close
భారత్‌లో అసహనం, ఆగ్రహం

పాలకుల మనస్తత్వమే ఇందుకు కారణం
యూఏఈలో రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు

దుబాయ్‌: భారత్‌ గత నాలుగున్నరేళ్లలో తీవ్ర స్థాయిలో అసహనాన్ని, ఆగ్రహాన్ని చవిచూసిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నవారి మనస్తత్వమే ఇందుకు కారణమని విమర్శించారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) పర్యటనలో ఉన్న ఆయన శనివారం ఐఎంటీ దుబాయ్‌ వర్సిటీ విద్యార్థులతో ముచ్చటించారు. భారత్‌ బహుళ సిద్ధాంతాలను ఇమడ్చుకోగలదని చెప్పారు. ఒకే సిద్ధాంతాన్ని ప్రజల నెత్తిన రుద్దే పరిస్థితి ఉండదన్నారు. ‘‘భారత్‌కు అనేక సిద్ధాంతాలు తరలివచ్చాయి. వాటిని భారత్‌ తీర్చిదిద్దింది. అవి కూడా ఈ దేశాన్ని తీర్చిదిద్దాయి. ఇతరుల అభిప్రాయాలను ఆలకించడమూ భారత సిద్ధాంతాల్లో భాగమే. సహనమనేది భారత సంస్కృతిలో భాగం. గత నాలుగున్నరేళ్లలో దేశంలో జరుగుతున్న పరిణామాలు ఆవేదన కలిగిస్తున్నాయి. వివిధ వర్గాల నడుమ ఎంతో అసహనం, ఆగ్రహం, విభజనను చూశాం. నాయకత్వ తీరులో సహనం ఉంటే అదే సందేశం వ్యాప్తి చెందుతుంది. సాధారణంగా భారత్‌లో సహనశీలత ఎక్కువ. ఇతరుల అభిప్రాయాలకు గౌరవం ఉంటుంది. మళ్లీ అలాంటి వాతావరణం రావాలి’’ అని పేర్కొన్నారు.

పాత్రికేయులను కాల్చి చంపే, అభిప్రాయాలను వ్యక్తంచేసినందుకు అవతలివారిపై దాడులు చేసే తరహా భారత్‌ను తాను కోరుకోవడంలేదని రాహుల్‌ పేర్కొన్నారు. ‘‘దీన్ని మార్చాలనుకుంటున్నాం. రానున్న ఎన్నికల్లో అదే సవాల్‌’’ అని పేర్కొన్నారు. దేశంలో ఆకలి కేకలు వంటి పెద్ద సవాళ్లు ఉన్న నేపథ్యంలో క్రీడలకు అధిక ప్రాధాన్యమివ్వడం కష్టమవుతుందన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక పరివర్తన అవసరమని చెప్పారు.  ప్రస్తుతం దేశ వ్యవసాయ వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో సంధానం కాలేదన్నారు. చిన్న, మధ్య తరహా వ్యాపారాలు పెద్ద కంపెనీలుగా ఎదిగేందుకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చేలా దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థలో పరివర్తన అవసరమని చెప్పారు. ఆరోగ్య పరిరక్షణ విషయంలో భారత్‌కు అపార అవకాశాలు ఉన్నాయన్నారు.

 

 

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.