Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 120941
            [news_title_telugu_html] => 

ఓడినా.. నైతిక విజయం నాదే

[news_title_telugu] => ఓడినా.. నైతిక విజయం నాదే [news_title_english] => [news_short_description] => సాంకేతికంగా ఓటమి చెందినా.. నైతిక విజయం తనదేనని చేవెళ్ల లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. తెరాస నుంచి బయటికి వచ్చినప్పుడే గెలిచానని వ్యాఖ్యానించారు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => https://www.youtube.com/embed/QkhyNxezuII [news_videoinfo] => https://www.youtube.com/embed/QkhyNxezuII [news_sections] => ,24,23, ) )
ఓడినా.. నైతిక విజయం నాదే - EENADU
close
ఓడినా.. నైతిక విజయం నాదే

చేవెళ్ల లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: సాంకేతికంగా ఓటమి చెందినా.. నైతిక విజయం తనదేనని చేవెళ్ల లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. తెరాస నుంచి బయటికి వచ్చినప్పుడే గెలిచానని వ్యాఖ్యానించారు. గతంలో కంటే ఈసారి దాదాపు లక్ష ఓట్లు అధికంగా వచ్చాయని సంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి మీద ఎంత కసితో ఉన్నారో.. తనపైనా అంతకంటే ఎక్కువ కసితో కేసీఆర్‌, కేటీఆర్‌ ఉన్నారని.. తనను రాజకీయంగా హత్య చేయాలని వెంటపడి వేధించారని ఆరోపించారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే టి.రాంమోహన్‌రెడ్డి తదితరులతో కలిసి విశ్వేశ్వర్‌రెడ్డి శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలు తనను ఆదరించారని, అర్బన్‌ ప్రాంతంలో ఓట్లు తక్కువ వచ్చాయన్నారు. ఓడినా.. చేవెళ్ల ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటానన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెట్టారని. చివరికి రాహుల్‌గాంధీ సభకు కూడా అనుమతి ఇవ్వలేదన్నారు. తెరాస పతనం మొదలైందని అందుకే కరీంనగర్‌, నిజామాబాద్‌లలో ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారన్నారు.

 

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.