News in images: చిత్రం చెప్పే విశేషాలు (14-06-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 14 Jun 2024 14:45 IST
1/18
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజులకొల్లివలస సంగమేశ్వరస్వామి కొండ వద్ద సైకత శిల్పి గేదెల హరికృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తీర్చిదిద్దిన సైకత శిల్పం చూపరులను ఆకట్టుకుంటోంది.

2/18
వికారాబాద్‌ జిల్లా దోమ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో మిషన్‌ భగీరథ పైపునకు రంధ్రం పడింది. నీరు వృథాగా ప్రధాన వీధిలోని దారి గుండా పారుతోంది. పాదచారులకు ఇబ్బందిగా మారింది. 

3/18
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో జాతీయ రహదారి పక్కన గల చెరువులో నిండుగా నీళ్లు చేరాయి. కొన్నేళ్లుగా చెరువు ఎండిపోవడం లేదు. దీంతో చెరువులో ఏపుగా పెరిగిన తుమ్మ చెట్లు తడిసి ఇలా మోడై కనిపిస్తున్నాయి.

4/18
జీవాల పోషణకు ఎల్లలుదాటి రాజస్థాన్‌ నుంచి వలస వచ్చిన కొన్ని కుటుంబాలు ఆదిలాబాద్‌ జిల్లా సారంగాపూర్‌ మండలంలోని పలు ప్రాంతాల్లో స్థిరపడ్డారు.  దిలావర్‌పూర్‌ సమీపంలో బహుదూరపు బాటసారుల జీవన చిత్రాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది. 

5/18
విశాఖ తీరంలో సాగర్‌ నగర్‌ వద్ద ఇసుక తిన్నెలపై ఆకృతులు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. సాగరంపైనుంచి వచ్చే గాలులకు ఇసుక రేణువులు అందమైన రూపు సంతరించుకుంటున్నాయి. వీటిని చూసిన సందర్శకులు ఔరా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

6/18
నల్గొండ: మధ్యాహ్నం వేళ కురిసిన జోరువానతో ఆలయ అష్టభుజి మండపం ప్రాకారాలు, రాజగోపురాలతో పాటు దైవారాధనల్లో పాల్గొనేందుకు వచ్చిన భక్తజనులు తడిసిపోయారు. వాన నీటిలో తడిసిన కృష్ణశిల రూపాలు భక్తజనులను ఆకట్టుకున్నాయి.

7/18
గుంటూరు: సచివాలయంలోని ఉద్యానవనంలో పచ్చదనం పరుచుకుంది. ప్రసుత్తం అక్కడ చక్కని నీడనిచ్చే చెట్లు, పూల మొక్కలు, పచ్చటి లాన్‌ను సుందరంగా తయారు చేయించారు. వాటర్‌ ఫౌంటెయిన్‌ను పునరుద్ధరించారు. రాత్రిళ్లు అందంగా కనిపించేలా విద్యుత్తు దీపాలు కూడా అమర్చారు.

8/18
ఆదిలాబాద్‌: సెలవుల్లో ఇంటిపట్టున ఉన్న యువతరం సొంతచేలలో కొందరు, బంధువుల చేలల్లో మరికొందరు పనుల్లో నిమగ్నమై కనిపించారు. భీంపూర్‌ శివారులో ఓ పంటచేనులో యువత పత్తి విత్తనాలు విత్తుతుండగా తీసిన చిత్రమిది.

9/18
కరీంనగర్‌ పద్మనగర్‌లోని పారమిత హెరిటెజ్‌ పాఠశాలలో పునఃప్రారంభ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆటలు, పాటలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి.

10/18
అనంతపురం: సత్యసాయిని కీర్తిస్తూ ఆలపించిన భక్తిగీతాలు భక్తులను ఆకట్టుకున్నాయి. సాయంత్రం బాలవికాస్‌ చిన్నారులు ‘‘హరితుమ్‌ అనా హరియాణ’’ పేరుతో నృత్య నాటిక ప్రదర్శించారు.

11/18
హైదరాబాద్‌: నవోదయ విద్యాలయాల విద్యార్థుల పారా స్పోర్ట్స్‌ శిక్షణ శిబిరానికి గురువారం సినీ నటి రెజీనా హాజరై సందడి చేశారు. గోపన్‌పల్లిలోని విద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ఇలా తుపాకీ గురిపెట్టి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు.

12/18
హైదరాబాద్‌: హిమాయత్‌నగర్‌ లిబర్టీలోని తితిదే వేంకటేశ్వరస్వామివారి దేవాలయ 19వ బ్రహ్మోత్సవాలు కనులపండువగా నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి ఏకరూప దుస్తుల్లో మహిళల కోలాటం, భక్తుల గోవింద నామస్మరణతో పురవీధులు మారుమోగాయి.

13/18
నెల్లూరు: ఇందుకూరుపేట మండలం గంగపట్నం చాముండేశ్వరీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి అంకురార్పణ, ధ్వజారోహణతో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

14/18
మెదక్‌: సిర్గాపూర్‌ మండలం కడ్పల్‌కు చెందిన గూడూరి ఆగమప్ప దివ్యాంగుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన మనవడిని ఎత్తుకున్న చిత్రాన్ని పెన్సిల్‌తో చక్కగా గీశాడు. గురువారం హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి.. చిత్రపటాన్ని బహూకరించారు.

15/18
కర్నూలు: జిల్లాలో పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు మొదటి రోజు ఆనందంగా పరుగులు పెట్టారు. నాడు- నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన పనులు పూర్తికాకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు పడ్డారు.

16/18
హైదరాబాద్‌: బక్రీద్‌ పండగకు నగరంలో  పొట్టేళ్ల అమ్మకం జోరందుకుంది. గురువారం టోలిచౌకి నానాల్‌నగర్‌లో రూ.1.10లక్షలకు పొట్టేలు అమ్మకానికి వచ్చింది.

17/18
హైదరాబాద్‌: ఎర్రమంజిల్‌లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని ఈ చింతచెట్టుకు సుమారు 150 ఏళ్ల చరిత్ర ఉంది. నిమ్స్‌ అభివృద్ధి పనుల్లో భాగంగా పాఠశాలను మరోచోటుకు తరలించారు. పూర్వ విద్యార్థుల అభ్యర్థనతో కొత్తగా నిర్మిస్తున్న బడి ఆవరణలోకి దీనిని ట్రాన్స్‌ రీలోకేషన్‌ చేసి జీవం పోస్తున్నారు.

18/18
శ్రీకాకుళం: వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి, డోకులపాడు, మంచినీళ్లుపేట, నువ్వలరేవు, మెట్టూరు ప్రాంతాల్లో గురువారం తీరం నుంచి సుమారు అర కి.మీ. పొడవునా కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఇసుక దిబ్బలు కోతకు గురవుతుండటంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని