News in pics: చిత్రం చెప్పే విశేషాలు (07-07-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 07 Jul 2024 14:38 IST
1/17
ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద ఇస్కాన్‌ టెంపుల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి..

2/17
స్వామి వారికి హారతి ఇస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

3/17
కార్గిల్‌ విజయ్ దివస్‌ సిల్వర్‌ జూబ్లీని పురస్కరించుకుని నేషనల్‌ సైక్లిస్ట్‌ ఆశా మాల్వీయ జూన్‌ 14న కన్యాకుమారి నుంచి కార్గిల్‌ వరకు సైకిల్‌ యాత్ర చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆమె కలిశారు. సందర్భంగా ఆశాను సీఎం అభినందించారు.

4/17
అనంతపురం నగరంలోని ఎస్.ఎస్.బి.ఎన్ డిగ్రీ కళాశాల, ఎస్.ఎస్.బి.ఎన్ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఈపీఎఫ్ఓ పరీక్షలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్  డాక్టర్ వినోద్ కుమార్ 

5/17
వర్షాలే లేవు.. నదీ ప్రవాహం ఎక్కడనుకుంటున్నారా? మీరు నీటిలో కాలేసినట్లే? అది జల ప్రవాహం కాదండోయ్‌.. సోలార్‌ విద్యుత్తు ఫలకలు. ఎత్తైన కొండలు.. చుట్టూ పచ్చని పొలాల మధ్య ఓ కంపెనీ వారు ఏర్పాటు చేసిన సోలార్‌ ఫలకలు ఇలా ఆకట్టుకుంటున్నాయి. 

6/17
విశాఖ జిల్లా నక్కపల్లి, ఎస్‌.రాయవరం మండలాల్లో శనివారం సాగిన చేపల వేటలో మేలు జాతి చేపలు లభించడంతో మత్స్యకారులకు కాసుల పంట పండింది. ఇందులో ఖరీదైన చందువా, వంజరం, లెదర్‌ జాకెట్, అపోలో ఫిష్‌లతోపాటు కలివిందలు, పీతలు, కానకడతలు తదితర చేపలు లభించాయి. 

7/17
విశాఖ నగర పరిధిలోని చినముషిడివాడ ప్రాంతంలో గతంలో క్వారీ తవ్వి వదిలేసిన ప్రాంతం వర్షాలకు నీటితో నిండిపోయింది. పచ్చని కొండ దిగువనే కొలనులా మారిన ఈ ప్రాంతం ఎంతగానో ఆకట్టుకుంటోంది.

8/17
కైలాస గిరి కొండపై నుంచి తిలకిస్తే ప్రకృతి  ఒడిలో ఒదిగిన నగర శోభ అబ్బురపరుస్తుంది.  భారీ భవంతులు.. వాటి మధ్య పచ్చదన సొబగులు.. మరో వైపు సాగర తీర అందాలు చూడాలంటే రెండు కళ్లూ చాలవంటున్నారు ప్రకృతి ప్రేమికులు. విశాఖ నగరాన్ని, నీలి సంద్రాన్ని కన్నార్పకుండా చూస్తూ మైమరచిపోతుంటారు.

9/17
 కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం చిన్నదేవాడలో రైతులు వినూత్నంగా ఆలోచించి కలుపు తీస్తున్నారు. చేనులో కలుపు తీయడానికి అర్థికంగా ఖర్చు ఎక్కువ అవ్వడంతో పాటు సకాలంలో కూలీలు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో  ఎద్దుల సహాయంతో ఐదుగురు రైతులు కలిసి కురిపేలతో కలుపు తీస్తున్నారు.

10/17
హైదరాబాద్‌ నుంచి దిల్లీ వెళ్తున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ డిచ్‌పల్లి రైల్వేస్టేషన్‌లో శనివారం కొద్దిసేపు ఆగింది. కాజీపేట జంక్షన్‌లో రైల్వే పనులు కొనసాగుతున్న నేపథ్యంలో దిల్లీ రూటులో వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను దారి మళ్లించడంతో నిజామాబాద్‌ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. 

11/17
విద్యార్థులకు సరిపడా బస్సులను కేటాయించకపోవడంతో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉంటాయి.  దీంతో వారు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోంది.  మహబూబ్‌నగర్‌ జిల్లా  గద్వాల నుంచి రాయచూర్‌కి వెళ్లే మార్గంలో కనిపించిన చిత్రాలివి.

12/17
విశ్వవిఖ్యాత పూరీ ‘రథయాత్ర’ పండుగను పురస్కరించుకుని పలువురు కళాకారులు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రహ్మపురకు చెందిన క్రాఫ్ట్‌ మేకర్, యువ చిత్రకారిణి, తెలుగు అమ్మాయి లాస్యప్రియ బీరక జగన్నాథ కళాకృతులను రూపొందించారు. 

13/17
 మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 24 హవర్స్‌ ప్రాజెక్ట్‌ అనే సంస్థ ప్రతి ఏటా వేర్వేరు దేశాల్లో ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తోంది. 125 ఉత్తమ ఫోటోలు ఇక్కడ కొలువుదీరాయి.

14/17
ఎక్కడైనా రైలు పట్టాలపైనే ప్రయాణిస్తుంది. ఇక్కడ మాత్రం లారీ ఎక్కేసింది. సికింద్రాబాద్‌ రైల్‌ నిలయం సమీపంలోని సంచాల్‌ భవన్‌ ఆవరణలో నమూనాగా ఏర్పాటు  ఆవరణలో నమూనాగా ఏర్పాటు చేయడానికి లాలాగూడ నుంచి ఇలా తీసుకెళ్తుండగా కనిపించింది. ఆ మార్గంలో రాకపోకలు సాగించే వారు ఆసక్తిగా తిలకించారు.

15/17
సీఎం రేవంత్‌రెడ్డికి వేంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు

16/17
హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

17/17
ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం అంబారుపేట గ్రామంలో భారత క్రికెట్‌ జట్టు పూర్వపు సారథి మహేంద్రసింగ్‌ ధోనీ 100 అడుగుల కటౌట్‌ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఈ కటౌట్‌ వాహనచోదకులు, ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. 

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు