News in images: చిత్రం చెప్పే విశేషాలు (13-06-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 13 Jun 2024 03:53 IST
1/10
హైదరాబాద్‌: ఇన్ని రోజులు ఇళ్లలో ఆటపాటలతో గడిపిన విద్యార్థులు పాఠశాలల పునఃప్రారంభంతో తరగతి గదుల్లో అడుగుపెట్టారు. దీంతో అన్ని బడుల్లో సందడి నెలకొంది. చాలారోజుల తరువాత స్నేహితులు కలవడంతో ఒకరికొకరి పలకరింపులతో పిల్లల మోముల్లో ఆనందం కనిపించింది.

2/10
హైదరాబాద్‌: రంగురంగుల పెయింటింగ్స్, చూడముచ్చటైన ఛాయాచిత్రాలు బుధవారం సాయంత్రం మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో కొలువుదీరాయి. చిత్రకారులు తమ మదిలో మెదిలిన భావాలను కాన్వాస్‌పై అందంగా ఆవిష్కరిస్తే... ఛాయాచిత్రకారులు చూడముచ్చటైన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు.

3/10
మెదక్‌: ఉత్సాహంగా, సందడిగా అంతటా బుధవారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఉదయం ప్రార్థన, జాతీయగీతాలాపన, ప్రతిజ్ఞ చేసి విద్యార్థులు కొత్త విద్యాసంవత్సరాన్ని సంతోషంగా ప్రారంభించారు.

4/10
ఆదిలాబాద్‌: సెలవులకు టాటా చెబుతూ విద్యార్థులు బుధవారం బడిబాట పట్టారు. ఉదయం స్వాగత తోరణాలు కట్టి.. ముగ్గులు వేశారు. ప్రైవేటు బడుల్లో సెల్ఫీపాయింట్లు పెట్టడంతో స్వీయచిత్రాలు తీసుకుని తొలిరోజును జ్ఞాపకంగా పదిలపర్చుకున్నారు.

5/10
ఆదిలాబాద్‌ జిల్లా తాంసి మండలం కప్పర్ల జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేశారు. కొత్తగా చేరిన పిల్లలకు ఉపాధ్యాయులు, పదో తరగతి విద్యార్థులు హారతులు, డప్పు వాయిద్యాలతో పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

6/10
హైదరాబాద్‌: పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో బుధవారం ఉదయమే విద్యార్థుల సందడి మొదలైంది. ‘బడి బాట’లో భాగంగా పరిగి మండల పరిధిలోని ఇబ్రహీంపూర్‌ తండాలో చిన్నారులు ‘చిరు’నవ్వులు చిందిస్తూ బడిమెట్లు ఎక్కారు.

7/10
గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు పలు దుకాణాల వద్ద పాఠశాల బ్యాగులు, ఏకరూప (యూనిఫాం) దుస్తులు, పుస్తకాలు కొనుగోలు చేస్తూ కనిపించారు. కర్నూలు నగరంలో ఆయా దుకాణాల వద్ద పిల్లల సందడి కనిపించింది.

8/10
విశాఖపట్నం: కొత్తపల్లి జలపాతంలో పర్యటకులు బుధవారం సందడి చేశారు. పాడేరు మోదకొండమ్మ జాతరకు వచ్చిన పలువురు భక్తులు సరదాగా స్నానాలు చేస్తూ కేరింతలు కొట్టారు.

9/10
అనంతపురం: సత్యసాయి మహాసమాధి దర్శనార్థం హరియాణ, చండీఘడ్‌ భక్తులు పర్తియాత్రతో పుట్టపర్తి వచ్చారు. బుధవారం సాయికుల్వంత్‌ మందిరంలోని సత్యసాయి సమాధి చెంత సాంస్కృతిక సంప్రదాయ కార్యక్రమాలు భక్తులను అమితంగా ఆకట్టుకుంది.

10/10
తమిళనాడు: కుట్రాలంలో పర్యాటకుల సందడి నెలకొంది. బుధవారం ఉదయం తెన్‌కాశి, పశ్చిమ కనుమల ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై చినుకులు కురుస్తుండటంతో పాటు చల్లనిగాలులు వీయడంతో సందర్శకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని