Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 131979
            [news_title_telugu_html] => 

రాహుల్‌ కనుసన్నల్లో సమష్టిగా..

[news_title_telugu] => రాహుల్‌ కనుసన్నల్లో సమష్టిగా.. [news_title_english] => [news_short_description] => కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిలో రాహుల్‌ గాంధీ కొనసాగటంపై ఏర్పడిన అనిశ్చితిని తొలగించేందుకు ఆ పార్టీ సీనియర్లు రంగంలోకి దిగారు. ప్రస్తుత పరిస్థితి పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని భావిస్తున్న ఆ నేతలు మూడు రకాల ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు తెలిసింది. సీనియర్‌ నేతలైన ఏకే ఆంటోనీ, అహ్మద్‌ పటేల్‌, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/iW5c7qeHMuk [news_videoinfo] => |https://www.youtube.com/embed/iW5c7qeHMuk [news_sections] => ,24,23, ) )
రాహుల్‌ కనుసన్నల్లో సమష్టిగా.. - EENADU
close
రాహుల్‌ కనుసన్నల్లో సమష్టిగా..

  పార్టీ సారథ్యంపై అనిశ్చితిని  తొలగించటానికి కాంగ్రెస్‌  సీనియర్ల ప్రతిపాదనలు
  మరో రెండు సూచనలూ  ఆయన ముందుకు
  త్వరలో అధినేతను కలిసేందుకు నిర్ణయం
ఈనాడు - దిల్లీ

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిలో రాహుల్‌ గాంధీ కొనసాగటంపై ఏర్పడిన అనిశ్చితిని తొలగించేందుకు ఆ పార్టీ సీనియర్లు రంగంలోకి దిగారు. ప్రస్తుత పరిస్థితి పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని భావిస్తున్న ఆ నేతలు మూడు రకాల ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు తెలిసింది. సీనియర్‌ నేతలైన ఏకే ఆంటోనీ, అహ్మద్‌ పటేల్‌, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, మల్లికార్జున్‌ ఖర్గే, వీరప్ప మొయిలీ, గులాంనబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మ, పృథ్వీరాజ్‌ చవాన్‌, అమరీందర్‌ సింగ్‌, అశోక్‌ గహ్లోత్‌ తదితరులు త్వరలోనే రాహుల్‌ గాంధీని కలవనున్నట్లు సమాచారం. రాహులే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగేలా ఒప్పించేందుకు తొలుత యత్నిస్తారు. అప్పటికీ మనసు మార్చుకోకపోతే తమ ప్రతిపాదనలను ఒక్కొక్కటిగా ఆయనకు వివరిస్తారు.

1. సమష్టి నాయకత్వం
కార్యనిర్వాహక అధ్యక్షుల(వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌) బృందానికి రాహుల్‌ నాయకత్వం వహించాలి. కార్యనిర్వాహక అధ్యక్షులు దేశంలోని వివిధ ప్రాంతాల వారీగా పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. అధికారాల వికేంద్రీకరణ లక్ష్యంగా పార్టీ పార్లమెంటరీ బోర్డు యంత్రాంగాన్ని పునర్‌వ్యవస్థీకరిస్తారు. కీలకమైన అంశాలపై పార్టీ అధ్యక్షుడికి సలహాలివ్వటం, పార్లమెంటులో, రాష్ట్రాల అసెంబ్లీల్లో అనుసరించాల్సిన వైఖరులు, తీసుకోవాల్సిన నిర్ణయాలను ఖరారు చేయటం వంటి విధులను పార్లమెంటరీ బోర్డు నిర్వర్తిస్తుంది. పార్టీ పార్లమెంటరీ బోర్డును పునరుద్ధరించటం ద్వారా రాజకీయ వాస్తవికతతో సంబంధంలేని వ్యక్తులిచ్చే అనుభవ రహిత సలహాలను అడ్డుకోవచ్చని పార్టీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.

2. సోనియాకు అధ్యక్ష బాధ్యతలు
సమష్టి నాయకత్వంలోనూ పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగనని రాహుల్‌ పట్టుపడితే సోనియాని ఆ బాధ్యతలు స్వీకరించాలని కోరుతారు. పార్టీ నిర్వహణలో ఆమెకు సహాయపడేందుకు ఇద్దరు కార్యనిర్వాహక అధ్యక్షులు ఉంటారు. కీలకమైన నిర్ణయాలన్నీ సోనియానే తీసుకుంటారు. అయితే, 2024 సార్వత్రిక ఎన్నికలకు రెండు,మూడేళ్ల ముందే పార్టీ అధ్యక్ష బాధ్యతలను తీసుకోవటానికి రాహుల్‌ అంగీకరించాల్సి ఉంటుంది.

3. నెహ్రూ-గాంధీ కుటుంబేతరులకు..
సోనియాను పార్టీ అధ్యక్షురాలిగా చేయాలన్న ప్రతిపాదనను రాహుల్‌ తిరస్కరించినా, ఒకవేళ సోనియానే అంగీకరించకున్నా మూడో ప్రత్యామ్నాయం తెరపైకి తీసుకొస్తారు. దీని ప్రకారం నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తిని ఆ పదవికి ఎంపిక చేయాల్సిన బాధ్యత రాహుల్‌దే.
ఈ ప్రతిపాదన రాహుల్‌కు ఆమోదనీయమైతే...కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు అవకాశం ఉందని భావిస్తున్న వారిలో పృథ్వీరాజ్‌ చవాన్‌, ఏకే ఆంటోనీ, మల్లికార్జున్‌ ఖర్గే పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నెహ్రూ-గాంధీ కుటుంబేతర వ్యక్తి పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టినప్పటికీ ఒక విడత మాత్రమే కొనసాగుతారని, 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి రాహుల్‌ గాంధీ సారథ్య బాధ్యతలు స్వీకరిస్తారని పార్టీ ఆంతరంగికుడు ఒకరు అభిప్రాయపడ్డారు

 

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.