News in images: చిత్రం చెప్పే విశేషాలు (17-06-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 17 Jun 2024 14:55 IST
1/22
రాజస్థాన్‌ నుంచి ఉపాధి కోసం వలస వచ్చిన యువకుడు వీధుల్లో తిరుగుతూ కుర్చీలు విక్రయిస్తున్నాడు. తలపై 11, భుజానికి 3 కుర్చీలతో హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో దారిలో ఇలా కనిపించాడు. రాజస్థాన్‌ నుంచి ఉపాధి కోసం వలస వచ్చిన యువకుడు వీధుల్లో తిరుగుతూ కుర్చీలు విక్రయిస్తున్నాడు. తలపై 11, భుజానికి 3 కుర్చీలతో హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో దారిలో ఇలా కనిపించాడు.
2/22
రైలుపై ప్రయాణికులు వెళ్లడం సహజం. గూడ్స్‌ రైలుపై బొగ్గు, ఇంధనం, సిమెంట్, కంకర తదితర సామగ్రిని తరలిస్తుంటారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో చక్రాల బండిపై చక్రాల మాదిరిగా ఉన్న సామగ్రిని నిజామాబాద్‌ వైపు తీసుకెళ్లారు. ఈ చిత్రాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.  

3/22
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పెద్దపల్లి గ్రామానికి విద్యుత్తు సౌకర్యం లేదు. సింగరేణి అక్కడక్కడా సోలార్‌ విద్యుత్తు దీపాలు అమర్చింది. ఇళ్లలో విద్యుత్తు సౌకర్యం లేకపోవడంతో చరవాణిలకు ఛార్జింగ్‌ పెట్టేందుకు గ్రామవాసులు ఇలా ఇంటి పైకప్పుపై సౌరఫలకాలు ఏర్పాటు చేసుకున్నారు.

4/22
వేసవికాలంలోనే మనకు కనిపించే మే పుష్పం జూన్‌ నెలలోనూ విరబూస్తోంది. సాధారణంగా ఒకటి రెండే పూస్తాయి. కానీ  ఆదిలాబాద్‌ పట్టణం ద్వారకానగర్‌లో నివాసముండే విశ్రాంత ఎంఈఓ కారెంగుల దామోదర్‌ నివాసంలో ఇలా ఆరు పుష్పాలు పూసి అందరిని ఆకట్టుకుంటున్నాయి. 

5/22
తమిళనాడు రాష్ట్రం  కన్యాకుమారిలో కొన్ని రోజులుగా సముద్రం కల్లోలంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో  సంగుతురై సముద్రతీరంలో రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.

6/22
వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపహాడ్‌ గ్రామానికి చెందిన నాగోతు బాలజోజి మాత్రం.. బాపూజీపై తనకున్న అభిమానాన్ని చాటుకునేలా ఇంటి ప్రహరీపై రూ.30 వేల వ్యయంతో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటుచేసి ఆదర్శంగా నిలిచారు.

7/22
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం జానంపల్లి గ్రామంలోని రైతు రామకృష్ణ పొలంలో అతి పెద్ద పుట్టగొడుగు లభ్యమైంది. 5 కిలోల బరువు, రెండు అడుగుల వెడల్పుతో  ఆకట్టుకుంది.  

8/22
విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని సాంఘిక సంక్షేమశాఖ బాలుర వసతి గృహ కార్యాలయ భవనం ఇది. 15 ఏళ్ల క్రితం పిల్లలను ఆకర్షించేలా రైలింజిన్‌ నమూనాలో నిర్మించారు. కొన్ని రోజులుగా పూర్తిగా శిథిలమైంది. ఇటీవల ఈ భవనాన్ని ఆధునికీకరించి రంగులు వేయడంతో ఇలా కళకళలాడుతోంది.

9/22
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన దస్తగిరి.. దివ్యాండుగైన తన కుమారుడిని తీసుకుని హైదరాబాద్‌లోని కింగ్‌కోఠిలో నారాయణ సేవా సంస్థాన్‌ నిర్వహించిన ‘కృత్రిమ అవయవాల’ శిబిరానికి కుమారుడిని తీసుకొచ్చాడు. అక్కడ కృత్రిమ కాళ్లు పెట్టించి ఇలా చేతులపై తీసుకెళ్తున్న చిత్రం ‘ఈనాడు’కు కనిపించింది. 

10/22
నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం యంచలోని పురాతన మల్లయ్య ఆలయం వద్ద ఉన్న ఏళ్లనాటి మర్రి చెట్టుకు ఓ ప్రత్యేకత ఉంది. వందేళ్ల కిందట రాళ్ల కుప్పల మధ్య నుంచి పెరిగిన మొక్క ఇప్పుడు మహా వృక్షంగా మారింది. కాండం మధ్యలో పదుల సంఖ్యలో ఉన్న రాళ్లు ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి.

11/22
హైదరాబాద్‌: గతేడాది స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా మణికొండ పురపాలిక పరిధిలోని అలకాపురి కాలనీలో ఫ్రీడం పార్కు నిర్మించారు. స్వరాజ్య సంగ్రామ స్ఫూర్తిని భావితరాలకు అందించేలా బొమ్మలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఉప్పు సత్యాగ్రహంలో గాంధీజీ వెంట నడుస్తున్న విగ్రహం మహనీయుడిని స్మరణకు తెస్తోంది.

12/22
మహబూబ్‌నగర్‌: కష్ణానది తీరం సోమశిలలో మత్స్యకారుల సందడి నెలకొంది. నీటి నిల్వ తగ్గడంతో జాలరులు పుట్టీల్లో తిరుగుతూ కృష్ణమ్మ ఒడిలో చేపలు వేటాడుతున్నారు. పర్యాటక ప్రాంతంలో శ్రమైక జీవన సౌందర్యం ఉట్టిపడుతున్న దృశ్యాలను ‘ఈనాడు’ క్లిక్‌ మనిపించింది.

13/22
హైదరాబాద్‌: శనివారం కోట్‌పల్లి ప్రాజెక్టులో బోటింగ్‌ ప్రారంభించి సందర్శకులను అనుమతించారు. యువత, పిల్లల కేరింతలతో ప్రాజెక్టు పరిసరాల్లో ఆదివారం ఉదయం నుంచే సందడి వాతావరణం నెలకొంది.

14/22
నెల్లూరు: జిల్లాలోని మైపాడు, కొత్తకోడూరు బీచ్‌లు ఆదివారం పర్యాటకులతో సందడిగా మారాయి. రెండు రోజుల పాటు సెలవులు రావడంతో జిల్లాతో పాటు పక్క జిల్లాల నుంచి పర్యాటకులు పెద్దఎత్తున తరలివచ్చారు. సముద్రంలో మునుగుతూ ఇసుకతో గూడు కడుతూ కన్పించారు.

15/22
చిత్తూరు: మండల పరిధిలోని దాసార్లపల్లిలో ఆదివారం ఓ ప్రైవేట్‌ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్‌ రేసింగ్‌ చూపరులను అలరించింది. పోటీల్లో ప్రముఖ సంస్థలకు చెందిన బైక్‌ రేసర్లు పాల్గొన్నారు.

16/22
నల్గొండ: నేరేడుచర్ల మండలం దాచారంలోని శ్రీదేవి, భూదేవీ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో 16వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. బాదం, జీడిపప్పులు, పూలతో స్వామి, అమ్మవార్ల విగ్రహాలకు జరిపిన ప్రత్యేక అలంకరణ ఆకట్టుకుంది.

17/22
నెల్లూరు: ప్రముఖ పుణ్యక్షేత్రమైన గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం అమ్మవారికి చప్పర ఉత్సవం వేడుకగా జరిగింది. రాత్రికి అమ్మవారు సింహ వాహనంపై కొలువుదీరి గ్రామంలో ఊరేగారు.

18/22
ప్రకాశం: ఒంగోలు నగరంలో ఆదివారం హనుమాన్‌ శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సంతపేటలోని వీరాంజనేయస్వామి దేవస్థానం నుంచి ప్రారంభమైన హనుమాన్‌ యాత్ర.. నాటు బాబూరావు పార్క్, కర్నూలు రోడ్డు మీదుగా కేశవస్వామి పేట ఆలయం వరకు కొనసాగింది.

19/22
హైదరాబాద్‌: బంజారాహిల్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ దంపతులు పవన్, ఝాన్సీల కుమార్తె ఆకాంక్ష చౌదరి భరతనాట్యంలో ఆరంగేట్రం చేసింది. తారామతి-బారాదరిలో నృత్య ప్రదర్శనతో ఆహుతులను అలరించింది.

20/22
హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 45లోని హాలో పబ్‌లో ఫ్యాషన్‌ డిజైనర్‌ రెనీ ఏర్పాటు చేసిన ఫ్యాషన్‌ ప్రదర్శనలో హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్, ఓక్రిడ్జ్‌ స్కూల్‌ విద్యార్థులు పాల్గొన్నారు. దర్శకుడు సుకుమార్‌ కుమార్తె సుకృతి ర్యాంప్‌పై ఆకట్టుకుంది.

21/22
నిజామాబాద్‌: కామారెడ్డి జిల్లా కేంద్రంలో చక్రాల బండిపై చక్రాల మాదిరిగా ఉన్న సామగ్రిని నిజామాబాద్‌ వైపు తీసుకెళ్లారు. అటువైపుగా వెళ్తున్నవారు ఆ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించారు. ఈ చిత్రాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.

22/22
హైదరాబాద్‌: అత్యాధునిక కెమెరాలతో.. చుట్టూ ఉన్న దారులన్నింటినీ చిత్రీకరిస్తూ భూమార్గాన్ని సర్వే చేస్తున్న ఈ వాహనం బాచుపల్లిలో కనిపించింది. భారీ కెమెరాలతో ఉన్న ఈ వాహనం కాలనీల్లో తిరుగుతుంటే జనం ఆసక్తిగా తిలకిస్తున్నారు.

Tags :

మరిన్ని