close
ఇంటర్‌ బాధిత కుటుంబాలను ఆదుకుంటాం

అఖిలపక్ష నేతల వెల్లడి

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: ఆత్మహత్యలకు పాల్పడ్డ ఇంటర్‌ విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడమే కాకుండా, ప్రతిపక్షాలను కూడా నియంత్రిస్తుండడం దారుణమని వివిధ పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కుటుంబాలకు తాము అండగా ఉంటామని తెదేపా, కాంగ్రెస్‌, సీపీఐ, తెజస నేతలు భరోసా ఇచ్చారు. ఆత్మహత్యకు పాల్పడ్డ మహేశ్వరి అనే విద్యార్థిని తల్లికి రూ.లక్ష చెక్కును మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, తెజస అధ్యక్షుడు కోదండరాం తదితరుల చేతులమీదుగా అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తాజాగా విడుదల చేసిన సప్లిమెంటరీ పరీక్షల్లోనూ ఇంటర్‌ బోర్డు అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. స్వచ్ఛంద సంస్థను స్థాపించామని.. దీని ద్వారా విద్యార్థుల కుటుంబాలకు సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు.  బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తార్నాక శాఖలో ఖాతా తెరిచామని.. దాతలు తమ సాయాన్ని దీని ద్వారా అందజేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.
బ్యాంకు ఖాతా వివరాలు: Telangee Peoples Society, A/ C No.33260100009102, Bank of Baroda, Tarnaka Branch. IFSC Code: BARBOTARNAK

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.