News in images: చిత్రం చెప్పే విశేషాలు (20-06-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 20 Jun 2024 11:44 IST
1/21
ఆంధ్రప్రదేశ్‌ పర్యటక, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న కందుల దుర్గేశ్‌కు అగ్ర కథానాయకుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ‘విశ్వంభర’ సెట్స్‌కు ఆయన వచ్చిన సందర్భంగా ఆ ఫొటోలను ఎక్స్‌ వేదికగా చిరు పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పర్యటక, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న కందుల దుర్గేశ్‌కు అగ్ర కథానాయకుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ‘విశ్వంభర’ సెట్స్‌కు ఆయన వచ్చిన సందర్భంగా ఆ ఫొటోలను ఎక్స్‌ వేదికగా చిరు పంచుకున్నారు.
2/21
ఉత్తర భారత దేశంతోపాటు ఈశాన్యం అగ్ని గుండాలుగా మారాయి. దిల్లీ, పంజాబ్, హరియాణా, చండీగఢ్, ఉత్తర్‌ ప్రదేశ్, ఉత్తర రాజస్థాన్‌ వేడితో ఉడికిపోతున్నాయి. తీవ్ర ఉక్కపోతతోపాటు నీటి కొరత ప్రజలను అల్లాడిస్తోంది. దిల్లీలోని చాణక్యపురిలో తాగునీటికోసం స్థానికులు ట్యాంకర్‌ను ఇలా చుట్టుముట్టారు.

3/21
ఈ ఫొటోలో కనిపిస్తున్న నాణెం జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామ శివారులోని పాటిగడ్డ మీద లభ్యమైంది. ఇక్ష్వాకుల కాలంలో ముద్రించిన ఈ నాణెంపై గుర్రం గుర్తుతోపాటు అర్ధవృత్తాకారంలో శివసేబకస అనే గుర్తు బ్రహ్మలిపిలో ఉందని చరిత్రకారుడు రత్నాకర్‌రెడ్డి తెలిపారు. 

4/21
అనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతిమడుగు గ్రామంలో రైతు సర్దానప్ప రెండెకరాల్లో టమాట సాగు చేశారు. పంటలో కలుపు మొక్కలు తొలగించడానికి డబ్బులేక.. ఎద్దులకు బాడుగ పెట్టలేక తన కుమారుడితోపాటు తమ్ముని కుమారుడి సాయంతో గుంటక లాగించి కలుపు మొక్కలు తొలగించారు. 

5/21
అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలం కల్లుదేవనహళ్లి హగరిలో చేతిపంపు అందనంత ఎత్తులో ఉంది. దీని చుట్టూ గతంలో ఇసుకను తోడేయడంతో పెద్ద గుంతలు పడ్డాయి. ఈక్రమంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు వేదవతి హగరి పొంగి ప్రవహించడంతో ఇసుక కొట్టుకుపోయింది. 

6/21
గుంటూరు జిల్లా తెనాలి టౌన్‌ పట్టణంలోని కవిరాజా పార్కు ఆవరణలో జలకాలాటలతో సందడి చేస్తున్న చిన్నారులను చూసి ఇక్కడేదో కొత్తగా ఈత కొలను నిర్మించారనుకుంటే పొరపాటే. ఇటీవల కురిసిన వర్షపు నీరు బయటకు పోయే మార్గం లేక ఉద్యానం ఆవరణ చెరువుగా మారింది.

7/21
తమిళనాడు: చెన్నైలో రెండు రోజులుగా రాత్రిపూట వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై కనిపించింది.

8/21
వరంగల్‌; వాజేడు మండలంలో మంగళవారం రాత్రి వర్షాలు కురవగా, చేరుతున్న వరద నీరు జాలువారుతూ జల సవ్వడి చేస్తోంది. ఎత్తైన రాళ్లపై నుంచి గుండంలో జాలువారుతున్న నీటిధారలు కనువిందు చేస్తున్నాయి.

9/21
కడప: వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె ఆనకట్టకు జలకళ సంతరించుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు పెన్నాలో కలుస్తుండటంతో ఆనకట్ట వద్ద పుష్కలంగా నీరు ప్రవహిస్తోంది. మరోపక్క ఆనకట్ట వద్ద పర్యాటకుల సందడి నెలకొంటోంది.

10/21
హైదరాబాద్‌: వినియోగదారులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఓ చిరు వ్యాపారి లంగర్‌హౌస్‌-నానల్‌నగర్‌ ప్రధాన రహదారి పక్కన ఇలా రెయిన్‌కోట్లు, గొడుగులను ఉంచి విక్రయిస్తూ కనిపించాడు.

11/21
హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ - పద్మశాలిపురం దారిలోని ప్రధాన రహదారిపై ఉన్న భారీ వృక్షమిది. రహదారి మధ్యలో ఉన్నా ఏళ్లుగా కాపాడటంతో ఇలా పచ్చదనాన్ని పంచుతూ బాటసారులకు కనువిందు చేస్తోంది.

12/21
మెదక్‌: యోగా దినోత్సవం పురస్కరించుకొని (జూన్‌ 21) హార్ట్‌ఫుల్‌నెస్‌ యోగా, ధ్యాన సంస్థ ఆధ్వర్యంలో సిద్దిపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం యోగాసనాలు సాధన చేయించారు.

13/21
హైదరాబాద్‌: బుధవారం చార్మినార్‌ వద్ద ఆయుష్‌ విభాగం, తెలంగాణ యోగా ఆధ్యయన షరిషత్‌ ఆధ్వర్యంలో యోగా నడక నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురి యోగాసనాలు ఆకట్టుకున్నాయి.

14/21
నెల్లూరు: గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో వైభవోపేతంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి అమ్మవారు పులి వాహనంపై కొలువుదీరారు. మేళతాళాల నడుమ గ్రామోత్సవం వైభవంగా జరిగింది.

15/21
నెల్లూరు: ఉదయగిరి బీసీ కాలనీ సమీపంలో స్వయంభూగా వెలిసిన సంతాన లక్ష్మి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. రాత్రి గ్రామోత్సవం కనుల పండువగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

16/21
విశాఖపట్నం: టమాటాను పోలి ఉన్న ఈ పండ్లు వెస్టిండియన్‌ చెర్రీస్‌. వీటిని బార్బడోస్‌ చెర్రీస్‌ అని కూడా అంటారు. చింతపల్లి ఉద్యాన పరిశోధనా కేంద్రం ఆవరణలో ఇవి ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

17/21
విశాఖపట్నం: ఈ చిత్రంలో ఎర్రని చిలుకలను తలపిస్తున్న ఇవి హెలికోనియం పుష్పాలు. చింతపల్లి ఉద్యాన పరిశోధనా కేంద్రంలోని క్షేత్రంలో ప్రయోగాత్మకంగా వీటిని పెంచుతున్నారు. శీతల వాతావరణంలో ఇవి పెరుగుతాయని శాస్త్రవేత్త డాక్టర్‌ శివకుమార్‌ తెలిపారు.

18/21
హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌-మైలార్‌దేవ్‌పల్లి మార్గ విస్తరణలో తొలగించిన చెట్లను వేరే ప్రాంతంలో నాటారు. అవి జీవం పోసుకొని ప్రాణ వాయువును అందించేలా ఎదుగుతున్నాయి...

19/21
ఆదిలాబాద్‌ జిల్లాలోని కుంటాల, పొచ్చర కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహించి జలపాతాలు జలకళ సంతరించుకున్నాయి. ఆ నీటితో పాటు చిన్నా, పెద్ద చేపలు సైతం కొట్టుకువస్తున్నాయి. చేపలను చూసి పర్యాటకులు ఆశ్చర్యంతో పాటు ఆనందపడుతున్నారు.

20/21
హైదరాబాద్‌: గొడుగు మాదిరి కనిపిస్తున్న టోపీలను ముంబయిలో కొని ఖమ్మంలో ఒక్కొక్కటి రూ.200 చొప్పున విక్రయిస్తున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్న సమయంలో, వర్షం కురుస్తున్నప్పుడు వీటిని ధరించటానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తారని ‘ఈనాడు’కు దిలీప్‌కుమార్‌ తెలిపారు.

21/21
నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలం మంచిప్ప గ్రామానికి చెందిన సోదరులు రాంరావు, ప్రకాశ్‌రావు, రమేశ్, బల్వంత్‌రావులకు పశువులంటే ప్రాణం. ఎద్దంటే వారికి మరింత ప్రేమ. కానీ, గుర్తు తెలియని వ్యక్తులు 2007 ఏప్రిల్‌ 5న ఆ ఎద్దుకు విషపుగులికలు ఇవ్వడంతో చనిపోయింది. దానిపై మమకారంతో పొలంలో విగ్రహం ఏర్పాటుచేసి వారానికోసారి పూజలు చేస్తున్నారు.

Tags :

మరిన్ని