News in pics: చిత్రం చెప్పే విశేషాలు (09-07-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 09 Jul 2024 03:38 IST
1/6
నల్గొండ: మనుషులే క్రమశిక్షణ తప్పుతున్నారు.. నిబంధనలు ఎన్ని పెట్టినా పక్కన పెట్టేస్తున్నారు.. కానీ ఆకాశంలో పక్షులు మాత్రం వరుసను పాటిస్తున్నాయి.. క్రమ పద్ధతిగా పయనిస్తున్నాయి..చూపరులకు కనువిందు చేస్తున్నాయి..మానవాళికి పాఠాలు నేర్పిస్తున్నాయి.

2/6
మహబూబ్‌నగర్‌: నారాయణపేట జిల్లాలో కృష్ణా మొదలుకుని మక్తల్, ఊట్కూరు మండలాల వరకు జింకల బెడద రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది ఒకప్పుడు తీరంలో తిరిగే జింకలు ఆహారం కోసం పంటపొలాలపైకి వస్తున్నాయి.

3/6
హైదరాబాద్‌: బల్కంపేట ఎల్లమ కల్యాణోత్సవ క్రతువు సోమవారం మొదలైంది. సాయంత్రం ఎదుర్కోళ్ల ఉత్సవం కనులపండువగా సాగింది. పండితులు ఎల్లమ్మ తల్లిని పెళ్లి కూతురుగా ముస్తాబు చేశారు.

4/6
కరీంనగర్‌ గ్రామీణ మండలం నగునూరులోని శ్రీదుర్గాభవానీ ఆలయంలో ఆషాఢ శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారిని క్యాప్సికమ్‌ మాలలతో అలంకరించారు. వేదపండితులు పురాణం మహేశ్వరశర్మ, ఆలయ ప్రధానార్చకులు పవనకృష్ణశర్మ పూజలు నిర్వహించారు.

5/6
కర్నూలు శివారులోని నగరవనానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అరుదైన ‘అడెన్‌ సోనియా’ వృక్షం పచ్చదనం సంతరించుకుంది. హైదరాబాద్‌కు చెందిన శాస్త్రవేత్తల సూచనలతో నగరవనంలో నాటారు. ప్రస్తుతం ఈ చెట్టు పచ్చదనం సంతరించుకుని కళకళలాడుతూ నిలిచింది.

6/6
నగరంలోని కూడళ్ల సుందరీకరణలో భాగంగా వరంగల్‌ తాత్కాలిక బస్టాండ్, ఎస్‌ఎన్‌ఎం క్లబ్‌ కూడలిలో సోమవారం ఏర్పాటు చేసిన హస్త కళాకృతి ఆకట్టుకుంటోంది. కింది వరుసలో మహాత్మా గాంధీ, ఇతర స్వాతంత్య్ర సమరయోధులు, సంఘ సంస్కర్తల రూపాలు చెక్కారు.

Tags :

మరిన్ని