News in pics: చిత్రం చెప్పే విశేషాలు (08-07-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 08 Jul 2024 13:56 IST
1/23
యాదాద్రి భువనగిరి  పట్టణంలో భగాయత్ పాఠశాలలో  స్మార్ట్ క్లాస్‌ రూమ్‌ను  ప్రారంభించిన సినీ నటి మంచు లక్ష్మి,  ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి,  కలెక్టర్ హనుమంతు కే జండగే తదితరులు

2/23
ఖమ్మం జిల్లా  కొణిజర్లకు చెందిన అనంతోజు రామాచారి ఇంటి ఆవరణలో ఉన్న పండ్లు, పూల మొక్కల మధ్యలో పక్షులు గూళ్లు ఏర్పాటు చేసుకుని రక్షణ పొందుతున్నాయి. కొన్ని రకాల పిచ్చుక జాతి పక్షులు గూళ్లలో గుడ్లు, పిల్లలతో కిలకిల రావాలతో సందడి చేస్తున్నాయి. 

3/23
ఇటీవల కురిసిన వర్షాలకు వైఎస్సార్‌ జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట అలుగు పారుతోంది. ఇక్కడ చేపల కోసం వందల సంఖ్యలో సైబీరియన్‌ కొంగలు వలస వస్తున్నాయి. 

4/23
సాధారణంగా బొప్పాయి చెట్టుకు అనుకొని కాయలు కాస్తుంటాయి. కానీ ఈ మూడు బొప్పాయి చెట్లు మాత్రం పొడవాటి తీగలతో కాయలను విరగకాశాయి. ఈ చెట్లు కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలోని పరందోలి గ్రామంలో పవర్‌ రమేశ్‌ ఇంటి ఆవరణలో పెరిగి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. 

5/23
మంగళూరు సమీపంలోని పెనంబూర్‌ వద్ద తీరాన్ని తాకిన అరేబియా సముద్ర జలాలు 

6/23
కన్నడనాట కురుస్తున్న జోరు వానలకు అన్నదాతలు ఉత్సాహంగా సేద్యపు పనులు ప్రారంభిస్తున్నారు. చాలా చోట్ల పొలం పనులు ఊపందుకున్నాయి. చిక్కమగళూరు జిల్లాలో ఓ రైతు కుటుంబం తన పొలంలో విత్తనాలు విత్తుతుండగా న్యూస్‌టుడే క్లిక్‌ మనిపించింది.

7/23
ఒడిశా రాష్ట్రం జయపురంలో ఏడాదిలోని శ్రావణమాసంలో మాత్రమే దొరికే బడచత్తు (పుట్టగొడుగు) ధరలు ఔరా అనిపిస్తున్నాయి. బడచత్తు కిలో దాదాపు రూ.2 వేలు పలుకుతోంది. ధర ఎక్కువ ఉన్నప్పటికీ ఔషధ గుణాలు కలిగి ఉండటంతో వినియోగదారులు వీటిని కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు.

8/23
ఇటీవల కురుస్తున్న వర్షాలకు  శేషాచలం కొండల్లో  తేమ శాతం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వివిధ రకాల సీతాకోకచిలుకలు గుంపులుగా వాలి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద, తిరుమల శ్రీవారి దర్శనార్థం కనుమ దారిలో ఆకులను తలపిస్తూ మొక్కలపై వాలి ఇవి కనువిందు చేస్తున్నాయి.

9/23
కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన బోడపట్ల మల్లవ్వ అనే వృద్ధురాలు మిరప నారు అలికి ఇంటి పక్కన ఉన్న మూడు గుంటల్లో నాటుకున్నారు. కొన్ని రోజులుగా వర్షపు చినుకులు రాలకపోవడంతో ఆ మొలకలు ఎండిపోతున్నాయి. వాటిని దక్కించుకోవాలన్న ఆశతో ఇలా  పైపు ద్వారా నీటిని అందిస్తున్నారు.

10/23
లండన్‌లో వింబుల్డన్‌ సందర్భంగా టెన్నిస్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌తో భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌

11/23
గుజరాత్‌ రాష్ట్రంలోని దుండి గ్రామంలో వ్యవసాయ బోరుకు రైతు ఏర్పాటు చేసుకున్న సౌర విద్యుత్‌

12/23
హైదరాబాద్‌: అబిడ్స్‌ ఇస్కాన్‌ ఆలయం, బంజారాహిల్స్, సికింద్రాబాద్‌లోని జగన్నాథ ఆలయాల నుంచి ఆదివారం స్వామి వారి రథయాత్రలు ప్రారంభమయ్యాయి. దారిపొడవునా కోలాటాలాడుతూ.. భక్తిగీతాలు ఆలపిస్తూ పరవశించిపోయారు.

13/23
ఆదిలాబాద్‌: మామడ మండలంలోని మారుమూలన కొండ కోనల్లో ఉన్న వాస్తాపూర్‌ గ్రామానికి పర్యాటకుల సందడి మొదలైంది. రెండు మూడు రోజులుగా కురిసిన వర్షాలకు అక్కడి జలపాతం జాలువారుతోంది. పచ్చని గుట్టలు, ఘాట్ రోడ్డు మీదుగా వెళ్లే ప్రయాణం జనాలను ఆకట్టుకుంటోంది.

14/23
హైదరాబాద్‌: శిల్పారామంలో నిర్వహిస్తున్న జాతీయ నృత్యోత్సవంలో భాగంగా ఆదివారం సాయంత్రం కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు చూపరులను అలరించాయి. వికాస్‌ దత్త సత్రియా నృత్యం, త్రిష్ట భరతనాట్య నృత్యంతో ఆకట్టుకున్నారు.

15/23
హైదరాబాద్‌: ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) స్నాతకోత్సవాన్ని గచ్చిబౌలిలోని ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించారు. సీఏ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాలు అందజేశారు. పట్టాలు అందుకున్న విద్యార్థులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.

16/23
మెదక్‌: చుట్టూ ఆకుపచ్చని ఎత్తైన గుట్టలు, మధ్యలో నాటేసిన పొలాలు వాటిలో నాటు వేస్తున్న మహిళా కూలీలు.. పొలం గట్లపై తాటి చెట్లు వెరసి పల్లె అందాలకు నిదర్శనమయ్యాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం ఉమ్మాపూర్‌లోని మహాసముద్రం చెరువు కట్ట కింద ఉన్న ఆయకట్టు పొలాల్లో ఆవిష్కృతమైంది.

17/23
ఏలూరు కోటదిబ్బలోని జూనియర్, డిగ్రీ కళాశాలల ముఖ ద్వారానికి రెండు వైపులా భారీ వృక్షాలు కనువిందు చేస్తున్నాయి. కళాశాలల లోపలికి ప్రవేశించే వారికి స్వాగతం పలుకుతున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు చెట్లు మరింత పచ్చదనంతో ఆకట్టుకుంటున్నాయి.

18/23
ఏలూరు: ద్వారకాతిరుమల శ్రీవారి ఉపాలయం లక్ష్మీపురం వేంకటేశ్వర సంతాన గోపాల జగన్నాథస్వామి ఆలయంలో కొలువైన సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుని రథోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. రథోత్సవం ఆలయం వద్ద ప్రారంభమై పురవీధుల్లో కనుల పండువగా సాగింది.

19/23
కరీంనగర్‌: నగునూరులోని శ్రీదుర్గాభవానీ ఆలయంలో ఆషాఢ శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారిని దొండకాయల మాలలతో అలంకరించారు. అన్నమాచార్య ట్రస్ట్‌ బృందం కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి.

20/23
తూర్పుగోదావరి: ఆషాఢమాస ఉత్సవాల్లో భాగంగా లోవ తలుపులమ్మ అమ్మవారిని ఆదివారం గాజులతో సుందరంగా అలంకరించారు. వేకువ జాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తజనంతో నిండిపోయింది. సుమారు 40 వేలమంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

21/23
వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన దేసు లక్ష్మణ్‌ ఇంటి ఆవరణలోని మందార చెట్టుకు పూసిన రెండు వేర్వేరు రంగుల పూలు స్థానికులను ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా ఈ చెట్టుకు నిత్యం గోధుమ రంగు పుష్పాలు పూస్తుంటాయి.

22/23
వరంగల్‌: సగటు జాలరి జీవనానికి అద్దం పట్టే ఈ చిత్రం ఖిలావరంగల్‌ పడమరకోట మాలారుగుర్త చెరువులో కనిపించింది. మధ్యాహ్న వేళ తమ జీవన వేటలో నిమగ్నమైన దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.

23/23
ఆదిలాబాద్‌: చిత్రంలో తాబేలు ఆకారంలో కనిపిస్తున్నది పులగంద గడ్డ. మందమర్రి టీనగర్‌ కాలనీలో స్రవంతి అనే మహిళ ఆదివారం కూరగాయల మార్కెట్‌లో పులగంద కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని కాలనీవాసులకు తెలియజేయడంతో వారు వచ్చి ఆసక్తిగా  తిలకిస్తున్నారు.

Tags :

మరిన్ని