close
2 నియోజకవర్గాలకు పంపిణీ కాని తెరాస బి-ఫారాలు 

ఆ ఎమ్మెల్యేలకు ఇచ్చే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ద్వారా ఇచ్చే బి-ఫారాల పంపిణీ ముగింపు దశకు చేరింది. 2 శాసనసభ నియోజకవర్గాలు మినహా మిగిలిన స్థానాల్లోని ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు వాటిని తెరాస అందజేసింది. సంగారెడ్డి, భద్రాచలం శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు బి- ఫారాల పంపిణీ జరగలేదు. ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తెరాసలో చేరతారనే ప్రచారం నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రంలోని 32 జిల్లాల పరిధిలో గల గ్రామీణ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌ఛార్జులకు టికెట్ల పంపిణీ బాధ్యతలను తెరాస అప్పగించింది. దీనికి అనుగుణంగా వారికి బి-ఫారాలను పంపిస్తోంది. తెరాస ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలతో పాటు కాంగ్రెస్‌, తెదేపాలకు రాజీనామా చేసిన 12 మంది ఎమ్మెల్యేలకు సైతం బి-ఫారాలను  పంపిణీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు సంగారెడ్డి, భద్రాచలం నియోజకవర్గాలకు మాత్రం వాటిని పెండింగ్‌లో పెట్టింది. ఇక్కడ బి-ఫారాల కోసం ఆయా నియోజకవర్గాల నేతలు అధిష్ఠానాన్ని సంప్రదించగా... వారికి ఈ సమాచారం తెలిపింది.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.