Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 120247
            [news_title_telugu_html] => 

బెంగాల్‌లో కమల వికాసం! 

[news_title_telugu] => బెంగాల్‌లో కమల వికాసం!  [news_title_english] => [news_short_description] => దేశానికి తూర్పు భాగంలో ఉన్న పశ్చిమబెంగాల్‌లో కమలం అనూహ్యంగా వికసించింది. హిందీ రాష్ట్రాల్లో తగ్గే స్థానాలను పూడ్చుకోవడంపై భాజపా దృష్టిసారించిన రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్‌ ఒకటి. ఆ వ్యూహం పూర్తిస్థాయిలో కాకపోయిన బాగానే ఫలించిందని చెప్పవచ్చు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/1erOvCzC5S8 [news_videoinfo] => |https://www.youtube.com/embed/1erOvCzC5S8 [news_sections] => ,24,23, ) )
బెంగాల్‌లో కమల వికాసం!  - EENADU
close
బెంగాల్‌లో కమల వికాసం! 

2 నుంచి 18కి పెరిగిన భాజపా బలం 
పన్నెండు స్థానాలు కోల్పోయిన తృణమూల్‌ కాంగ్రెస్‌

దేశానికి తూర్పు భాగంలో ఉన్న పశ్చిమబెంగాల్‌లో కమలం అనూహ్యంగా వికసించింది. హిందీ రాష్ట్రాల్లో తగ్గే స్థానాలను పూడ్చుకోవడంపై భాజపా దృష్టిసారించిన రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్‌ ఒకటి. ఆ వ్యూహం పూర్తిస్థాయిలో కాకపోయిన బాగానే ఫలించిందని చెప్పవచ్చు. 42 లోక్‌సభ స్థానాలున్న ఈ రాష్ట్రంలో భాజపా తన బలాన్ని రెండు నుంచి 18 స్థానాలకు పెంచుకోగలిగింది. గత ఫలితాలతో పోల్చితే తృణమూల్‌ కాంగ్రెస్‌12 స్థానాలను కోల్పోయి 22కి పరిమితమైంది. కాంగ్రెస్‌ రెండు స్థానాలు కోల్పోయి రెండింటికి పరిమితం అవగా.. సీపీఎం ఉన్న 2 స్థానాలూ కోల్పోయింది. సీపీఎం శ్రేణులు మొత్తం భాజపావైపు మళ్లినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో సంచలన విజయం నమోదుచేసిన మూన్‌మూన్‌ సేన్‌ ఈ దఫా ఆసన్‌సోల్‌లో కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, డైమండ్‌ హార్బర్‌ సిటింగ్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ మరోమారు సొంత నియోజకవర్గం నుంచే విజయం సాధించారు. బీర్‌భూమ్‌ నుంచి టీఎంసీ సిటింగ్‌ ఎంపీ శతాబ్దీరాయ్‌ గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించారు.

ప్రధాని విస్తృత ప్రచారం 
సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత ప్రధాని మోదీ 51 రోజుల్లో దేశవ్యాప్తంగా 142 ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. వీటిలో మూడో వంతు ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లోనే కావడం విశేషం. మార్చి 29 నుంచి మే 16 మధ్య మోదీ, అమిత్‌షా పశ్చిమబెంగాల్‌లో 17 ఎన్నికల ర్యాలీల చొప్పున పాల్గొన్నారు. పశ్చిమబెంగాల్‌ అభివృద్ధికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే అడ్డంకిగా నిలుస్తున్నారని ప్రతి సభలో తూర్పారబట్టారు. శారదా, రోజ్‌వ్యాలీ వంటి కుంభకోణాలనూ ప్రస్తావించారు. మమతా బెనర్జీ సర్కారు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పాయని విమర్శించారు.

కొంపముంచిన ఫిరాయింపులు 
మోదీ సర్కారు కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రతి విషయంలోనూ విభేదిస్తూ వస్తున్న మమత ప్రచారంలో అవకాశం చిక్కినప్పుడల్లా మోదీపై విరుచుకుపడ్డారు. 44 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 102 సమావేశాల్లో పాల్గొన్నారు. అంటే సగటున ఒక లోక్‌సభ స్థానంలో 2.42 సమావేశాలకు హాజరయ్యారు. ఎన్నికల తేదీలు ప్రకటించిన వెంటనే.. అభ్యర్థుల జాబితాను వెల్లడించారు. మహిళలకు ఏకంగా 41% సీట్లు కేటాయించారు. వీరిలో ఎక్కువ మంది సినిమా హీరోయిన్లు ఉన్నారు. మరోవైపు, తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి సౌమిత్రఖాన్‌, అనుపమ్‌ హజ్రా, అర్జున్‌సింగ్‌ తదితరులు భాజపాలోకి ఫిరాయించడంతో చాలా మంది కార్యకర్తలు వారివెంట నడిచారు. పార్టీ స్థానాలు తగ్గడానికి ఇదీ ఓ కారణమైంది. దీనికి తోడు బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన ముస్లింలకు మమత వంతపాడుతూ వచ్చారు. రాష్ట్రంలోని ముస్లిమేతర ఓటర్లకు ఈ పరిణామం అంతగా రుచించలేదు.

భాజపాకు లాభించిన అంశాలు 
తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు గూండాలుగా మారారని, హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు. పంచాయతీ ఎన్నికల్లో చాలా మంది అభ్యర్థులు, ఓటర్లను తృణమూల్‌ కార్యకర్తలు భయభ్రాంతులకు గురిచేయడమూ అధికార పార్టీ కొంపముంచింది 
ఈబీసీలకు రిజర్వేషన్లు 
బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వలసవచ్చిన వారిని వెనక్కి పంపివేస్తామని అమిత్‌షా, మోదీలు చెప్పడం. ఇప్పటికే ఎన్‌ఆర్‌సీ బిల్లును లోక్‌సభ ఆమోదించడం 
తృణమూల్‌ కాంగ్రెస్‌లో పెరిగిపోయిన అవినీతి 
బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన నటులు తృణమూల్‌ తరఫున ప్రచారం నిర్వహించడంపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడం 
యువతకు ఉద్యోగాలు లేకపోవడం 
మమత పాలనలోనే శారదా, రోజ్‌ వ్యాలీ కుంభకోణాలు జరగడం 
కమ్యూనిస్టులు, తృణమూల్‌ కాంగ్రెస్‌లలోని పెద్ద తలయకాయలు కొన్ని కమలదళం పంచన చేరడం

 

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.