సాయి పల్లవి

Updated : 21 Dec 2021 19:42 IST
1/22
తెలుగు, తమిళ చిత్రాల్లో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి తెలుగు, తమిళ చిత్రాల్లో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి
2/22
1992 మే 8న తమిళనాడులోని కోటగిరిలో సాయి పల్లవి జన్మించింది. 1992 మే 8న తమిళనాడులోని కోటగిరిలో సాయి పల్లవి జన్మించింది.
3/22
సాయి పల్లవి తబ్లిసి స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీలో మెడిసన్‌ పూర్తి చేసింది. సాయి పల్లవి తబ్లిసి స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీలో మెడిసన్‌ పూర్తి చేసింది.
4/22
చిన్నప్పటి నుంచి సాయిపల్లవి డ్యాన్స్‌ అంటే మక్కువ. తన తల్లిలా డ్యాన్సర్‌ కావాలనుకుంది. అయితే ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. చిన్నప్పటి నుంచి సాయిపల్లవి డ్యాన్స్‌ అంటే మక్కువ. తన తల్లిలా డ్యాన్సర్‌ కావాలనుకుంది. అయితే ఎక్కడా శిక్షణ తీసుకోలేదు.
5/22
డ్యాన్సర్‌గా వివిధ టెలివిజన్‌ కార్యక్రమాలు, రియాల్టీ షోలలో పాల్గొంది. తెలుగులో ‘ఢీ: అల్టిమేట్‌ డ్యాన్స్‌ షో(ఢీ4)’లో కంటెస్టెంట్‌గా అదరగొట్టింది. డ్యాన్సర్‌గా వివిధ టెలివిజన్‌ కార్యక్రమాలు, రియాల్టీ షోలలో పాల్గొంది. తెలుగులో ‘ఢీ: అల్టిమేట్‌ డ్యాన్స్‌ షో(ఢీ4)’లో కంటెస్టెంట్‌గా అదరగొట్టింది.
6/22
నటిగా తమిళంలో ‘కస్తూరి మాన్‌’, ‘ధమ్‌ ధూమ్‌’ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. నటిగా తమిళంలో ‘కస్తూరి మాన్‌’, ‘ధమ్‌ ధూమ్‌’ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది.
7/22
మలయాళంలో తెరకెక్కిన ‘ప్రేమమ్‌’లో మలర్‌ పాత్ర సాయి పల్లవి కెరీర్‌ను మలుపు తిప్పింది. మలయాళంలో తెరకెక్కిన ‘ప్రేమమ్‌’లో మలర్‌ పాత్ర సాయి పల్లవి కెరీర్‌ను మలుపు తిప్పింది.
8/22
తెలుగులో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’లో భానుమతిగా నటించి మెప్పించింది. తెలుగులో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’లో భానుమతిగా నటించి మెప్పించింది.
9/22
నానితో ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’లోనూ మెరిసింది నానితో ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’లోనూ మెరిసింది
10/22
‘కణం’, ‘పడి పడి లేచే మనసు’, ‘మారి2’, ‘ఎన్‌జీకే’ తదితర చిత్రాలు సాయిపల్లవికి మంచి పేరు తెచ్చి పెట్టాయి. ‘కణం’, ‘పడి పడి లేచే మనసు’, ‘మారి2’, ‘ఎన్‌జీకే’ తదితర చిత్రాలు సాయిపల్లవికి మంచి పేరు తెచ్చి పెట్టాయి.
11/22
శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా నటించిన ‘లవ్‌స్టోరీ’లో సాయిపల్లవి తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా నటించిన ‘లవ్‌స్టోరీ’లో సాయిపల్లవి తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది
12/22
నాని కథానాయకుడిగా ‘శ్యామ్‌ సింగ్‌రాయ్‌’లో దేవదాసీ పాత్రలో నటించింది. నాని కథానాయకుడిగా ‘శ్యామ్‌ సింగ్‌రాయ్‌’లో దేవదాసీ పాత్రలో నటించింది.
13/22
రానా కీలక పాత్రలో నటిస్తున్న ‘విరాటపర్వం’లో వెన్నెలగా అలరించనుంది. రానా కీలక పాత్రలో నటిస్తున్న ‘విరాటపర్వం’లో వెన్నెలగా అలరించనుంది.
14/22
 ‘‘కాలేజీ చదివే రోజుల్లోనే ఇండస్ట్రీకి వచ్చా. అప్పుడు మిగతా సగటు అమ్మాయిల్లాగే అందం విషయంలో నాకు కొన్ని భయాలుండేవి’’ ‘‘కాలేజీ చదివే రోజుల్లోనే ఇండస్ట్రీకి వచ్చా. అప్పుడు మిగతా సగటు అమ్మాయిల్లాగే అందం విషయంలో నాకు కొన్ని భయాలుండేవి’’
15/22
‘‘అప్పటి వరకు నేను చూసిన హీరోయిన్లంతా ఎలాంటి మచ్చలు లేని అందమైన మోమున్న వాళ్లే. నేను వాళ్లలో సెట్‌ అవుతానా..? తెరపై నన్ను చూసి ‘ఈ పిల్ల ఇలా ఉందేంటి?’ అని ప్రేక్షకులంటారేమోనని అనుకునేదాన్ని’’ ‘‘అప్పటి వరకు నేను చూసిన హీరోయిన్లంతా ఎలాంటి మచ్చలు లేని అందమైన మోమున్న వాళ్లే. నేను వాళ్లలో సెట్‌ అవుతానా..? తెరపై నన్ను చూసి ‘ఈ పిల్ల ఇలా ఉందేంటి?’ అని ప్రేక్షకులంటారేమోనని అనుకునేదాన్ని’’
16/22
‘‘ఎవరైనా నన్ను చూస్తే.. నా ముఖంపై ఉన్న మొటిమలు చూసి మాట్లాడతారేమోనని మదన పడేదాన్ని. కానీ, ‘ప్రేమమ్‌’ విడుదలయ్యాక నా ఆలోచనలన్నీ తప్పని అర్థమైంది’’ ‘‘ఎవరైనా నన్ను చూస్తే.. నా ముఖంపై ఉన్న మొటిమలు చూసి మాట్లాడతారేమోనని మదన పడేదాన్ని. కానీ, ‘ప్రేమమ్‌’ విడుదలయ్యాక నా ఆలోచనలన్నీ తప్పని అర్థమైంది’’
17/22
‘‘ఎవరైనా క్యారెక్టర్‌నే ఇష్టపడతారు తప్ప.. పైకి కనిపించే అందాన్ని కాదని తెలుసుకున్నా. అది నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది’’ ‘‘ఎవరైనా క్యారెక్టర్‌నే ఇష్టపడతారు తప్ప.. పైకి కనిపించే అందాన్ని కాదని తెలుసుకున్నా. అది నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది’’
18/22
‘‘నేనిప్పటి వరకు చేసిన గీతాల్లో ‘రౌడీబేబీ’, ‘ఏవండో నాని గారు’ పాటలు కష్టంగా అనిపించాయి’’ ‘‘నేనిప్పటి వరకు చేసిన గీతాల్లో ‘రౌడీబేబీ’, ‘ఏవండో నాని గారు’ పాటలు కష్టంగా అనిపించాయి’’
19/22
‘‘రీమేక్‌లు చేయకూడదనే రూల్స్‌ ఏమీ పెట్టుకోలేదు. మాతృక స్థాయిలో చేయాలి లేదా కొత్తగా ఏదైనా చేయాలనే ఒత్తిడి ఉంటుంది. అందుకే దాని బదులు ఓ కొత్త స్క్రిప్ట్‌ చేస్తే మంచిదనిపిస్తుంది’’ ‘‘రీమేక్‌లు చేయకూడదనే రూల్స్‌ ఏమీ పెట్టుకోలేదు. మాతృక స్థాయిలో చేయాలి లేదా కొత్తగా ఏదైనా చేయాలనే ఒత్తిడి ఉంటుంది. అందుకే దాని బదులు ఓ కొత్త స్క్రిప్ట్‌ చేస్తే మంచిదనిపిస్తుంది’’
20/22
సాయి పల్లవి చేతికి ఎప్పుడూ జపమాల ఉంటుంది. అది ఆమె తాత ఇచ్చారట. షూటింగ్‌లలో మాత్రమే దాన్ని తీసి పక్కన పెడతారట. సాయి పల్లవి చేతికి ఎప్పుడూ జపమాల ఉంటుంది. అది ఆమె తాత ఇచ్చారట. షూటింగ్‌లలో మాత్రమే దాన్ని తీసి పక్కన పెడతారట.
21/22
‘‘చిరంజీవి సర్‌ సినిమా(భోళాశంకర్‌)కి నో చెప్పడానికి కారణం.. అది రీమేక్‌ అని కాదు. ఆ పాత్రకు న్యాయం చేయలేను అనిపించింది’’ ‘‘చిరంజీవి సర్‌ సినిమా(భోళాశంకర్‌)కి నో చెప్పడానికి కారణం.. అది రీమేక్‌ అని కాదు. ఆ పాత్రకు న్యాయం చేయలేను అనిపించింది’’
22/22
‘‘ప్రస్తుతానికి నటిగానే కొనసాగుతున్నా. భవిష్యత్తులో వైద్యురాలిగా మారతానేమో. జార్జియాలో వైద్యవిద్య అభ్యసించాను.  మన దేశంలో డాక్టర్‌గా సేవలందించడానికి అనుమతి కోసం పరీక్ష రాయాల్సి ఉంది’’ ‘‘ప్రస్తుతానికి నటిగానే కొనసాగుతున్నా. భవిష్యత్తులో వైద్యురాలిగా మారతానేమో. జార్జియాలో వైద్యవిద్య అభ్యసించాను. మన దేశంలో డాక్టర్‌గా సేవలందించడానికి అనుమతి కోసం పరీక్ష రాయాల్సి ఉంది’’

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు