close
వర్గీకరణపై కేంద్రం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి

 మంద కృష్ణ మాదిగ

బౌద్ధనగర్‌, న్యూస్‌టుడే: వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. హైదరాబాద్‌లోని సంస్థ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే మోదీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. అలా చేయని పక్షంలో ·తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించినట్లు అఖిలపక్షాన్ని ఆయన నాయకత్వంలో దిల్లీకి తీసుకెళ్లాలని, తెలంగాణలో అత్యధికంగా ఉన్న మాదిగ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం కల్పిస్తూ మంత్రి పదవినివ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌.. వర్గీకరణపై వైఖరిని తన తండ్రి రాజశేఖర్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రకటించాలన్నారు. ప్రత్యేకహోదాపై ఏ విధంగా కేంద్రంతో మాట్లాడుతున్నారో అదే విధంగా వర్గీకరణ అంశంపైనా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఈ నెల 27, 28 తేదీల్లో మేడారంలో జాతీయ కమిటీ, ఆగస్టు 1న ఎమ్మార్పీఎస్‌ విద్యార్థి విభాగం జాతీయ సమావేశాన్ని ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహిస్తామన్నారు. 2న హైదరాబాద్‌లో మహిళా సదస్సు, 3న ఖమ్మంలో యువ సమ్మేళనం, 4న అమరావతిలో ఉద్యోగుల సదస్సు, అనంతరం మాదిగ లాయర్లు, జర్నలిస్టుల సమావేశాలు నిర్వహిస్తామన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.