close
ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం కక్షపూరితమే

  జగన్‌పై మండిపడ్డ తెదేపా నేతలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రజావేదిక అక్రమ కట్టడమైతే అందులో ప్రభుత్వ సమావేశాన్ని ఎందుకు నిర్వహించారని ఏపీ తెదేపా నేతలు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కేటాయించాల్సి వస్తుందనే ప్రజావేదికను కూల్చాలన్న కక్షపూరిత నిర్ణయం తీసుకున్నారని ధ్వజమెత్తారు. చట్టపరంగా తగిన అనుమతులతోనే గత ప్రభుత్వం దాన్ని నిర్మించిందని పేర్కొన్నారు. సోమవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తెదేపా శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే మద్దాలి గిరి, ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, అశోక్‌బాబు, మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర తదితరులు సమావేశమయ్యారు. ‘ప్రజావేదిక ప్రభుత్వ అవసరాల కోసం నిర్మించిన ప్రజల ఆస్తి. రాజధానికి వచ్చినప్పుడు అధికారులతో సమావేశాలు, ప్రజల నుంచి వినతుల స్వీకరణకు ఏ మాత్రం అవకాశం లేని పరిస్థితి.  అలాంటి సమయంలో ప్రజావేదికను నిర్మించారు. మీరు (సీఎం జగన్‌) ఐదేళ్ల తర్వాత రాష్ట్రానికి వచ్చి అది అక్రమమని, కూల్చేస్తామని అంటున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో ప్రజల వినతులు తీసుకునేందుకు ప్రజావేదిక భవనాన్ని కేటాయించాలని కోరాం. మా అభ్యర్థనపై నిర్ణయం తీసుకోకుండా కూల్చివేయాలని ఏకపక్షంగా ఎలా నిర్ణయిస్తారు?’ అని ప్రశ్నించారు.
జగన్‌ తుగ్లక్‌ను గుర్తుకు తెస్తున్నారు.. యనమల: ప్రజావేదిక కూలగొడతామనడం తుగ్లక్‌ చర్య అని, ఆయన పాలనను గుర్తుకు తెస్తున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. కొత్త భవనాల నిర్మాణంపై దృష్టి పెట్టకుండా ఉన్నవి కూలగొట్టడం ఏమాత్రం సరికాదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.