News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2 (25-03-2023)

Updated : 25 Mar 2023 22:32 IST
1/38
రామ్‌చరణ్ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ చిత్రం (ఆర్‌సీ15.. వర్కింగ్‌ టైటిల్‌) తెరకెక్కుతోంది. మార్చి 27 రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా.. ఈరోజు షూటింగ్‌ సెట్‌లో చిత్రబృందం ఉత్సాహంగా చెర్రీ బర్త్‌డే వేడుక నిర్వహించారు. రామ్‌చరణ్ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ చిత్రం (ఆర్‌సీ15.. వర్కింగ్‌ టైటిల్‌) తెరకెక్కుతోంది. మార్చి 27 రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా.. ఈరోజు షూటింగ్‌ సెట్‌లో చిత్రబృందం ఉత్సాహంగా చెర్రీ బర్త్‌డే వేడుక నిర్వహించారు.
2/38
సమంత, దేవ్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్‌ తెరకెక్కించిన చిత్రం ‘శాకుంతలం’. ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రముఖ నటి గౌతమి ‘గౌతమీ మాత’ పాత్రను పోషించారు. దీనికి సంబంధించిన ఆమె ఫొటోను చిత్రబృందం ట్వీట్‌ చేసింది. సమంత, దేవ్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్‌ తెరకెక్కించిన చిత్రం ‘శాకుంతలం’. ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రముఖ నటి గౌతమి ‘గౌతమీ మాత’ పాత్రను పోషించారు. దీనికి సంబంధించిన ఆమె ఫొటోను చిత్రబృందం ట్వీట్‌ చేసింది.
3/38
విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో ‘పంజాబీ జానపద నృత్య కదంబం’ నిర్వహించారు. ఈ సందర్భంగా రూపీందర్‌ సింగ్‌ నృత్యబృందం ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో ‘పంజాబీ జానపద నృత్య కదంబం’ నిర్వహించారు. ఈ సందర్భంగా రూపీందర్‌ సింగ్‌ నృత్యబృందం ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.
4/38
నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దసరా’. కీర్తి సురేశ్‌ కథానాయిక. మార్చి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమాలోని వెన్నెల పాత్రకు సంబంధించిన ఓ ఫొటోను కీర్తి ట్విటర్‌లో పంచుకున్నారు. ‘ఈ చిత్రంలోని వెన్నెల పాత్ర నా కెరీర్‌లోనే ఒక ఛాలెంజింగ్‌ రోల్‌’ అని ఆమె ట్వీట్‌ చేశారు. నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దసరా’. కీర్తి సురేశ్‌ కథానాయిక. మార్చి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమాలోని వెన్నెల పాత్రకు సంబంధించిన ఓ ఫొటోను కీర్తి ట్విటర్‌లో పంచుకున్నారు. ‘ఈ చిత్రంలోని వెన్నెల పాత్ర నా కెరీర్‌లోనే ఒక ఛాలెంజింగ్‌ రోల్‌’ అని ఆమె ట్వీట్‌ చేశారు.
5/38
తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆరోరోజు శనివారం రాత్రి స్వామివారు గజవాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. గజరాజులు, వృషభాలు, అశ్వాల ముందు స్వామివారిని ఊరేగించారు.  భజన బృందాల కోలాటాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆరోరోజు శనివారం రాత్రి స్వామివారు గజవాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. గజరాజులు, వృషభాలు, అశ్వాల ముందు స్వామివారిని ఊరేగించారు. భజన బృందాల కోలాటాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
6/38
ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా విడుదలై నేటికి ఏడాది అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర షూటింగ్‌లో భాగంగా ఎన్టీఆర్‌, రాజమౌళి, రామ్‌చరణ్‌ సైకిల్‌పై రైడ్‌ చేసిన ఫొటోను చిత్రబృందం ట్వీటర్‌లో పంచుకుంది. ‘ఇది ఆర్‌ఆర్‌ఆర్‌ రైడ్‌’ అని ట్వీట్‌ చేసింది.  ఈ సినిమా  జాతీయ, అంతర్జాతీయ అవార్డులతో పాటు ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా విడుదలై నేటికి ఏడాది అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర షూటింగ్‌లో భాగంగా ఎన్టీఆర్‌, రాజమౌళి, రామ్‌చరణ్‌ సైకిల్‌పై రైడ్‌ చేసిన ఫొటోను చిత్రబృందం ట్వీటర్‌లో పంచుకుంది. ‘ఇది ఆర్‌ఆర్‌ఆర్‌ రైడ్‌’ అని ట్వీట్‌ చేసింది. ఈ సినిమా జాతీయ, అంతర్జాతీయ అవార్డులతో పాటు ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది.
7/38
విశాఖలో ‘సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ 2023’లో భాగంగా తెలుగు వారియర్స్‌, భోజ్‌పురి దబంగ్స్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన సినీనటులు వెంకటేశ్, శ్రీకాంత్‌, తేజశ్విని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. విశాఖలో ‘సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ 2023’లో భాగంగా తెలుగు వారియర్స్‌, భోజ్‌పురి దబంగ్స్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన సినీనటులు వెంకటేశ్, శ్రీకాంత్‌, తేజశ్విని క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
8/38
మైదానంలో తెలుగు వారియర్స్‌ ఆటగాళ్లు మైదానంలో తెలుగు వారియర్స్‌ ఆటగాళ్లు
9/38
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌ అవార్డు లభించిన విషయం తెలిసిందే. కీరవాణి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. ఈ సందర్భంగా.. కీరవాణికి సినీనటుడు అర్జున్‌ అభినందనలు తెలిపి సత్కరించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌ అవార్డు లభించిన విషయం తెలిసిందే. కీరవాణి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. ఈ సందర్భంగా.. కీరవాణికి సినీనటుడు అర్జున్‌ అభినందనలు తెలిపి సత్కరించారు.
10/38
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌  చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర సత్యసాయి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ యాత్రలో భాగంగా హీరో నారా రోహిత్‌.. లోకేశ్‌తో కలిసి నడిచి పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర సత్యసాయి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ యాత్రలో భాగంగా హీరో నారా రోహిత్‌.. లోకేశ్‌తో కలిసి నడిచి పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపారు.
11/38
పార్టీ శ్రేణులతో నారా రోహిత్‌ పార్టీ శ్రేణులతో నారా రోహిత్‌
12/38
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ గార్డెన్‌ సమీపంలో హుస్సేన్‌ సాగర్‌ తీరాన డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఏప్రిల్‌ 14 అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ గార్డెన్‌ సమీపంలో హుస్సేన్‌ సాగర్‌ తీరాన డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఏప్రిల్‌ 14 అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు అధికారులు తెలిపారు.
13/38
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ కూడలిలో మరో ఫ్లైఓవర్‌ ప్రారంభమైంది. హయత్‌నగర్‌ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌వైపు వెళ్లే ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. తాజాగా రెండో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో.. ఎల్బీనగర్‌ కూడలి సిగ్నల్‌ ఫ్రీగా మారింది. ఓ ఫ్లైఓవర్‌, 2 అండర్‌పాస్‌లు గతంలోనే అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ కూడలిలో మరో ఫ్లైఓవర్‌ ప్రారంభమైంది. హయత్‌నగర్‌ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌వైపు వెళ్లే ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. తాజాగా రెండో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో.. ఎల్బీనగర్‌ కూడలి సిగ్నల్‌ ఫ్రీగా మారింది. ఓ ఫ్లైఓవర్‌, 2 అండర్‌పాస్‌లు గతంలోనే అందుబాటులోకి వచ్చాయి.
14/38
సమంత, దేవ్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్‌ తెరకెక్కించిన చిత్రం ‘శాకుంతలం’. ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాల జోష్ పెంచింది. ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో సమంత ఇలా చీరకట్టులో మెరిశారు. సమంత, దేవ్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్‌ తెరకెక్కించిన చిత్రం ‘శాకుంతలం’. ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాల జోష్ పెంచింది. ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో సమంత ఇలా చీరకట్టులో మెరిశారు.
15/38
16/38
గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం నిర్వహించనున్న ‘లిటిల్‌ మిలీనియం కిడ్స్‌’ మారథాన్‌ టీ షర్ట్‌ను పీటీ ఉష ఆవిష్కరించారు. బాలలపై వేధింపులను అరికట్టాలనే ఉద్దేశంతో బాలల కోసం ఈ రన్‌ నిర్వహిస్తున్నారు.. గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం నిర్వహించనున్న ‘లిటిల్‌ మిలీనియం కిడ్స్‌’ మారథాన్‌ టీ షర్ట్‌ను పీటీ ఉష ఆవిష్కరించారు. బాలలపై వేధింపులను అరికట్టాలనే ఉద్దేశంతో బాలల కోసం ఈ రన్‌ నిర్వహిస్తున్నారు..
17/38
‘ఐపీఎల్‌ 2023’ మ్యాచ్‌లు త్వరలో ప్రారంభం కానున్న సందర్భంగా విరాట్‌ కోహ్లీ బెంగళూరుకు చేరుకున్నాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కోహ్లీ ఫొటోను ఆర్సీబీ ట్విటర్‌లో పంచుకుంది. ‘హ్యాపీ హోం కమింగ్‌, కింగ్‌ కోహ్లీ’ అని ట్వీట్‌ చేసింది. (ఫొటో సోర్స్‌: ఆర్సీబీ ట్విటర్‌). ‘ఐపీఎల్‌ 2023’ మ్యాచ్‌లు త్వరలో ప్రారంభం కానున్న సందర్భంగా విరాట్‌ కోహ్లీ బెంగళూరుకు చేరుకున్నాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కోహ్లీ ఫొటోను ఆర్సీబీ ట్విటర్‌లో పంచుకుంది. ‘హ్యాపీ హోం కమింగ్‌, కింగ్‌ కోహ్లీ’ అని ట్వీట్‌ చేసింది. (ఫొటో సోర్స్‌: ఆర్సీబీ ట్విటర్‌).
18/38
‘డబ్ల్యూపీఎల్‌ 2023’లో భాగంగా ఆదివారం ముంబయి ఇండియన్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లు ట్రోఫీతో ఫొటోలు తీసుకున్నారు. ‘డబ్ల్యూపీఎల్‌ 2023’లో భాగంగా ఆదివారం ముంబయి ఇండియన్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లు ట్రోఫీతో ఫొటోలు తీసుకున్నారు.
19/38
చాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌, లహరీ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘మేమ్‌ ఫేమస్‌’. ఈ సినిమా టీజర్‌ను మార్చి 26న ఏఎంబీ సినిమాస్‌లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. జూన్‌ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. చాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌, లహరీ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘మేమ్‌ ఫేమస్‌’. ఈ సినిమా టీజర్‌ను మార్చి 26న ఏఎంబీ సినిమాస్‌లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. జూన్‌ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
20/38
కర్ణాటకలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. అక్కడి చిక్కబల్లాపూర్‌లోని ప్రముఖ ఇంజినీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్మారకం వద్ద నివాళి అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అనంతరం మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని సందర్శించారు. కర్ణాటకలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. అక్కడి చిక్కబల్లాపూర్‌లోని ప్రముఖ ఇంజినీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్మారకం వద్ద నివాళి అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అనంతరం మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని సందర్శించారు.
21/38
విశాఖపట్నంలో ఈ నెలాఖరున జరగనున్న జీ20 సదస్సు కోసం నగరంలోని పలు ప్రాంతాలను ముస్తాబు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్కే బీచ్‌ నుంచి రుషికొండ తీరమార్గంలోని రహదారిని, తెన్నేటి పార్కును అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ మార్గం చూపరులకు కనువిందు చేస్తోంది. విశాఖపట్నంలో ఈ నెలాఖరున జరగనున్న జీ20 సదస్సు కోసం నగరంలోని పలు ప్రాంతాలను ముస్తాబు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్కే బీచ్‌ నుంచి రుషికొండ తీరమార్గంలోని రహదారిని, తెన్నేటి పార్కును అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ మార్గం చూపరులకు కనువిందు చేస్తోంది.
22/38
పార్కులో ఏర్పాట్లు పార్కులో ఏర్పాట్లు
23/38
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో పోలీసు సబ్సీడి క్యాంటీన్ ‘అంగడి’ని తెలంగాణ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్, సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ప్రారంభించారు. ఈ సౌకర్యాన్ని పోలీసు సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో పోలీసు సబ్సీడి క్యాంటీన్ ‘అంగడి’ని తెలంగాణ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్, సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ప్రారంభించారు. ఈ సౌకర్యాన్ని పోలీసు సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు..
24/38
కిరణ్‌ అబ్బవరం ప్రముఖ నటుడు రామ్‌చరణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ‘అన్నా.. చరణ్‌ అన్నా.. మోస్ట్‌ లవెబుల్‌ పర్సన్‌’ అని కిరణ్‌ అబ్బవరం పోస్టు పెట్టారు. కిరణ్‌ అబ్బవరం, అతుల్య రవి జంటగా తెరకెక్కిన  ‘మీటర్‌’ సినిమా ఏప్రిల్‌ 7న థియేటర్లలో విడుదల కానుంది. కిరణ్‌ అబ్బవరం ప్రముఖ నటుడు రామ్‌చరణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ‘అన్నా.. చరణ్‌ అన్నా.. మోస్ట్‌ లవెబుల్‌ పర్సన్‌’ అని కిరణ్‌ అబ్బవరం పోస్టు పెట్టారు. కిరణ్‌ అబ్బవరం, అతుల్య రవి జంటగా తెరకెక్కిన ‘మీటర్‌’ సినిమా ఏప్రిల్‌ 7న థియేటర్లలో విడుదల కానుంది.
25/38
నితిన్‌ హీరోగా విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇష్క్‌’. నిత్యామీనన్‌ కథానాయిక. 2012లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మార్చి29 నితిన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను రీరిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. నితిన్‌ హీరోగా విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇష్క్‌’. నిత్యామీనన్‌ కథానాయిక. 2012లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మార్చి29 నితిన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను రీరిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
26/38
బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం వారాంతం కావడంతో భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం వారాంతం కావడంతో భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
27/38
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పుర్‌లో సీఆర్పీఎఫ్‌ డే వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సుక్మాలోని పొటక్‌పల్లిలో పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పాఠాలు బోధించారు. బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలని అమిత్‌ షా వారికి సూచించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పుర్‌లో సీఆర్పీఎఫ్‌ డే వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సుక్మాలోని పొటక్‌పల్లిలో పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పాఠాలు బోధించారు. బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలని అమిత్‌ షా వారికి సూచించారు.
28/38
రవితేజ హీరోగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రావణాసుర’. ఏప్రిల్‌ 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నెల 28న సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. రవితేజ హీరోగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రావణాసుర’. ఏప్రిల్‌ 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నెల 28న సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
29/38
ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన సభలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ‘వైఎస్‌ఆర్‌ ఆసరా’ మూడో విడత నిధులను విడుదల చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు రోజా, తానేటి వనిత, ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి తదితరులు సీఎంతో సెల్ఫీ తీసుకొని సంబరపడిపోయారు. ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన సభలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ‘వైఎస్‌ఆర్‌ ఆసరా’ మూడో విడత నిధులను విడుదల చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు రోజా, తానేటి వనిత, ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి తదితరులు సీఎంతో సెల్ఫీ తీసుకొని సంబరపడిపోయారు.
30/38
మహబూబ్‌నగర్‌లోని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ క్యాంపు కార్యాలయం వద్ద భారాస పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని బంజారా కాలనీకి చెందిన ఇందిర అనే కార్యకర్త సమావేశంలో ప్రసంగించి తన ఆర్థిక పరిస్థితి గురించి శ్రీనివాస్‌గౌడ్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన మంత్రి వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇందిరతో పాటు ఆమె కుమార్తె, కుమారుడితో కలిసి భోజనం చేశారు. మహబూబ్‌నగర్‌లోని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ క్యాంపు కార్యాలయం వద్ద భారాస పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని బంజారా కాలనీకి చెందిన ఇందిర అనే కార్యకర్త సమావేశంలో ప్రసంగించి తన ఆర్థిక పరిస్థితి గురించి శ్రీనివాస్‌గౌడ్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన మంత్రి వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇందిరతో పాటు ఆమె కుమార్తె, కుమారుడితో కలిసి భోజనం చేశారు.
31/38
ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా విడుదలై నేటికి ఏడాది అవుతోంది. ఏడాది కాలంలో ఈ సినిమా వివిధ జాతీయ, అంతర్జాతీయ అవార్డులతో పాటు ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు గెలిచిందని తెలుపుతూ చిత్రబృందం ఈ ఫొటోను పంచుకుంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా విడుదలై నేటికి ఏడాది అవుతోంది. ఏడాది కాలంలో ఈ సినిమా వివిధ జాతీయ, అంతర్జాతీయ అవార్డులతో పాటు ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు గెలిచిందని తెలుపుతూ చిత్రబృందం ఈ ఫొటోను పంచుకుంది.
32/38
కర్ణాటక పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు మెట్రో రైలులో ప్రయాణించారు. అక్కడ వివిధ వర్గాల ప్రజలు, యువతతో మాట్లాడి వారి బాగోగులను తెలుసుకున్నారు. కర్ణాటక పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు మెట్రో రైలులో ప్రయాణించారు. అక్కడ వివిధ వర్గాల ప్రజలు, యువతతో మాట్లాడి వారి బాగోగులను తెలుసుకున్నారు.
33/38
సినీనటి, ‘మసూద’ ఫేమ్‌ బాంధవి శ్రీధర్‌(నాజియా పాత్ర) తన తాజా ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ పోస్టు కింద ఆమె ఫాలోవర్లు లైక్‌లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సినీనటి, ‘మసూద’ ఫేమ్‌ బాంధవి శ్రీధర్‌(నాజియా పాత్ర) తన తాజా ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ పోస్టు కింద ఆమె ఫాలోవర్లు లైక్‌లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
34/38
35/38
విశ్వక్‌సేన్‌ (Vishwaksen) హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దాస్‌ కా ధమ్కీ (Das Ka Dhamki)’. నివేదా పేతురాజ్‌ కథానాయిక. ఈ నెల 22న విడుదలైన ఈ సినిమా.. 3రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.15కోట్లు వసూలు చేసిందని చిత్రబృందం తెలిపింది. విశ్వక్‌సేన్‌ (Vishwaksen) హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దాస్‌ కా ధమ్కీ (Das Ka Dhamki)’. నివేదా పేతురాజ్‌ కథానాయిక. ఈ నెల 22న విడుదలైన ఈ సినిమా.. 3రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.15కోట్లు వసూలు చేసిందని చిత్రబృందం తెలిపింది.
36/38
మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఆయన భార్య ప్రిసిల్లా చాన్‌ మూడో బిడ్డకు జన్మనిచ్చారు. చిన్నారి ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్న ఆయన.. ‘అరేలియా చాన్‌ వెల్‌కమ్‌ టు ది వరల్డ్‌’ అని పోస్టు పెట్టారు. మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఆయన భార్య ప్రిసిల్లా చాన్‌ మూడో బిడ్డకు జన్మనిచ్చారు. చిన్నారి ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్న ఆయన.. ‘అరేలియా చాన్‌ వెల్‌కమ్‌ టు ది వరల్డ్‌’ అని పోస్టు పెట్టారు.
37/38
ఈరోజు రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు విద్యుత్తు వినియోగాన్ని స్వచ్ఛందంగా నిలిపేసి ‘ఎర్త్‌ అవర్‌’ పాటించనున్నారు. దీనిపై అవగాహన కల్పిస్తూ ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఇందుకోసం 150కి పైగా బల్బులను వినియోగించినట్లు ఆయన తెలిపారు. ఈరోజు రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు విద్యుత్తు వినియోగాన్ని స్వచ్ఛందంగా నిలిపేసి ‘ఎర్త్‌ అవర్‌’ పాటించనున్నారు. దీనిపై అవగాహన కల్పిస్తూ ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఇందుకోసం 150కి పైగా బల్బులను వినియోగించినట్లు ఆయన తెలిపారు.
38/38
తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌ టీ హబ్ నుంచి సైక్లథాన్‌ను జెండా ఊపి ప్రారంభించారు.  ఈ సైకిల్‌ ర్యాలీలో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌ టీ హబ్ నుంచి సైక్లథాన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సైకిల్‌ ర్యాలీలో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

మరిన్ని