US Open: ఎమ్మా రదుకాను ఆట చూడతరమా

US Open: ఎమ్మా రదుకాను ఆట చూడతరమా

1/10

చిన్నతనం నుంచే టెన్నిస్‌పై ఇష్టం పెంచుకున్న రదుకాను ఒక్కసారి కోర్టులోకి దిగిందంటే ప్రత్యర్థి ఎవరనే విషయాన్ని పెద్దగా పట్టించుకోదు. ఒలింపిక్‌ ఛాంపియన్‌ అయినా ఎలాంటి ఒత్తిడి లేకుండా విజయం కోసం వంద శాతం కష్టపడడమే తనకు తెలుసు.

2/10

అయిదేళ్ల వయసులో టెన్నిస్‌ రాకెట్‌ పట్టిన ఆమె ఇక దాన్ని వదల్లేదు. పాఠశాలకు దగ్గరలోనే ఆమె శిక్షణ పొందే అకాడమీ ఉండేది. దీంతో పాఠశాలకు వెళ్లే ముందు.. ఆ తర్వాత.. అప్పుడప్పుడూ మధ్యలో వెళ్లి సాధన కొనసాగించేది.

3/10

తనకంటే మెరుగైన క్రీడాకారిణులపై సంచలన ప్రదర్శనతో ప్రి క్వార్టర్స్‌ చేరి 42 ఏళ్ల తర్వాత ఆ ఘనత సాధించిన అతి పిన్న వయసు బ్రిటన్‌ అమ్మాయిగా రికార్డు సృష్టించింది. కానీ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందితో ప్రి క్వార్టర్స్‌ నుంచి మధ్యలో తప్పుకుంది.

4/10

స్నేహితులతో కలిసి షికార్లకు వెళ్లాలంటే ఆమెకు ఎంతో ఇష్టం. టోర్నీలు లేనప్పుడు సరదాగా స్నేహితులతో కలిసి విహారాలకు కూడా వెళ్తుంది.

5/10

ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాలంటే ఎమ్మాకు మహా ఇష్టం. ఈ క్రమంలోనే అప్పుడప్పుడూ లండన్‌ చుట్టుపక్కల ప్రాంతాలను చుట్టేస్తుంది. అలాంటి సమయాల్లో తనకు నచ్చినట్లు ఎంజాయ్‌ చేస్తుంది.

6/10

చదువులోనూ ఇటీవల తన ‘ఎ’ స్థాయి ఫలితాల్లో ఆమె గణితం, ఆర్థిక శాస్త్రంలో గొప్ప ప్రతిభ కనబరిచింది.

7/10

ఆమెకు రెండేళ్ల వయసులో తన కుటుంబం ఇంగ్లాండ్‌లో స్థిరపడింది. చిన్నప్పటి నుంచి ఆమె చాలా చలాకీగా ఉండేది. చదువుతో పాటు గోల్ఫ్, కార్టింగ్‌లోనూ ఆసక్తి ప్రదర్శించేది. ఫార్ములా వన్‌కు ఆమె అభిమాని.

8/10

అప్పుడప్పుడూ సరదాగా సైక్లింగ్‌ చేయడమంటే ఎమ్మాకు ఎంతో ఇష్టం. వీలుచిక్కినప్పుడల్లా స్థానికంగా సైకిల్‌ సవారీ చేస్తుంది.

9/10

వీలుచిక్కినప్పుడల్లా లండన్‌ వీధుల్లో సరదాగా అలా బయటకు వెళ్లుంది. తనకు నచ్చినట్లు ఉంటూ జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది.

10/10


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని