News in images: చిత్రం చెప్పే విశేషాలు (16-06-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 16 Jun 2024 03:28 IST
1/10
హైదరాబాద్‌: శనివారం ఆకాశం మేఘావృతం అయ్యింది. వెండి మబ్బులు కమ్ముకున్నాయి. వాటిల్లోంచి సూర్య కిరణాలు సచివాలయంపై పడటంతో ఇలా మెరిసిపోతూ కనిపించింది.

2/10
హైదరాబాద్‌: దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శనివారం జరిగిన కంబైౖన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ సందడిగా సాగింది. శిక్షణ పూర్తి చేసుకున్న యువత వాయుసేనలో చేరడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

3/10
అమరావతి: ముంబయి నుంచి శనివారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఎయిరిండియా సర్వీసుకు వాటర్‌ గన్‌లతో స్వాగతం పలికారిలా..

4/10
కడప నగరంలో శనివారం సినీనటి నిధి అగర్వాల్‌ సందడి చేశారు. స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఏర్పాటు చేసిన జోస్‌ ఆలుక్కాస్‌ బంగారు ఆభరణాల షోరూంను ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవితో కలిసి ప్రారంభించారు.

5/10
అనంతపురం: సత్యసాయి మహా సమాధి దర్శనార్థం మధ్యప్రదేశ్‌ రాష్ట్ర భక్తులు శనివారం సాయికుల్వంత్‌ మందిరంలో వేదపఠనంతో వివిధ కార్యక్రమాలు ప్రారంభించారు. సాయంత్రం బాలవికాస్‌ చిన్నారులు ‘భజ గోవిందం.. సాయి సందేశం’ పేరుతో నృత్య నాటికను అద్భుతంగా ప్రదర్శించారు.

6/10
నెల్లూరు: బ్రహ్మోత్సవాల్లో భాగంగా గంగపట్నం చాముండేశ్వరీ అమ్మవారికి శనివారం రాత్రి గజవాహన సేవ నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు.. అమ్మవారిని గజ వాహనంపై కొలువుదీర్చి.. ఊరేగింపు నిర్వహించారు.

7/10
హైదరాబాద్‌: హిమాయత్‌నగర్‌లో వేంకటేశ్వస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతుండటం, వారాంతపు సెలవులు కావడంతో నగరంలో పలుచోట్ల ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది.

8/10
నల్గొండ: మండలంలోని గుడిమల్కాపురంలో అరుదుగా కనిపించే బార్న్‌ గుడ్లగూబ శనివారం ప్రత్యక్షమైంది. సాధారణంగా గుడ్లగూబల కంటే ఇది కాస్త భిన్నంగా తెల్లగా కనిపించడంతో స్థానికులు వింతగా చూసి ఉంటారని మండల పశు వైద్యాధికారి మధు పేర్కొన్నారు.

9/10
నల్గొండ: యాదాద్రి క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి.. ఆలయం వెలుపల ఉన్న హనుమాన్‌ ప్రతిమపై శనివారం ఓ వానరం ఇలా ప్రేమతో సేద తీరుతూ కనిపించింది. తండ్రిపై బిడ్డ కూర్చొని తిలకిస్తున్నట్లుగా దృశ్యం ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

10/10
హైదరాబాద్‌: బక్రీద్‌ సందర్భంగా పాతబస్తీలో మేకపోతుల అమ్మకాలు జొరందుకున్నాయి. భిన్నరకాలు.. అత్యంత విలువైనవి విక్రయానికి వచ్చాయి.

Tags :

మరిన్ని