News in images: చిత్రం చెప్పే విశేషాలు (12-06-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 12 Jun 2024 09:24 IST
1/16
ఇక్కడున్న జనాలను చూసి ఏదో విహార యాత్రకు వచ్చారనుకుంటే పొరపాటు పడినట్లే. వీరంతా చినుకులు రాలిన నేలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కర్నూలు జిల్లా మద్దికెర- కసాపురం మధ్యన ఓ పొలంలో వజ్రాలు వెతికేందుకు స్థానికేతరులు భారీగా తరలివచ్చారు. 

2/16
సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని.. అనుకున్న లక్ష్యాలను సాధించిన ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అందరికీ స్ఫూర్తిప్రదాత అని దేవనకొండ చిత్రకారుడు ఈరప్ప అన్నారు. రామోజీరావు చిత్రాన్ని రూపొందించి, తన అభిమానాన్ని చాటారు.  

3/16
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడికి చెందిన ప్రముఖ శిల్పకారుడు మందుగుల కనకలింగ వీరబ్రహ్మం 30 రోజుల పాటు కష్టపడి చెక్కపై ‘శ్రీమద్‌ రామాయణ వృత్తాంతం’ అందంగా తీర్చిదిద్దారు. ఈయన అనేక రకాల శిల్ప కళాఖండాలను గీస్తూ పట్టణంలో ఖ్యాతిగాంచారు. 

4/16
మన్యంలో కురుస్తున్న వర్షాలతో పూల సోయగాలు ఆకర్షిస్తున్నాయి. మండల కేంద్రంలోని చాపరాయి జలవిహారికి ఆనుకుని అంత్రిగుడ రహదారిలో తెలుపు, లేత ఎరుపు రంగులో పచ్చని ఆకుల నడుమ ఉమ్మెత్త పూలు పర్యటకులను ఆకట్టుకుంటున్నాయి.

5/16
వానాకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో అన్నదాతలు విత్తనాలు విత్తేందుకు పనిముట్లను సిద్ధం చేసుకుంటున్నారు. నల్గొండ జిల్లా చందంపేట గ్రామానికి ఓ రైతు పోలేపల్లి గ్రామంలో సిద్ధం చేయించిన గుంట్కాను తన ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న దృశ్యం ‘న్యూస్‌టుడే’ కంట పడింది.

6/16
 విశాఖ జిల్లా  తిమ్మరాజుపేటలో ఆహారం కోసం ప్లాస్టిక్‌ డబ్బాలో తలదూర్చిన ఓ కుక్క తల డబ్బాలో ఇరుక్కుపోయింది. ఈ డబ్బాను విదులించుకునేందుకు ఆ కుక్క ఎంత ప్రయత్నించినా వీలుకావడంలేదు. డబ్బా తియ్యడానికి ఎవరు ప్రయత్నించినా అది దొరక్కుండా పరుగులు తీస్తోంది.

7/16
భానుడి ప్రతాపానికి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలులను సైతం లెక్కచేయక రహదారి పక్కన గొడుగు నీడలో నిమ్మకాయలు విక్రయిస్తోంది. ఈ అవ్వ పేరు నల్లమోతుల నారాయణమ్మ. అశ్వారావుపేట మండలం వినాకయపురానికి చెందిన ఈమె వయసు 85 ఏళ్లు.

8/16
ఖమ్మం వేణుగోపాలనగర్‌కు చెందిన వెంపటి లక్ష్మయ్య భవన నిర్మాణ రంగ కార్మికుడు. తెదేపా సానుభూతిపరుడు. ఏపీ సీఎంగా నారా చంద్రబాబు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ  కార్యక్రమంలో పాల్గొనేందుకు ఖమ్మం నుంచి సైకిల్‌పై  అమరావతికి వెళ్తుండగా ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.

9/16
ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన కళాకారుడు గొడ్డేటి బాలకృష్ణ అలియాస్‌ బాలు. ఏపీలో కూటమి విజయకేతనం అంటూ రక్తంతో ప్రధాని మోదీ, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్‌కల్యాణ్‌తో కూడిన చిత్రాన్ని గీశారు. 

10/16
తన కాళ్లపై తాను నిలబడే వరకు బిడ్డకు అన్నీ అమ్మే.. హైదరాబాద్‌ కోఠీలోని ప్రధాన రహదారిపై ఓ మాతృమూర్తి తన చిన్నారిని వీపున కట్టుకొని నడిచి వెళ్తుండగా..  మరొకరు ద్విచక్రవాహనంపై తీసుకెళ్తూ కనిపించారు.    

11/16
కేంద్ర మంత్రులు అమిత్‌షా, జేపీ నడ్డాలతో శాసనసభాపక్ష నేత, తెదేపా అధినేత చంద్రబాబు.. ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌ 

12/16
గన్నవరం విమానాశ్రయంలో సినీనటుడు రజనీకాంత్‌కు స్వాగతం పలుకుతున్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ తదితరులు

13/16
వేసవి సెలవులు ముగిశాయి.. విద్యార్థులు ఆటలకు బైబై చెప్పి.. ఇక పాఠశాలలకు పరుగెత్తనున్నారు. బుధవారం నుంచి బడులు తెరుచుకోనుండడంతో హైదరాబాద్‌ కోఠిలోని బుక్‌ స్టాళ్లు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కిక్కిరిసిపోయాయి.

14/16
ఏపీలో ఈనెల 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నందున బడులకు చిక్కీలు, కోడిగుడ్లు, రాగిపిండి సరఫరా చేస్తున్నారు. గతంలో చిక్కీలపై జగన్‌ ఫొటో కవర్లను ఏర్పాటుచేయగా, ఇప్పుడు వాటిని తొలగించి ప్రభుత్వ రాజముద్రతో కవర్లు రూపొందించారు.

15/16
కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడికి స్వాగతం పలుకుతున్న తెదేపా శ్రేణులు 

16/16
చూడటానికి పచ్చని తివాచీ పరిచినట్లు కనిపిస్తున్న ఈ ప్రాంతం ఆదిలాబాద్‌ పట్టణ శివారులోనిది. చందా వాగులో కొన్ని కి.మీ. మేర గుర్రపు డెక్క పెరిగి ఇలా కనిపిస్తోంది. చెక్‌డ్యాంను సైతం పూర్తిగా కమ్మేసింది. 

మరిన్ని