News in images: చిత్రం చెప్పే విశేషాలు (19-06-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 19 Jun 2024 14:59 IST
1/24
కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం సంగమేశ్వరం సమీపంలో కృష్ణా నదిలో ఇప్పుడిప్పుడే వరదనీరు చేరుతోంది. సమీప ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు నది చెంతనే వలలు సరిచేసుకుంటూ కనిపించారు. 

2/24
ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండి మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కుంటాల జలపాతం వద్ద నీరు జాలువారుతోంది. అయితే ఆ నీటితోపాటు చిన్నా పెద్దా చేపలు సైతం కొట్టుకుని వస్తున్నాయి. 

3/24
ఇటీవల కురిసిన  వర్షాలకు వైయస్సార్‌ జిల్లా జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామం చుట్టూ నీరు చేరింది. వరద నీటి మధ్యలో  గ్రామం ఇలా కనిపిస్తోంది. 

4/24
నంద్యాల జిల్లా సప్తనదుల సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో సంగమేశ్వరం ఆలయం సమీపంలో కిలోమీటర్ల మేర గుర్రపుడెక్క విస్తరించింది. నదిలో ఎటుచూసినా గుర్రపుడెక్క పెరిగిపోయింది. దీంతో బోట్లు ముందుకు సాగడం లేదు. 

5/24
నెల్లూరు ట్రంకురోడ్ గాంధీ బొమ్మ శివాజీ సెంటర్‌లో  హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహానికి  పూలమాలలు వేసి  నివాళులర్పించారు.

6/24
ప్రతికూల వాతావరణం టమాటా ధరను సామాన్యుడికి అందనంత ఎత్తుకు తీసుకెళ్లింది. పది రోజుల కిందట కిలో రూ.40 ఉన్న ధర ఒక్కసారిగా ఎగబాకింది. నిన్నమొన్నటి వరకు రూ.80 ఉండగా నిజామాబాద్‌లో రూ.వందకు చేరింది.

7/24
కారులో జిరాక్స్‌ యంత్రం నిర్వహిస్తున్న ఇతని పేరు కోలా నర్సింహారావు. చదివింది బీకాం. తల్లి నాగమణితో కలిసి ఖమ్మం నగరంలోని సుందరయ్యనగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. బ్యాటరీల సాయంతో జిరాక్స్‌ యంత్రం, ప్రింటర్, ల్యాప్‌టాప్‌ పనిచేసేలా చూసుకుంటున్నారు. 

8/24
నిర్మల్‌ జిల్లా కడెం మండలం ఉడుంపూర్‌ రేంజ్‌ పరిధిలోని పెద్దవాగు పరిసరాల్లో అటవీ అధికారులు అరుదైన జాతి రకం కప్పను గుర్తించారు. కవ్వాల్‌ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో ఈ కప్ప కనిపించడంతో ఫొటోలు తీశారు. 

9/24
కాకినాడ సముద్రతీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలకు మంగళవారం భారీ చేపలు చిక్కాయి. అందులో కొమ్ముకోణెం, నెమలికోణెం తదితర రకాలు ఉన్నాయి. సుమారు 300 కేజీల బరువున్న కొమ్ముకోణెం చేపను ఒడ్డుకు చేర్చేందుకు మత్స్యకారులు శ్రమించాల్సి వచ్చింది

10/24
ఖమ్మం: ప్రకృతి సోయగంతో.. చర్ల మండలంలోని తాలిపేరు జలాశయం చూపరులను ఇట్టే ఆకట్టుకొంటోంది. జలాశయం వద్ద మంగళవారం సాయంత్రం వేళ ఆవిష్కృతమైన ఈ చూడముచ్చటైన దృశ్యం ఎంతగానో కనువిందు చేసింది.

11/24
అమరావతి: విజయవాడ పిన్నమనేని పాలి క్లినిక్‌ రోడ్డులోని సమన కాలేజ్‌ ఆఫ్‌ డిజైన్‌ స్టడీస్‌లో మంగళవారం విద్యార్థులు నిర్వహించిన ఫ్యాషన్‌ షో ఆకట్టుకుంది. ర్యాంప్‌పై హోయలొలికించారు. సరికొత్త డిజైన్‌ దుస్తులు ధరించి ర్యాంప్‌ వాక్‌ చేసి సందడి చేశారు.

12/24
కరీంనగర్‌: పెద్దపల్లి పట్టణంలోని మంథని ప్లై ఓవర్‌ చౌరస్తాలో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లకు చెందిన చిరు వ్యాపారులు ఇలా బొమ్మ జీపులను రహదారి పక్కన ఉంచి విక్రయిస్తున్నారు.

13/24
హైదరాబాద్‌: ఈనెల 21న యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఆయుష్‌ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం  నెక్లెస్‌ రోడ్డులో అవగాహన నడక నిర్వహించారు. విద్యార్థుల యోగాసనాలు ఆకట్టుకున్నాయి.

14/24
మెదక్‌: సిద్దిపేట జిల్లా ములుగులో రాజీవ్‌ రహదారికి ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో పచ్చందాల మధ్య ఆహ్లాద వాతావరణంలో అటవీ కళాశాల పరిశోధన కేంద్రం వెలిసింది. ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులను ఇట్టే ఆకట్టుకుంటోంది.

15/24
నిజామాబాద్‌ జిల్లా కేంద్రం గంగాస్థాన్‌-2లో ఇళ్ల మధ్య ఉన్న ఓ చెట్టు ఆకులన్నీ రాలిపోయి మోడువారింది. ఆ ఎండిన చెట్టుపైనే పిచ్చుకలు ఇలా గూళ్లు కట్టుకున్నాయి. ఆ ప్రదేశం ఉదయం, సాయంత్రం పక్షుల కిలకిలారావాలతో సందడిగా ప్రేమికులను ఆహ్లాదపరుస్తోంది.

16/24
చిత్తూరు: శ్రీపద్మావతీ అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో రెండోరోజు మంగళవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీసుందరరాజస్వామి తెప్పపై ఊరేగారు. సాయంత్రం అలంకార శోభితుడైన స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి పద్మసరోవరంలో మూడు పర్యాయాలు విహరించారు.

17/24
తమిళనాడు: మహాబలిపురంలోని ఉన్న శిల్పకళా మ్యూజియం సందర్శకులను ఆకట్టుకుంటోంది.ఆర్ట్‌ , కల్చర్‌ శాఖ తరఫున ప్రభుత్వ శిల్ప కళాశాల విద్యార్థులు చెక్కిన రాతి శిల్పాలు, కళాఖండాల గురించి తెలుసుకొనేలా ప్రభుత్వ మ్యూజియం ఏర్పాటు చేశారు. పల్లవులు, చోళరాజుల కాలంనాటి శిల్పాలు, కళాఖండాలు ఆకట్టుకుంటున్నాయి.

18/24
శ్రీకాకుళం నగరం చిన్నబజారు రహదారిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీవారిని పుష్పాలు, తులసీ దళాల మాలలతో అలంకరించారు.భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

19/24
నెల్లూరు: గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి అమ్మవారు హంస వాహనంపై కొలువుదీరారు. మేళతాళాల నడుమ బాణసంచా కాలుస్తూ గ్రామ పురవీధుల్లో అమ్మవారి గ్రామోత్సవం జరిగింది.

20/24
ప్రకాశం: పాత సింగరాయకొండలో కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సాయంత్రం... భక్తుల జయజయధ్వానాల మధ్య హంస వాహన సేవ కనులపండువగా సాగింది.

21/24
హైదరాబాద్‌: పాతబస్తీలోని చారిత్రక లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి గుడి బోనాలకు సిద్ధమవుతోంది. ఆలయానికి రంగులు వేసి ముస్తాబు చేస్తున్నారు.

22/24
మెదక్‌ పట్టణంలో మంగళవారం వీరితో సందడి నెలకొంది. పుస్తకాలు, అవసరమయ్యే సామగ్రిని కొనుగోలు చేసి, పిల్లలను తల్లిదండ్రులు వదిలివెళ్లారు.

23/24
మెదక్‌: కోతుల బెడదతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోకి ప్రవేశించి నిత్యావసరాలు చెల్లా చెదురు చేస్తున్నాయని వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే శివ్వంపేట మండలం పెద్ద గొట్టిముక్ల గ్రామంలో పెంకుటిల్లుపై సౌర కంచె ఏర్పాటు చేశారు.

24/24
హైదరాబాద్‌: ఉప్పల్‌ నల్లచెరువు.. పూర్తిగా గుర్రపు డెక్కతో నిండిపోయింది. మరోవైపు చుట్టుపక్కల పరిశ్రమల నుంచి రసాయన, కలుషిత నీరు చేరి విపరీతంగా దుర్గంధం వెలువడుతోంది. పరిసర ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Tags :

మరిన్ని