close
ఫిరాయింపులపై ఉత్తమ్‌ మాట్లాడటం విడ్డూరం: తలసాని

ఈనాడు, హైదరాబాద్‌: ఉత్తమ్‌, భట్టి విక్రమార్క మేధావుల్లా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఫిరాయింపులను ప్రోత్సహించినపుడు వారికి ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని వీరు తప్పుపట్టడం విడ్డూరంగా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ను వీడుతున్న వారి గురించి వదిలేసి, ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు యత్నించాలని సూచించారు. దేశం గర్వపడే విధంగా తెలంగాణ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని, రాష్ట్ర పోలీసుల మనో స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా భాజపా ఇష్టానుసారంగా మాట్లాడుతోందని విమర్శించారు. దేశంలో ఉగ్రవాదం పెరగడానికి ఆ పార్టీయే కారణమని, మతాన్ని అడ్డంపెట్టుకొని ఆ పార్టీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సోమవారం తెలంగాణభవన్‌లో తలసాని విలేకరులతో మాట్లాడారు. ‘17 ఎంపీ స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌.. ఎక్కడ కూడా మాకు కనీసం పోటీ ఇవ్వలేదు. బ్యాలెట్‌ అయితే బాగుంటుందని మాట్లాడుతున్న ఉత్తమ్‌ ఈవీఎంలతో గెలిచిన విషయం మర్చిపోతున్నారని మంత్రి అన్నారు. పార్లమెంటు, శాసనసభ ఎన్నికల మాదిరే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధిస్తుంది. భాజపా ప్రతి అంశాన్ని ఎంఐఎంతో ముడిపెట్టి మాట్లాడటం, దోషిగా చూపడం దారుణం. దత్తాత్రేయకు ఎన్నికల్లో టికెట్‌ రాలేదు. ఆయన పదవీ విరమణ ప్రకటించి ఇంట్లో కూర్చోవాలి. రాష్ట్ర పోలీసు వ్యవస్థ గురించి తెలుసుకొని మాట్లాడాలి. ఉగ్రవాద మూలాలున్నాయనే అనుమానమున్న ప్రతిచోట రాష్ట్రంలోని పోలీస్‌ వ్యవస్థ తనిఖీలు చేస్తుంది. హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ.. ఉగ్రవాద సంస్థ సానుభూతి పరుల పట్టివేత రాష్ట్ర పోలీసుల సహకారంతోనే జరిగింది. ఇటీవల పాక్‌ చేతిలో బందీ అయి విడుదలైన అభినందన్‌ విషయంలో ప్రధాని మోదీ పాక్‌పై చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితమైనవి. అభినందన్‌ను వదలకపోతే పాకిస్థాన్‌కు కాళరాత్రి అని మోదీ మాట్లాడడం సరికాదు. ఇంటర్‌ ఫలితాలపై ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. నివేదిక వచ్చాక ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. తెలంగాణలో మిషన్‌ భగీరథ నూటికి నూరు శాతం పూర్తయింది’ అని తలసాని అన్నారు.

 

 

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.