close
పురపాలక ఎన్నికల్లో సత్తా చాటుదాం

చేరికలను మరింత ప్రోత్సహించాలి
 భాజపా కోర్‌ కమిటీ సమావేశంలో నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో త్వరలో జరగనున్న పురపాలక ఎన్నికల్లో సత్తా చాటాలని భాజపా నిర్ణయించింది. ఎన్నికల నేపథ్యంలో ప్రతి పురపాలక సంఘానికి బాధ్యుల్ని నియమించి ఇప్పటి నుంచే పార్టీపరంగా కార్యాచరణ అమలు చేయాలని సోమవారం పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన కోర్‌కమిటీ సమావేశంలో తీర్మానించారు. పురపాలక ఎన్నికలతో పాటు హుజూర్‌నగర్‌ శాసనసభ స్థానంపైనా ప్రత్యేక దృష్టి సారించాలని, ఎన్నికల దిశగా పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. హుజూర్‌నగర్‌కు ఇన్‌ఛార్జి నియామకం, పార్టీ టికెట్‌ ఆశిస్తున్న అయిదుగురు ఆశావహులతో సమన్వయం చేసుకునేలా చర్చించారు. ఇప్పటివరకూ హుజూర్‌నగర్‌లో సంస్థాగతంగా బలంగా లేకున్నా కాంగ్రెస్‌, తెరాసల్లోని అసమ్మతిని సద్వినియోగం చేసుకోవాలనే అంశంపై చర్చించారు. భాజపా సభ్యత్వ నమోదుపై చర్చిస్తూ ఇప్పుడున్న నమోదును రెట్టింపు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలో 34 వేల పోలింగ్‌ బూత్‌లు ఉండగా ప్రతి బూత్‌కు కనీసం 50 మందిని కొత్తగా సభ్యత్వ నమోదు చేయించడం లక్ష్యంగా నిర్దేశించనున్నారు. పార్టీలో చేరికలను ప్రోత్సహించాలని.. వివిధ పార్టీల నేతలనే కాకుండా ఇతర రంగాలకు చెందిన వారిని చేర్చుకునేందుకు ప్రాధాన్యమివ్వాలని నేతలు అభిప్రాయపడ్డారు. సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఎమ్మెల్యే రాజాసింగ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.