News in pics: చిత్రం చెప్పే విశేషాలు (06-07-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 06 Jul 2024 15:00 IST
1/18
విద్యార్థుల వివరాలు నమోదు చేస్తున్న సిబ్బంది

2/18
  సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరైన విద్యార్థులు

3/18
క్యూలైన్‌లో వేచి ఉన్న అభ్యర్థులు..
క్యూలైన్‌లో వేచి ఉన్న అభ్యర్థులు..
4/18
తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తున్న టీజీఈఏపీ సెట్ ఇంజనీరింగ్, ఫార్మా కళాశాలల్లో ప్రవేశాల కోసం  సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరైన విద్యార్థులు

5/18
తన నివాసానికి విచ్చేసిన మంత్రి  ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డికి ఘనంగా స్వాగతం పలుకుతున్న  ఏపీ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి  పొంగూరు నారాయణ తదితరులు

6/18
తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలోని చిట్యాల, నార్కెట్ పల్లి, కట్టంగూర్ మండలాల్లో హైవేలపై వరస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర  దొంగల ముఠా అరెస్టు చేసిన పోలీసులు

7/18
వరంగల్‌ నగరాన్ని స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దే క్రమంలో బల్దియా అధికారులు కూడళ్ల సుందరీకరణ చేపట్టారు. అందులో భాగంగా వంద అడుగుల రహదారిలో జవహర్‌నగర్‌ కూడలి వద్ద హంసలతో ఫౌంటెన్‌ ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో హంసల నోటిలో నుంచి నీళ్లు ఎగజిమ్ముతూ.. రంగు రంగుల విద్యుత్తు దీపాల కాంతిలో ఆకట్టుకునేవి.

8/18
నిత్యం ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా.. చాలామంది గుణపాఠాలు నేర్వడం లేదు. మెదక్‌ పట్టణంలో ఓ వ్యక్తి మేకను ద్విచక్రవాహనంపై ప్రమాదకరంగా తీసుకెళుతూ చరవాణిలో మాట్లాడుతుండగా.. ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.

9/18
కల్కి సినిమాలో ప్రభాస్‌ ఉపయోగించిన రోబోట్‌ కారు (బుజ్జి) విశాఖ వ్యాలీ పాఠశాలకు వచ్చి క్రీడా మైదానంలో చక్కర్లు కొట్టింది. దీంతో విద్యార్థులు కేరింతలతో సందడి చేశారు. అనంతరం కారు ఎక్కి సంతోషాన్ని పంచుకున్నారు. సెల్ఫీలు దిగి పలువురు  సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు.

10/18
 విశాఖ జిల్లా అరకు సంతబయలులో  జరిగిన వారపు సంతలో పనసకు గిరాకీ ఏర్పడింది. మైదాన ప్రాంత వ్యాపారులు ఎగబడి వీటిని కొనుగోలు చేశారు. ఒక్కో పనస రూ.80 నుంచి రూ.120 వరకు ధర పలికింది. దీంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. 

11/18
విశాఖ జిల్లా మోతుగూడెం మన్యంలో మది దోచేలా మంచు సోయగాలు కనువిందు చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో రోజూ వర్షం పడుతోంది. వర్షం తగ్గాక కొండలపై మంచు పరుచుకుని అద్భుత దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. 

12/18
అన్నమయ్య జిల్లా కలికిరిలోని ఎహసానుల్లా మిషన్‌ కాంపౌండ్‌ సమీపంలోని బాలిరెడ్డి సోమశేఖరరెడ్డి ఇంటి పెరట్లో పెంచిన అంజూర చెట్టు కాండం వద్దే కాయలు విరగ్గాసి ఆకర్షిస్తోంది. అంజూర అంటును నాటిన మూడేళ్లకు 5 నుంచి 6 కిలోల దిగుబడి ఇస్తుంది. 

13/18
రష్యాతో సాగుతున్న యుద్ధం తమ జీవితాలను అతలాకుతలం చేసినా ప్రకృతితో మమేకమై... జీవితంలో గుచ్చుకున్న ముళ్లను గులాబీల్లా భరిస్తున్నారు! ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో అడుగడుగునా కనిపించే ఈ దృశ్యాలే... యుద్ధంలోనూ ప్రకృతి పట్ల... పువ్వుల పట్ల వారికున్న శ్రద్ధకు నిదర్శనాలు!

14/18
 అందంగా అలంకరించిన పూలవనంలో ఉయ్యాల ఊగుతున్న ఉక్రెయిన్‌ మహిళ

15/18
చెన్నైలో జరిగిన 36వ రాష్ట్ర జూనియర్‌ ఓపెన్‌ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీ ప్రారంభోత్సవం సందర్భంగా యువ క్రీడాకారులకు నిషేధిత ఉత్ప్రేరకాల గురించి అవగాహన కల్పించేందుకు 2500 మంది క్రీడాకారులచేత యాంటీ డోపింగ్‌ ప్రతిజ్ఞ చేయించి తమిళనాడు అథ్లెట్‌ సంఘం రికార్డు సృష్టించింది.

16/18
ఉప్పల్‌లోని హైకోర్టు కాలనీలోని పెద్ద చెరువు అలుగు వద్ద మంచు దుప్పటి కప్పుకున్నట్లు తలపిస్తోంది. అలా అనుకుంటే భ్రమించినట్లే. మంచినీటి చెరువు కాస్త విష రసాయనాలు కలిసిపోయి ప్రజలకు నరకాన్ని చూపిస్తోంది.

17/18
పింఛన్ల పెంపు కోసం ధర్నా చేయడానికి వివిధ గ్రామాల నుంచి  కొంగరకలాన్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు వచ్చిన దివ్యాంగులు, వృద్ధులు వీరు. ఎండ తీవ్రతకు తట్టుకోలేక కలెక్టరేట్‌ ఎదుట ఉన్న చెట్ల నీడకు చేరారు.

18/18
హైదరాబాద్‌ నగరంలో కొందరు ద్విచక్ర వాహనాలపై ప్రమాదకరంగా భారీ వస్తువులను తరలిస్తూ పక్కవారికి ఇబ్బందులు కలిగిస్తున్నారు. వనస్థలిపురంలో పొడవాటి తలుపులతో వెళ్తున్న ఈ దృశ్యం వనస్థలిపురంలో కనిపించింది.

మరిన్ని