఖేల్‌’ ఫిబ్రవరి 3న విడుదల కానుంది. సందీప్‌కిషన్‌ హీరోగా రంజిత్‌ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మైఖేల్‌. ఇందులో కథానాయిక దివ్యాంశ కౌశిక్‌ ‘తీర’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘మైఖేల్‌’ ఫిబ్రవరి 3న విడుదల కానుంది.
10/19
హైదరాబాద్‌లోని నార్సింగిలో శుక్రవారం పశువుల జాతర నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు పశువులను అలంకరించి తీసుకువచ్చి విక్రయించారు. ఏటా సంక్రాంతి తర్వాత వచ్చే శుక్రవారం ఇక్కడ పశువుల జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. హైదరాబాద్‌లోని నార్సింగిలో శుక్రవారం పశువుల జాతర నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు పశువులను అలంకరించి తీసుకువచ్చి విక్రయించారు. ఏటా సంక్రాంతి తర్వాత వచ్చే శుక్రవారం ఇక్కడ పశువుల జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
11/19
మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావును హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావును హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
12/19
హైదరాబాద్‌ నగర శివారులోని పెద్దఅంబర్‌పేట్‌ మండలం తారామతిపేట్‌ వద్ద ఓఆర్ఆర్‌ పక్కన వందల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. రియల్‌ఎస్టేట్‌ కారణంగా ఇక్కడ భూముల ధరలు అమాంతం పెరిగినా రైతులు సాగుకే మొగ్గు చూపడంతో ఇలా ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. హైదరాబాద్‌ నగర శివారులోని పెద్దఅంబర్‌పేట్‌ మండలం తారామతిపేట్‌ వద్ద ఓఆర్ఆర్‌ పక్కన వందల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. రియల్‌ఎస్టేట్‌ కారణంగా ఇక్కడ భూముల ధరలు అమాంతం పెరిగినా రైతులు సాగుకే మొగ్గు చూపడంతో ఇలా ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది.
13/19
బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ మరో నటుడు అక్షయ్‌ కుమార్‌తో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటోలో వెనక వైపు ఐశ్వర్యరాయ్‌ చిత్రం ఉంది. ఈ సంఘటనను ఉద్దేశిస్తూ.. ‘ఐశ్వర్యతో సాధ్యం కానప్పుడు ఆమె ఫొటోతోనైనా సెల్ఫీ తీసుకుందాం’ అని ఇమ్రాన్‌ హష్మీ ఫన్నీగా పోస్టు పెట్టారు. అక్షయ్‌కుమార్‌, ఇమ్రాన్‌ హష్మీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సెల్ఫీ’ సినిమా ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ మరో నటుడు అక్షయ్‌ కుమార్‌తో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటోలో వెనక వైపు ఐశ్వర్యరాయ్‌ చిత్రం ఉంది. ఈ సంఘటనను ఉద్దేశిస్తూ.. ‘ఐశ్వర్యతో సాధ్యం కానప్పుడు ఆమె ఫొటోతోనైనా సెల్ఫీ తీసుకుందాం’ అని ఇమ్రాన్‌ హష్మీ ఫన్నీగా పోస్టు పెట్టారు. అక్షయ్‌కుమార్‌, ఇమ్రాన్‌ హష్మీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సెల్ఫీ’ సినిమా ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
14/19
మహమ్మద్‌ సిరాజ్‌ క్రికెటర్‌ అక్షర్‌ పటేల్‌కు ట్విటర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘జన్మదిన శుభాకాంక్షలు సోదరా.. నీ ఖాతాలో మరిన్ని వికెట్లు, పరుగులు పడాలి... ఎప్పుడూ ఆనందంగా ఉండాలి’ అని పోస్టు పెట్టారు. వారిద్దరు కలిసి గ్రౌండ్‌లో ఆడుతున్న, రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న ఫొటోలను సిరాజ్‌ ఈ సందర్భంగా పంచుకున్నారు. మహమ్మద్‌ సిరాజ్‌ క్రికెటర్‌ అక్షర్‌ పటేల్‌కు ట్విటర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘జన్మదిన శుభాకాంక్షలు సోదరా.. నీ ఖాతాలో మరిన్ని వికెట్లు, పరుగులు పడాలి... ఎప్పుడూ ఆనందంగా ఉండాలి’ అని పోస్టు పెట్టారు. వారిద్దరు కలిసి గ్రౌండ్‌లో ఆడుతున్న, రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న ఫొటోలను సిరాజ్‌ ఈ సందర్భంగా పంచుకున్నారు.
15/19
అర్జెంటీనాలోని ఓ రైతు తన మొక్కజొన్న తోటలోని మొక్కలతో ఆ దేశ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు మెస్సీ చిత్రాన్ని తీర్చిదిద్ది అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ ఏడాది అర్జెంటీనా ఫిఫా వరల్డ్‌కప్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. అర్జెంటీనాలోని ఓ రైతు తన మొక్కజొన్న తోటలోని మొక్కలతో ఆ దేశ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు మెస్సీ చిత్రాన్ని తీర్చిదిద్ది అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ ఏడాది అర్జెంటీనా ఫిఫా వరల్డ్‌కప్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే.
16/19
మంచు మనోజ్‌ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న ఆయన శుక్రవారం ఉదయం కొత్త ప్రాజెక్ట్‌ విశేషాలను వెల్లడించారు. ‘వాట్‌ ది ఫిష్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మంచు మనోజ్‌ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న ఆయన శుక్రవారం ఉదయం కొత్త ప్రాజెక్ట్‌ విశేషాలను వెల్లడించారు. ‘వాట్‌ ది ఫిష్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
17/19
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరుగుతున్న ఫుట్‌బాల్‌ గేమ్‌కు బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరుగుతున్న ఫుట్‌బాల్‌ గేమ్‌కు బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
18/19
భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఆలయ అర్చకులు ఘనంగా విశ్వరూప సేవ మహోత్సవాన్ని నిర్వహించారు. ఏటా ముక్కోటి ఏకాదశి ఉత్సవం అయిన 15 రోజుల తర్వాత ఈ సర్వ దేవత అలంకరణ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఆలయ అర్చకులు ఘనంగా విశ్వరూప సేవ మహోత్సవాన్ని నిర్వహించారు. ఏటా ముక్కోటి ఏకాదశి ఉత్సవం అయిన 15 రోజుల తర్వాత ఈ సర్వ దేవత అలంకరణ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
19/19
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో మెస్రం వంశీయులు గురువారం రాత్రి తమ పూర్వీకులు 84 మందికి పిండ ప్రదాన పూజలను చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో మెస్రం వంశీయులు గురువారం రాత్రి తమ పూర్వీకులు 84 మందికి పిండ ప్రదాన పూజలను చేశారు.

మరిన్ని