News in images: చిత్రం చెప్పే విశేషాలు (18-06-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 18 Jun 2024 03:30 IST
1/12
అమరావతి: మసీదుల్లో సోమవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రబోధకులు బక్రీద్‌ విశిష్టతను.. సేవాభావం, త్యాగనిరతి ఆవశ్యకతను వివరించారు. ముస్లిం సోదరులు ప్రత్యేక నమాజులో పాల్గొని.. అనంతరం ఒకరినొకరు  శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

2/12
హైదరాబాద్‌: బక్రీద్‌ సందర్భంగా సోమవారం చార్మినార్‌ మక్కా మసీదులో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. దారుల్‌షిఫా వద్ద ప్రార్థనలు చేయడానికి వచ్చిన పిల్లలు పావురాలతో ఆడుకుంటూ కనిపించారు.

3/12
విజయనగరంలోని జామియా, చోటా, చిన్న మసీద్, డక్కిన మసీద్, బాబామెట్టలోని హజరత్‌ దర్గా తదితర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక ప్రసంగాలు సాగాయి. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.

4/12
శ్రీకాకుళం: గార మండలం శ్రీకూర్మంలో గ్రామ దేవత మోహినీ భద్రాంబిక అమ్మవారి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండు రోజులుగా గ్రామంలో సందడి నెలకొంది. గ్రామ శివారులోని యాత్రా స్థలంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో చిన్నారులను ఆకట్టుకుంటోంది.

5/12
తూర్పుగోదావరి: వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలోని వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవం పురస్కరించుకుని సోమవారం స్వామివారిని నవనీత కృష్ణుడిగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.

6/12
నెల్లూరు: గంగపట్నం చాముండేశ్వరీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం చప్పరోత్సవం నిర్వహించగా- రాత్రి పులివాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

7/12
తూర్పుగోదావరి: దివ్య మనోహరమూర్తిని చూసి నింగీనేలా మురిసింది. అప్పనపల్లిలో స్వామివారి కల్యాణ వేడుక సోమవారం రమణీయంగా సాగింది. బాలబాలాజీస్వామి ఉభయ దేవేరులను పరిణయమాడిన కమనీయ ఘట్టాన్ని భక్తులు కనులనిండుగా వీక్షించారు.

8/12
మెదక్‌: సంగారెడ్డి పట్టణం శ్రీనగర్‌లోని శ్రీక్షేత్రంలో స్వాతి నక్షత్ర వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. లక్ష్మీనర్సింహస్వామిలకు పంచామృతాలతో అభిషేకం చేసి.. వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం కల్యాణోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు.

9/12
హైదరాబాద్‌: సోమవారం సాయంత్రం.. వర్షం కురిసిన వేళ.. రహదారిపై వాన నీటిలో కనిపిస్తున్న మోజాంజాహీ మార్కెట్‌ ప్రతిబింబం.

10/12
విశాఖపట్నం: పూడిమడక తీరంలో మత్స్యకారుల పంట పండింది. 60 రోజుల విరామం తర్వాత సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు సోమవారం చేపలతో తిరిగొచ్చారు. చేపల కొనుగోలు, విక్రయాలతో ఈ ప్రాంతం కళకళలాడింది.

11/12
తూర్పుగోదావరి: కండ్రిక గ్రామంలోని పంటబోదెలో మూడు అడుగుల పొడవున్న 12 కేజీల బరువుగల వాలుగ చేప రైతు రామ్మూర్తి చేతికి సోమవారం చిక్కింది. దీని విలువ సుమారు రూ. 1,200 ఉంటుందని తెలిపారు.

12/12
ఆదిలాబాద్‌ పట్టణంలోని రైల్వే నివాస గృహాల సముదాయంలో ఆ శాఖ అధికారులు పెద్ద వృక్షాలను ఏ మాత్రం కొట్టేయకుండా రక్షణ చర్యలు చేపడుతున్నారు. పలుచోట్ల రక్షణ గోడలు నిర్మిస్తున్నారు. గోడలు కడుతున్న సమయంలో మధ్యలో చెట్లు వచ్చినా వాటిని తప్పించి నిర్మాణం చేపడుతున్నారు.

Tags :

మరిన్ని